‘చార్వ్య’ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు
సేవా కార్యక్రమాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన వేతనం.. ఆర్థికంగా అన్ని విధాలా స్థిరపడిన కుటుంబం.. ఇలాంటి సమయంలో యువత ఏం ఆలోచిస్తుంది.. మహా అయితే చర్మ సౌందర్యం.. బ్రాండెడ్ దుస్తులు, కార్లు, సెలవు రోజుల్లో రిలాక్స్ కోసంకుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రత్యేకంగా వీకెండ్ ప్లాన్స్ చేసుకుంటారు. దానికితోడు విలాసవంతమైన జీవితం కోరుకోవడం సహజం. అయితే హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావ్య మాత్రం పేద పిల్లలను చదివిస్తూ, ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీరుస్తూ, నాణ్యమైన దుస్తులు అందిస్తున్నారు. వారం రోజులు పనిదినాల్లో ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండే ఆమె సెలవు రోజుల్లో సేవా కార్యక్రమాలపై దృష్టిసారిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
ఆమె ఆలోచనలకు కుటుంబ సభ్యులు ఆమోదం తెలుపుతుండగా, సహచర ఉద్యోగులు సైతం సహకరిస్తున్నారు. 2019లో ప్రముఖ సంస్థలో ఆమె సాఫ్ట్‌వేర్ సంస్థలో చేరారు. కరోనా సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి 200లకుపైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అక్కడి నుంచి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో 2020లో చారిటీ విజిట్స్ యు ఆల్వేజ్ (చార్వ్య) పేరిట స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. సెలవు దినాల్లో కార్యక్రమాలు నడిపిస్తున్నారు.
మురికివాడలే లక్ష్యంగా..
నగర పరిధిలోని మురికి వాడలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వలస కారి్మకులు ఉండే ప్రాంతాలే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో సుమారు ఎంత మంది జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారు? వాళ్ల అవసరాలు తెలుసుకొని, అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నారు. ఆహారం, దుస్తులు, దుప్పట్లు, స్వెటర్లు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఆ ఆనందం వెలకట్టలేనిది..
ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, దుస్తులు, ఇతర సరుకులు అందించడం సంతోషంగా ఉంది. ఆ ఆనందం వెలకట్టలేనిది. ఇతరులు మంచి జీవితాన్ని పొందడానికి నా వంతు సాయం అందిస్తున్నా. నాకున్న అవకా శాల్లో ఒక మార్గం ఎంచుకొని ముందుకెళ్తున్నా.. కుటుంబ సభ్యులు సరే నీ ఇష్టం అన్నారు. నా వేతనం మొత్తాన్నీ చారిటీకే వెచి్చస్తున్నాను. మరింత మందికి సాయం చేసే అవకాశం కలి్పంచాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నా. – కావ్య, చార్వ్య, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు
Comments
Please login to add a commentAdd a comment