
తాగునీరు, కరువు సమస్యలపై నివేదికలు ఇవ్వండి
జిల్లాలో తాగునీరు, కరువు సమస్యలపై శాసన సభ్యులకు వారం రోజులో నివేదికలు అందించాలని ఆదేశాలు ....
ఆలమట్టి నుంచి రోజు 200 క్యుసెక్కుల నీరు విడుదల
రాయచూరు రూరల్ : జిల్లాలో తాగునీరు, కరువు సమస్యలపై శాసన సభ్యులకు వారం రోజులో నివేదికలు అందించాలని ఆదేశాలు చేసినట్లు రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన జిల్లాధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తాగునీటిపై యుద్ధప్రాతిపదికన తాగునీటి పథకాలకు త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించి మార్చి నాటికి నీరందించాలని అధికారులను కోరామన్నారు. వారం రోజులలో టాస్క్‌ఫోర్సు సమావేశం ఏర్పాటు చేసి నివేదికలు అందించాలని శాసన సభ్యులకు వివరించామన్నారు.
అవ సరం ఉన్న చోట్ల నీటి ట్యాంకుల ద్వారా పంపిణీ చేయాలని కోరామన్నారు. రాయచూరు జిల్లాలో తాగు నీటి కోసం ప్రతి శాసన సభ్యుడికి రూ.50 లక్షల నిధులు ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించామన్నారు. జిల్లాలో తాగునీరు, విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ఆలమట్టి నుంచి ప్రతి రోజు 200 క్యుసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని వివ రించారు. తెలంగాణ ప్రజలు కృష్ణ నదీ తీర ప్రాంతంలో రింగ్ బండ్‌లను తొలగించకుండా చర్యలు తీసుకువాలని జిల్లాధికారి సింథల్‌కు సూచించామని వివరించారు. సమావేశంలో శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బాదర్లి హంపన గౌడ, జిల్లాధికారి శశికాంత్ సింథల్, సీఈఓ కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.