సాక్షి, హైదరాబాద్: ఒకటి నుంచి 9వ తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించేందుకు విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 7, 10, 13, 14, 15, 16 తేదీల్లో పరీక్షలను నిర్వహించేలా గురువారం డీఈవోలకు టైం టేబుల్‌తో కూడిన ఆదేశాలు జారీ చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనం కూడా 7వ తేదీ నుంచే ప్రారంభించి 17లోగా పూర్తి చేయాలని, 18న జవాబు పత్రాలను విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు పంపించాలని పేర్కొంది. 7వ తేదీ నుంచి 19వ తేదీలోగా వాటిని రికార్డుల్లో నమోదు చేయాలని, 20న తల్లిదం డ్రులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిం చాలని చెప్పింది. 21వ తేదీ నుంచి పై తరగతుల బోధనను ప్రారంభించాలని విద్యా శాఖ స్పష్టం చేసింది.