Hindi Speakers Sell Pani Puris In Coimbatore - Sakshi
Sakshi News home page

అమిత్‌ షాకు కౌంటర్‌.. హిందీ మాట్లాడేవాళ్లు పానీపూరి అమ్ముకుంటున్నారు

Published Fri, May 13 2022 5:03 PM | Last Updated on Fri, May 13 2022 8:03 PM

Hindi Speakers Sell Pani Puris In Coimbatore - Sakshi

హిందీ భాషపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ‍్యలపై ఇప్పటికీ కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. ఆయన వ్యాఖ‍్యలను మొదటి నుంచి తమిళనాడు సర్కార్‌, సీఎం స్టాలిన్‌ ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ‍్యలు చేశారు.  

వివరాల ప్రకారం.. కోయంబ‌త్తూర్‌లోని భార‌తీయ‌ర్ యూనివ‌ర్సిటీలో శుక‍్రవారం జ‌రిగిన స్నాత‌కోత్స‌వ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి కే పొన్నుడి మాట్లాడుతూ.. హిందీ మాట్లాడేవారు కోయంబ‌త్తూర్‌లో పానీపూరీలు అమ్ముకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. హిందీ భాష మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించేదే అయితే ఉత్తర భారతీయులు ఇక్కడ(తమిళనాడులో) పానీ పూరీ ఎందుకు అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఇంగ్లీష్‌, త‌మిళ్ మాట్లాడుతారని అన్నారు. అలాగే, తాము అంత‌ర్జాతీయ భాష‌గా ఇంగ్లీష్ నేర్చుకుంటుండ‌గా ఇత‌ర భాషల‌తో ప‌నేముందని మంత్రి ఆయ‌న ప్ర‌శ్నించారు. 

మరో అడుగుముందుకేసి.. హిందీ కేవ‌లం ఆప్ష‌న‌ల్ ల్యాంగ్వేజ్ మాత్ర‌మేన‌ని, దాన్ని నేర్చుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి కాద‌ని కుండబద్దలుకొట్టారు. త‌మిళ విద్యార్ధులు ఏ భాష నేర్చుకునేందుకైనా సిద్ధంగా ఉంటార‌ని చెప్పారు. అంతకు ముందు.. హిందీ జాతీయ భాష కాదంటూ కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: మీ ఇంటిని కూల్చివేస్తామంటూ బీజేపీ చీఫ్‌కు వార్నింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement