2024 లోక్‌సభ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో జరిగిన పోరులో మహారాష్ట్ర ఉద్ధవ్ సేన ఎట్టకేలకు తన ఆధిపత్యాన్ని నిరూపించుంది. ముంబై మహా వికాస్ అఘాడి (MVA) కీలక విజయాలను సాధించింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ పోరు తీవ్ర ఉత్కంఠగా నిలిచింది. ముంబై నార్త్‌లో కాంగ్రెస్ మళ్లీ ఘోర పరాజయాన్ని చవిచూస్తున్న క్రమంలో ఆ పార్టీ ముంబై అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ తన సత్తా చాటారు. ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిపై దాదాపు 16 వేల 514 ఓట్ల తేడాతో గెలుపొందారు.
పాకిస్థాన్‌కు చెందిన అజ్మల్ కసబ్‌ను ఉరితీసిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఓట్ల లెక్కింపులో తొలి ట్రెండ్స్‌లో ఉజ్వల్ నికమ్ ఆధిక్యంలో ఉన్నారు. చివరి రౌండ్లలో తన ఆధిక్యాన్ని చాటుకుని వర్ష గైక్వాడ్ (49)విజయం సాధించారు.
శివసేన ముంబై సౌత్, సౌత్ సెంట్రల్ , నార్త్ ఈస్ట్ మూడు చోట్ల పోరాడింది. హోరాహోరీగా సాగిన పోరులో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి అమోల్ కీర్తికర్ విజయం సాధించారు. నార్త్ ముంబై లోక్‌సభ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ పాటిల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజయం సాధించారు. ముంబై సౌత్ నియోజకవర్గంలో ఉద్ధవ్ వర్గానికి చెందిన అరవింద్ సావంత్ షిండేసేనకు చెందిన యామినీ జాదవ్‌పై 52 వేల 673 ఓట్ల తేడాతో గెలుపొందగా, ఉద్ధవ్ థాకరే విశ్వసనీయ సహచరుడు అనిల్ దేశాయ్ షిండేసేనకు చెందిన రాహుల్ షెవాలేపై 53 వేల 384 ఓట్లతో విజయం సాధించారు.
ఎవరీ వర్షా గైక్వాడ్
ధారవి నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దళిత మహిళ. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన ఆమె 2019 డిసెంబరు 30 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో మహారాష్ట్ర 11వ శాసనసభకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment