మహిళా ఎమ్మెల్యేకు బూతు మెసేజ్‌లు
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే వర్షా గైక్వాడ్ మొబైల్ ఫోన్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బూతు మేసేజ్‌లు వచ్చాయి. వర్షా గైక్వాడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
'చాలామంది మహిళ నేతలకు ఇలాంటి అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయి. పురుషాధిక్యం గల రాజకీయాల్లోకి వస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకోవడం ట్రెండ్‌గా మారింది. మావంటి వారి పరిస్థితే ఇలా ఉంటే, సామాన్య మహిళలకు వేధింపులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగలను. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా' అని వర్ష అన్నారు. ధరవి నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవలే మరో ఇద్దరు మహిళ నేతలకు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. శివసేన నాయకురాలు నీలమ్ గోర్ఖెను అత్యాచారం చేసి, చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఇక బీజేపీ నాయకురాలు షైనా మొబైల్ ఫోన్‌కు బూతు మెసేజ్‌లు వచ్చాయి. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.