హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈ రోజు సాయంత్రం ఇరు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో సమావేశంకానున్నారు. ఎంసెట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో గవర్నర్ మంత్రులను చర్చలకు పిలిచారు.
కాగా ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్యాహ్నం గవర్నర్తో భేటీ అయ్యారు. ఎంసెట్ నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇక తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి శుక్రవారం గవర్నర్ను కలిశారు. ఇరు రాష్ట్రాల విద్యా శాఖల మంత్రులు భిన్నవాదనలు వ్యక్తం చేస్తుండటంతో సమస్య పరిష్కారం కోసం గవర్నర్ మరోసారి చర్చించనున్నారు.
ఎంసెట్ వివాదంపై మంత్రులతో చర్చించనున్న గవర్నర్
Published Sat, Jan 3 2015 4:33 PM | Last Updated on Thu, Jul 11 2019 5:20 PM
Advertisement
Advertisement