'పిల్లలపై ఆంగ్ల బోధనను ఒకేసారి రుద్దం' | Minister Adimulapu Suresh Comments About English Medium Schools In Ongole | Sakshi
Sakshi News home page

'పిల్లలపై ఆంగ్ల బోధనను ఒకేసారి రుద్దం'

Published Sun, Nov 10 2019 12:36 PM | Last Updated on Sun, Nov 10 2019 2:37 PM

Minister Adimulapu Suresh Comments About English Medium Schools In Ongole - Sakshi

సాక్షి, ప్రకాశం : రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్న ఆంగ్ల మాద్యమం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో మేలు జరగనుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఒంగోలు క్యాంప్‌ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించిన సురేష్‌ మాట్లాడుతూ.. పిల్లలెవరు ఆంగ్ల బోధనకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకేసారి రుద్దకుండా దశలవారిగా ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్య కోసం పెద్ద పీట వేశారని తెలిపారు. అందుకోసం ప్రభుత్వ బడ్జెట్‌లో విద్య కోసం 16 శాతం కేటాయించినట్లు గుర్తుచేశారు. ఈ నెల 14న ఒంగోలు నుంచే సీఎం జగన్‌ నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement