
ముంబై: వచ్చే వారం నుంచే పాఠశాలలు తెరుకోనున్నాయని, అన్ని తరగతులు ప్రారంభమవుతాయని మహారాష్ట్ర విద్యామంత్రి వర్ష గైక్వాడ్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌ని అనుసరించే ఒకటి నుంచి 12 తరగతులు పాఠశాలలు ప్రారంభవుతాయని తెలిపారు. పైగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేఈ ప్రతిపాదనను అంగీకరించారని చెప్పారు.
ఈ మేరకు ఆరోగ్య మంత్రి రాజేష్ మాట్లాడుతూ..."పిల్లలు చదువుకు దూరమవుతున్నందున పాఠశాలలను తిరిగి తెరవాలంటూ కొన్ని వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి." అని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రంలోని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిపుణులతో చర్చించిన తర్వాత, కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్న సెషన్‌లను ప్రారంభించాలని నిర్ణయించామని విద్యామంత్రి గైక్వాడ్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 73,25,825కి చేరగా, మరణాల సంఖ్య 1,41,934కి పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది.
(చదవండి: ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!!)
Comments
Please login to add a commentAdd a comment