శివాజీనగర: విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యమైన టెన్త్ పరీక్షలు రానేవచ్చాయి. రాష్ట్రమంతటా నేడు సోమవారం నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ బెడద వల్ల పరీక్షలు జరపకుండానే అందరినీ ఉత్తీర్ణులను చేశారు. అయితే ఈసారి కోవిడ్ లేకపోవడంతో మామూలుగా పరీక్షలు జరుగుతున్నాయి.
ఉదయం 10:30 నుంచి ఆరంభం
- రాష్ట్రంలో మొత్తం 3,444 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
- పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు జరుగుతుంది.
- 5,387 పాఠశాలల నుంచి మొత్తం 8,73,846 మంది విద్యార్థులు రాయబోతున్నారు. ఇందులో 4,52,732 బాలురు, 4,21,110 బాలికలు, శారీరక, మానసిక దివ్యాంగ విద్యార్థులు 5,307 మంది ఉన్నారు.
- అక్రమాల నివారణకు విస్తృతంగా స్క్వాడ్‌లను నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్ క్రింద నిషేధాజ్ఞలను విధించారు.
- విద్యార్థులు హాల్‌టికెట్‌ను చూపించి కేఎస్‌ఆర్‌టీసీ, బీఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
- సమాధాన పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ఏప్రిల్ 21 నుంచి జరుగుతుంది.
హిజాబ్‌కు అనుమతి లేదు: విద్యామంత్రి
కోర్టు ఆదేశాన్ని పాటించి విద్యార్థులు హిజాబ్‌తో కాకుండా యూనిఫాం ధరించి పరీక్ష రాయాలి. హిజాబ్ కోసం పరీక్షను కాదనుకుంటే మళ్లీ పరీక్ష కూడా ఉండదని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ ఆదివారం తెలిపారు. హిజాబ్ ధరించి వచ్చే వారిపై పోలీసులు చర్యలు తీసుకొంటారన్నారు.
Education Minister Statement: టెన్త్ పరీక్షలు షురూ.. హిజాబ్‌పై విద్యాశాఖ మంత్రి సంచలన ప్రకటన
Published Mon, Mar 28 2022 7:12 AM | Last Updated on Mon, Mar 28 2022 9:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment