
మంత్రి మొబైల్ ఫోన్‌ను లాక్కుని పారిపోయిన దుండగులు
చెన్నై : ఆదమరిస్తే దొంగలు ఎంతటి దుస్సాహసానికైనా ఒడిగడతారనేందుకు ఉదాహరణగా పుదుచ్చేరిలో ఓ ఘటన వెలుగు చూసింది. పుదుచ్చేరి విద్యా శాఖ మంత్రి ఆర్ కమలకణ్ణన్ బీచ్ రోడ్‌లో సెక్యూరిటీ లేకుండా వాకింగ్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆయన మొబైల్ ఫోన్‌ను లాక్కుని పరారయ్యారు. మంత్రి ఫిర్యాదుపై చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. పోన్‌ను కాజేసిన దుండగులను అదుపులోకి తీసుకునేందుకు బీచ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు.