సాక్షి, సిటీబ్యూరో: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో వీ హబ్ కార్యక్రమాలకు మద్దతు అందించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు వాధ్వాని ఫౌండేషన్ ప్రకటించింది. ఈ ఒప్పందం సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో వాధ్వాని ఫౌండేషన్ సీఈఓ సంజయ్‌షా మాట్లాడుతూ ఇప్పటి వరకు, వీ హబ్ మద్దతుతో 6 వేల మంది మహిళలు తమ వ్యాపారాలను విజయవంతంగా ప్రారంభించి, అభివృద్ధి చేసుకున్నారన్నారు.
తమ ఇరు సంస్థలు కలిసి మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లను ముందుకు నడిపించడానికి అంకితభావంతో కృషి చేస్తామన్నారు. మహిళలు పోటీ ప్రపంచంలో రాణించడానికి విస్తరించడానికి వారికి సాధనాలను సమకూర్చుతామని చెప్పారు. సమావేశంలో వీ హబ్ సీఈఓ సీతా పల్లచోళ్ల మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు పైగా విస్తరించడం ద్వారా వాధ్వాని ఫౌండేషన్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను గణనీయంగా ప్రభావితం చేసిందని, స్థిరమైన సామాజిక–ఆర్థిక మార్పుకు దోహదం చేసిందన్నారు.
అలాంటి ఫౌండేషన్‌తో భాగస్వామ్యం మహిళలను వృద్ధి పథంలోకి చేర్చే తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి రూపొందించిన కార్యక్రమాల ద్వారా మహిళల–నేతృత్వంలోని వ్యాపారాలను ప్రారంభించేందుకు దోహదం చేస్తామని, అదేవిధంగా మహిళా వ్యాపారవేత్తలు తమ స్టార్టప్ ప్రయాణంలో ఎదుర్కొనే క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వాధ్వాని ప్రతినిధులు తెలిపారు. వీ ఎంగేజ్ – స్పార్క్ (ఎర్లీ స్టేజ్) ప్రోగ్రామ్, వీ ఎంగేజ్ – ప్రొపెల్ (ఎర్లీ–ట్రాక్షన్ స్టేజ్)లు విజయవంతంగా అమలయ్యేలా చూస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment