సామాన్యురాలు... పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ | Sakshi
Sakshi News home page

సామాన్యురాలు... పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ

Published Thu, May 2 2024 10:43 AM

 Tims nurse Dasari Bharathi  contesting  Nagar kurnool MP seat VCK party

‘మా ప్రాంతంలోని పేదల కష్టాలే నన్ను పెద్దలతో తలపడేలా చేస్తున్నాయి’ అంటోంది దాసరి భారతి.
కోవిడ్‌ సమయంలో నర్స్‌గా పని చేసి ఎందరికో సేవ చేసిన భారతి
బాధితులకు న్యాయం జరగాలంటే చట్టం తెలియాలని ఎల్‌.ఎల్‌.బి. చదువుతోంది.
జోగులాంబ జిల్లా మేడికొండకు చెందిన 26 ఏళ్ల ఈ దళిత యువతి
నాగర్‌ కర్నూల్‌ ΄ార్లమెంట్‌ స్థానం నుంచి అధికారికంగా పోటీలో ఉంది.
‘జనం కోసం గొంతెత్తకుండా ఉండలేక΄ోతున్నాను’ అంటున్న భారతి పరిచయం.

‘నేను హైదరాబాద్‌ అ΄ోలో నర్సింగ్‌ కాలేజ్‌లో బీఎస్సీ నర్సింగ్‌ చదివాను. ఎమ్మెస్సీ నర్సింగ్‌ చేయాలని ఉండేది. నాకు మెరిట్‌ ఉన్నా సీట్‌ వచ్చినా కేవలం డబ్బుల్లేక ఒక సంవత్సరం ఆగాల్సి వచ్చింది. ఆ తర్వాత పాండిచ్చేరి జిప్‌మర్‌లో ఎమ్మెస్సీ నర్సింగ్‌ చదివాను. నాలా ఎందరో పేదింటి, దళిత, వెనుకబడ్డ వర్గాల యువతీ యువకులు చదువు కోసం బాధలు పడుతున్నారు. వారిని పట్టించుకునేది ఎవరు? వారి కోసం గొంతెత్తాలని ఎన్నికలలో నిలుచున్నాను’ అంటుంది దాసరి భారతి.

26 ఏళ్ల ఈ దళిత అమ్మాయి నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ‘విడుదలై చిరుతైగల్‌ కట్చి’ (వి.సి.కె.) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆమెకు ‘టీవీ రిమోట్‌’ను ఎన్నికల చిహ్నంగా కేటాయించారు. పాండిచ్చేరిలో చదివేటప్పుడు వి.సి.కె. పార్టీ కార్యక్రమాలు గమనించాను. అది దళితుల అభ్యున్నతి కోసం పని చేస్తున్న  పార్టీ. ఒక దళిత యువతిగా నేను ఆ పార్టీతో కలిసి పని చేయాలని భావించాను’ అని తెలిపింది భారతి.

జోగులాంబ జిల్లా మేడికొండ భారతి ఊరు. తండ్రి దాసరి రాములు కౌలు రైతు. తల్లి పద్మావతి గృహిణి. ‘మా నాన్న చనిపోయాడు. మేము నలుగురం పిల్లలం. చదువుకోవడానికి చాలా బాధలు పడాల్సి వచ్చింది’ అంది భారతి.

‘నా బాల్యం నుంచి చూస్తున్నాను. మా ఊరికి ఇప్పటికీ సరైన రోడ్డు లేదు. రోగాలొచ్చినా ఏమొచ్చినా చాలా కష్టం. ఒక నిండు చూలాలు అంబులెన్స్‌ ఎక్కి రోడ్డు గతుకుల వల్ల దారిలోనే డెలివరీ అయ్యి చని΄ోయిన సంఘటన  కళ్లారా చూశాను. నిధులన్నీ ఏమవుతున్నాయి? ఎం.ఎల్‌.ఏలు, ఎం.పి.లు, మంత్రులు ఏం చేస్తుంటారు? ఎందుకు పరిస్థితులు మార్చరు? కృష్ణ, తుంగభద్రల తీరంలో ఉండేదే మా ్ర΄ాంతం. కాని పశువులు తాగడానికి కూడా చుక్క నీరు ఇప్పుడు లేదు. రాజకీయ చైతన్యం ఉన్న యువత ఈ పరిస్థితిని ప్రశ్నించే వరకు మార్పు రాదు. అందుకే నేను ఎన్నికలలో నిలుచున్నాను’ అంది భారతి.

నాగర్‌ కర్నూల్‌లో పార్లమెంట్‌ స్థానానికి ప్రవీణ్‌ కుమార్‌ (బి.ఆర్‌.ఎస్‌), మల్లు రవి (కాంగ్రెస్‌), భరత్‌ కుమార్‌ (బి.జె.పి) పోటీలో ఉన్నారు. భారతి దగ్గర మందీ మార్బలం లేకపోయినా కేవలం తన ధర్మాగ్రహంతో వీరితో తలపడనుంది.

‘కోవిడ్‌ కాలంలో టిమ్స్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేశాను. పేదలు సరైన వైద్యం అందక, కార్పొరేట్‌ ఆస్పత్రులకు పోలేక మరణించారు. నాకు ముందు నుంచి కూడా విద్యార్థి రాజకీయాలన్నా, ఉద్యమాలన్నా ఇష్టం. నా విస్తృతి పెరగాలంటే నర్స్‌గా ఉంటే సరి΄ోదనిపించింది. అందుకే ఇప్పుడు ఎల్‌.ఎల్‌.బి. చదువు తున్నాను. నేను ఎలక్షన్లలో పోటీ చేస్తున్నానని తెలిసి మావాళ్లంతా సంతోషపడుతున్నారు. నాలాంటి వాళ్లు గెలిచి పేదలకు మేలు జరిగినప్పుడే కదా నిజమైన సంతోషం’ అని ముగించింది భారతి.     

Advertisement
Advertisement