Varsha Gaikwad
-
లోక్‌సభ ఎన్నికలు 2024: చివరిదాకా ఉత్కంఠ, సత్తా చాటిన వర్షాతాయి
2024 లోక్‌సభ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో జరిగిన పోరులో మహారాష్ట్ర ఉద్ధవ్ సేన ఎట్టకేలకు తన ఆధిపత్యాన్ని నిరూపించుంది. ముంబై మహా వికాస్ అఘాడి (MVA) కీలక విజయాలను సాధించింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ పోరు తీవ్ర ఉత్కంఠగా నిలిచింది. ముంబై నార్త్‌లో కాంగ్రెస్ మళ్లీ ఘోర పరాజయాన్ని చవిచూస్తున్న క్రమంలో ఆ పార్టీ ముంబై అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ తన సత్తా చాటారు. ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిపై దాదాపు 16 వేల 514 ఓట్ల తేడాతో గెలుపొందారు.పాకిస్థాన్‌కు చెందిన అజ్మల్ కసబ్‌ను ఉరితీసిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఓట్ల లెక్కింపులో తొలి ట్రెండ్స్‌లో ఉజ్వల్ నికమ్ ఆధిక్యంలో ఉన్నారు. చివరి రౌండ్లలో తన ఆధిక్యాన్ని చాటుకుని వర్ష గైక్వాడ్ (49)విజయం సాధించారు.శివసేన ముంబై సౌత్, సౌత్ సెంట్రల్ , నార్త్ ఈస్ట్ మూడు చోట్ల పోరాడింది. హోరాహోరీగా సాగిన పోరులో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి అమోల్ కీర్తికర్ విజయం సాధించారు. నార్త్ ముంబై లోక్‌సభ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ పాటిల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజయం సాధించారు. ముంబై సౌత్ నియోజకవర్గంలో ఉద్ధవ్ వర్గానికి చెందిన అరవింద్ సావంత్ షిండేసేనకు చెందిన యామినీ జాదవ్‌పై 52 వేల 673 ఓట్ల తేడాతో గెలుపొందగా, ఉద్ధవ్ థాకరే విశ్వసనీయ సహచరుడు అనిల్ దేశాయ్ షిండేసేనకు చెందిన రాహుల్ షెవాలేపై 53 వేల 384 ఓట్లతో విజయం సాధించారు.ఎవరీ వర్షా గైక్వాడ్ధారవి నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దళిత మహిళ. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన ఆమె 2019 డిసెంబరు 30 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో మహారాష్ట్ర 11వ శాసనసభకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
Lok Sabha Election 2024: నికమ్ వర్సెస్ వర్షా
ముంబై నార్త్ సెంట్రల్. మినీ ముంబైగా పేరొందిన లోక్‌సభ స్థానం. ఆకాశాన్నంటే హార్మ్యాలతోపాటు మురికివాడలు ఇక్కడి ప్రత్యేకత. సెల్రబిటీలతో పాటు వలస కారి్మకులకూ నివాస స్థానం. మే 20న ఐదో విడతలో ఇక్కడ పోలింగ్ జరగనుంది. బీజేపీ నుంచి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, కాంగ్రెస్ నుంచి పార్టీ ముంబై చీఫ్ వర్షా గైక్వాడ్ బరిలో ఉన్నారు. గత రెండుసార్లూ గెలిచిన బీజేపీ హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తుండగా, తిరిగి పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ఉవి్వళ్లూరుతోంది...చట్టాలను సవరిస్తా.. ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్‌ను పక్కన పెట్టిన మరీ ప్రఖ్యాత లాయర్ ఉజ్వల్ నికమ్‌కు టికెటిచి్చంది. పూనం తండ్రి, బీజేపీ దిగ్గజం ప్రమోద్ మహాజన్ హత్య కేసును వాదించింది ఉజ్వలే కావడం విశేషం! ‘‘ఆ సమయంలో పూనంను దగ్గరగా చూశా. ఇక్కడ రెండుసార్లు గెలిచిన ఆమె ఈసారి నా విజయంలోనూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని నికమ్ చెబుతున్నారు. 1993 ముంబై వరుస పేలుళ్లు, 26/11 ముంబై దాడి వంటి హై ప్రొఫైల్ కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నికమ్ వాదించిన తీరును బీజేపీ ప్రచారంలో హైలైట్ చేస్తోంది. ‘‘రాజకీయాలు నా సెకండ్ ఇన్నింగ్స్. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. అదే నన్ను గెలిపిస్తుంది’’ అని నికమ్ ధీమాతో ఉన్నారు. ‘‘ప్రజల కోసం మేలైన చట్టాలను రూపొందించడానికి కృషి చేయాలనుకుంటున్నా. పారిపోయిన నేరగాళ్లను భారత్‌కు తీసుకువచ్చేలా అప్పగింత చట్టాలను సవరించాలనుకుంటున్నా’’ అని చెబుతున్నారు. వంచిత్ బహుజన్ అగాడీ, మజ్లిస్ అభ్యర్థులు కూడా ముంబై నార్త్ సెంట్రల్లో పోటీలో ఉన్నారు. రాజ్యంగ రక్షణ పోరాటంముంబై నార్త్ సెంట్రల్ కాంగ్రెస్ అభ్యర్థి వర్షా గైక్వాడ్ తండ్రి ఏక్నాథ్ గైక్వాడ్ గతంలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి వర్ష ప్రచారం ప్రారంభించారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన శివసేన సభ్యులు పారీ్టలో చీలిక తర్వాత ఉద్ధవ్ వెంటే ఉండటం కలిసొచ్చే అంశమని వర్షా అంటున్నారు. ‘‘ముంబై నార్త్ సెంట్రల్ తొలినుంచీ కాంగ్రెస్ కంచుకోట. ఈసారి నా విజయాన్ని పార్టీకి కానుకగా అందిస్తా’’ అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.వలస ప్రజల నిలయం... ముంబై ‘మినీ ఇండియా’ అయితే ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ స్థానం ‘మినీ ముంబై’. ఇందులో విలే పార్లే, చండీవలి, బాంద్రా, కలీనా, కుర్లా వంటి ప్రాంతాలున్నాయి. బాంద్రా, ఖర్‌లలో సినీ తారలు, ప్రముఖులు నివసిస్తారు. కుర్లాలో వలస కుటుంబాలు, కారి్మకులు ఎక్కువ. సుమారు 3 లక్షలమంది ఉత్తరాది రాష్ట్రాలవారు, లక్ష మంది దక్షిణాది ప్రజలు, 1.9 లక్షల మంది గుజరాత్, రాజస్థాన్ వాసులు నివసిస్తున్నారు. 3 లక్షలకు పైగా ముస్లింలున్నారు. ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, కాలుష్యం ఇక్కడి ప్రధాన సమస్యలు... – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెరుచుకోనున్న పాఠశాలలు!...వచ్చేవారం నుంచే తరగతుల ప్రారంభం!
ముంబై: వచ్చే వారం నుంచే పాఠశాలలు తెరుకోనున్నాయని, అన్ని తరగతులు ప్రారంభమవుతాయని మహారాష్ట్ర విద్యామంత్రి వర్ష గైక్వాడ్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌ని అనుసరించే ఒకటి నుంచి 12 తరగతులు పాఠశాలలు ప్రారంభవుతాయని తెలిపారు. పైగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేఈ ప్రతిపాదనను అంగీకరించారని చెప్పారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రి రాజేష్ మాట్లాడుతూ..."పిల్లలు చదువుకు దూరమవుతున్నందున పాఠశాలలను తిరిగి తెరవాలంటూ కొన్ని వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి." అని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రంలోని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిపుణులతో చర్చించిన తర్వాత, కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్న సెషన్లను ప్రారంభించాలని నిర్ణయించామని విద్యామంత్రి గైక్వాడ్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 73,25,825కి చేరగా, మరణాల సంఖ్య 1,41,934కి పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. (చదవండి: ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!!) -
ఇద్దరు మంత్రులు సహా 50మందికి కరోనా
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళనల నడుమే కరోనా కేసుల ఉధృతి కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా కేసులు అధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంది. తాజాగా మహా అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై కూడా కరోనా కోరలు చాచింది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సాధారణంగా నాగ్‌పూర్‌లో జరగాలి. కానీ, కరోనా ఎఫెక్ట్‌తో ఈసారి ముంబైలో నిర్వహించింది శివసేన సర్కార్. డిసెంబర్ 22న ప్రారంభమైన మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఐదు రోజుల సమావేశాల కారణంగా.. మొత్తం 50 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్వయంగా వెల్లడించారు. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉండడం గమనార్హం. మంత్రి వర్ష గైక్వాడ్ (ఫైల్ ఫొటో) ప్రశ్నోత్తరాల సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విద్యాశాఖ(పాఠశాల) మంత్రి వర్ష గైక్వాడ్(కిందటి ఏడాది కూడా ఆమె వైరస్ బారినపడ్డారు) కరోనా బారినపడ్డారు. మరో మంత్రి కేసీ పాడ్వికి కూడా వైరస్ సోకింది. ఇక శాసనసభలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పలువురు పోలీసులకు కూడా కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవార్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు కూడా నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. మంగళవారం 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. 22 మంది మరణించారు. అలాగే రాష్ట్రంలో 167 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. సంబంధిత వార్త: ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు.. 44 శాతం అధికంగా.. -
15 శాతం ఫీజు తగ్గించండి
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో 2021–22 విద్యా సంవత్సరానికి 15 శాతం ఫీజు తగ్గించాలని విద్యాశాఖ మంత్రి వర్షాగైక్వాడ్ ఆదేశించారు. ఫీజు తగ్గించని పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ మేరకు ఫీజుల తగ్గింపు విషయంపై మంత్రిమండలిలో సైతం ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం త్వరలో జారీ చేయనున్నట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులతో. గత సంవత్సరం మార్చిలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసింది. అప్పటి నుంచి అనేక మంది ఉపాధి కోల్పోయారు. వ్యాపారాలు మందగించాయి. అనేక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో కుటుంబాన్ని పోషించడమే కష్టంగా మారింది. ఇలాంటి సందర్బంలో పేదలతోపాటు మధ్య తరగతి కుటుంబాలు కూడా తమ పిల్లల స్కూలు ఫీజులు చెల్లించడం సాధ్యం కాలేదు. దీంతో విద్యార్థుల ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అనేక పాఠశాలలు ఫీజులు వసూలు చేయడం కొనసాగిస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు కొద్ది నెలల కిందట సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చింది. అంతేగాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూడసాగారు. ఆ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో 15 శాతం ఫీజు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు వర్షా గైక్వాడ్ తెలిపారు. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కొంత ఊరట లభించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేసే పాఠశాలల యాజమాన్యాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అదేవిధంగా కొన్ని పాఠశాలలు ఫీజు చెల్లించని విద్యార్థుల ఫలితాలు (రిజల్ట్), ప్రొగ్రెస్ కార్డు ఇవ్వలేదు. ఇలాంటి యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు. చెల్లించిన ఫీజులపై రాని స్పష్టత.. లాక్డౌన్ కారణంగా పాఠశాలలన్ని మూసే ఉన్నాయి. కొందరు ఉపాధ్యాయులు మినహా మిగతా బోధన, బోధనేతర సిబ్బంది అందరు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. విద్యార్థులకు కూడా ఆన్లైన్లోనే బోధన తరగతులు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో పాఠశాలల్లో విద్యుత్ వినియోగం, స్పోర్ట్స్, లైబ్రరీ, ల్యాబ్ ఇతర అనేక మౌలిక సదుపాయాల వినియోగం కాలేదు. దీంతో ఫీజులు తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో పేదలు, మధ్యతరగతి కుటుంబాల్లో కొంత ఆశలు చిగురించాయి. కానీ, ఇప్పటికే అనేక పాఠశాలలు అన్లైన్లో తరగతులు ప్రారంభించాయి. విద్యార్థులు ఆ తరగతులకు హాజరు అవుతున్నారు. దీంతో అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇదివరకే ఫీజులు చెల్లించారు. మరి వీరి సంగతేంటనేది ఇంకా స్పష్టం చేయలేదు. -
కరోనా వేళ మంత్రులకు కొత్త కార్లు
ముంబై: కరోనా పంజా విసురుతుండగా, ప్రజాధనంతో కొత్త కార్లు కొనుక్కోవడానికి మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. అధికారిక వాహనం కొనుగోలు చేసుకోవడానికి విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌కు అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే జూలై 3న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ ఇందుకోసం రూ.22.83 లక్షలు మంజూరు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తప్పుపట్టారు. కరోనా బాధితులను ఆదుకోవాల్సింది పోయి మంత్రులకు కొత్త వాహనాలు సమకూర్చడం ఏమిటని మండిపడ్డారు. కరోనాపై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వాయిదా వేస్తూ.. మంత్రుల కోసం ప్రజాధనం ఫలహారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
మహిళా ఎమ్మెల్యేకు బూతు మెసేజ్‌లు
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే వర్షా గైక్వాడ్ మొబైల్ ఫోన్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బూతు మేసేజ్‌లు వచ్చాయి. వర్షా గైక్వాడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 'చాలామంది మహిళ నేతలకు ఇలాంటి అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయి. పురుషాధిక్యం గల రాజకీయాల్లోకి వస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకోవడం ట్రెండ్‌గా మారింది. మావంటి వారి పరిస్థితే ఇలా ఉంటే, సామాన్య మహిళలకు వేధింపులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగలను. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా' అని వర్ష అన్నారు. ధరవి నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవలే మరో ఇద్దరు మహిళ నేతలకు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. శివసేన నాయకురాలు నీలమ్ గోర్ఖెను అత్యాచారం చేసి, చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఇక బీజేపీ నాయకురాలు షైనా మొబైల్ ఫోన్‌కు బూతు మెసేజ్‌లు వచ్చాయి. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
చిన్నారుల మరణాల్లో నా‘సిక్’
సాక్షి, ముంబై: వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్న చిన్నారుల మరణాల్లో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నాసిక్ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో యావత్మాల్-గడ్చిరోలి, ఠాణే మూడవ స్థానంలో ఉందని స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. రాష్ట్రంలో పోషకాహార లోపం వల్ల మరణించిన చిన్నారుల గణాంకాలను తెలియజేయాల్సిందిగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కోరగా గైక్వాడ్ ఈ వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మరణాలు కేవలం పోషక పదార్థాల లోపం వల్లనే కాకుండా రోగాలు సోకడం, ఇతర కారణాల వల్ల కూడా సంభవిస్తున్నాయని చెప్పారు. నిమోనియా, మలేరియా, జ్వరం, కామెర్ల వ్యాధి, డెంగీ వంటి వ్యాధులే కాకుండా ప్రమాదాల వల్ల కూడా చిన్నారుల మరణాలు సంభవిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. మృతుల వివరాలు జిల్లాల వారీగా పరిశీలించినట్లయితే నాసిక్ (1,563) మొదటిస్థానంలో ఉండగా, ఠాణే (833) రెండవ స్థానంలో నిలిచింది. తర్వాత పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ (427), విదర్భ, మరాఠ్వాడాలో చిన్నారుల మరణాలపై 427, 808 కేసులు నమోదయ్యాయని గైక్వాడ్ పేర్కొన్నారు. గైక్వాడ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2012-13 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడాది నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 5,400 మంది మరణించారు. గత ఏడాది ఈ సంఖ్య 5,344 . అదేవిధంగా 2010-11 మధ్య కాలంలో 6,604 చిన్నారుల మృతి కేసులు నమోదయ్యాయి. 2009-10లో 6,498 మంది చిన్నారులు, 2008-09 మధ్య కాలంలో 6,273 మంది మృత్యువాత పడ్డారు. కాగా, నెలలు నిండక ముందు పుట్టిన శిశు మరణాలు 2011-12 మధ్య కాలంలో 19,020 నమోదు కాగా, 2010-11 మధ్య కాలంలో 21,166 నమోదయ్యాయి. అదేవిధంగా 2009-10 మధ్య కాలంలో 21,699 నమోదవ్వగా, 2008-09లో 21,543 నమోదయ్యాయని ఆమె పేర్కొంది. మూఢనమ్మకాలు, నిరక్ష్యరాస్యత, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం, పోషకాహారం కొరవడడం తదితర కారణాల వల్లనే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఆమె పేర్కొంది. పోషకాహార లోపం వల్ల మరణించే శిశువుల సంఖ్యను తగ్గించేందుకు తాము సిరప్, టానిక్, ఇతర ఆయుర్వేదిక్ మందులను సరఫరా చేస్తున్నామని గైక్వాడ్ తెలిపారు.