lewd messages
-
21 ఏళ్ల యువతికి ఆరో తరగతి బాలుడి వేధింపులు
లక్నో: పిదప కాలం.. పిదప బుద్ధులు అంటే ఇవే. ఆరో తరగతి చదివే పిల్లాడు.. 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధిస్తున్నాడంటే.. ఏమనుకోవాలి. యువతి మార్ఫ్డ్ చిత్రాలను ఉపయోగించి డబ్బులు ఇవ్వు.. లేదంటే సెక్స్ చాట్ చేయాలంటూ వేధింపులుకు గురి చేస్తున్నాడో పిల్లాడు. ఆ వివరాలు.. ఘజియాబాధ్‌కు చెందిన బాధిత యువతి, సదరు పిల్లాడు విద్యార్థులు క్రియేట్ చేసిన ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో మెంబర్లు. ఈ గ్రూప్‌లో అన్ని వయసులు విద్యార్థులు ఉంటారు. జూనియర్లకు, సీనియర్ విద్యార్థులు అనుమానాలు నివృత్తి చేస్తూ.. బాగా చదువుకునేందుకు సాయం చేస్తూంటారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ పూర్తి చేసి.. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న యువతి ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యింది. 6వ తరగతి చదువుతున్న పిల్లాడు కూడా ఈ గ్రూప్‌లో మెంబర్.(ఆ వీడియోల కోసం యాహూ మాజీ ఉద్యోగి నిర్వాకం) అలా ఇద్దరికి పరిచయం. తొలుత పిల్లాడు, బాధిత యువతితో చదువుకు సంబంధించిన విషయాలు చర్చించేవాడు. అలా కొద్ది రోజుల పాటు చదువు గురించి మాట్లాడి మంచి వాడిగా నమ్మకం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17న ఉదయం 3.30గంటలకు సదరు పిల్లాడు, యువతి మొబైల్‌కు ఆమె మార్ఫ్డ్ చిత్రాలు పంపించాడు. ఇవి చూసి సదరు యువతి ఒక్కసారిగా బిక్క చచ్చిపోయింది. అంత చిన్న పిల్లాడు ఇలాంటి పాడు పనులు చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. ఈ మెసేజ్ గురించి ఆలోచిస్తుండగానే ఆ పిల్లాడు ఫోన్ చేసి.. ఆమె సోషల్ మీడియా అకౌంట్నుంచి ఫోటోలను తీసుకున్నాని.. తాను అడిగినంత డబ్బైనా ఇవ్వాలి.. లేదా తనతో సెక్స్ చాట్ చేయాలన్నాడు. లేదంటే యువతి మార్ఫ్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. అంతేకాక ఆమె ఫోన్‌ను హ్యాక్ చేశానని చెప్పాడు. దాంతో భయపడిన యువతి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంది. అనంతరం ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు సదరు పిల్లాడిని పిలిపించి మాట్లాడారు. కానీ వాడిలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.(ఆ హీరోయిన్‌కు సైబర్ షాక్) పిల్లాడిని, అతడి తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించగా.. మెసేజ్‌ల గురించి తనకు ఏం తెలియదని.. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు సదరు సోషల్ మీడియా కంపెనీతో మాట్లాడి యువతి, పిల్లాడి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని పంపాల్సిందిగా కోరారు. సైబర్ టీం ఐపీ అడ్రెస్‌ను ట్రేస్ చేసే పనిలో ఉంది. ఈ క్రమంలో పోలీసులు చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వవద్దని.. ఇచ్చినా వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. -
తల్లి ఫోన్‌తో ఓ కొడుకు అసభ్య నిర్వాకం..
ముంబయి: తప్పుడు మార్గంలో 20మంది అమ్మాయిల ఫోన్ నెంబర్లు తెలుసుకొని వారికి అసభ్యకరమైన సందేశాలు, ఫొటోలు పంపిస్తున్న ఓ ప్రబుద్ధుడిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి పనులను తాను కొన్ని నెలలుగా చేస్తున్నానని స్వయంగా అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే.. ముంబయిలో రోహణ్ డీ సౌజా అనే యువకుడు ఉన్నాడు. అతడు తొలుత ఏ అమ్మాయిల ఫేస్బుక్ ప్రొఫెల్స్కు ఫోన్ నెంబర్లు జమ చేసి ఉన్నాయో చూసేవాడు. ఆ తర్వాత అతడి తల్లి ఫోన్ నుంచి సందేశాలు పంపిస్తూ వివరాలు తెలుసుకునేవాడు. అసభ్యకరమైన, ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగేవాడు. ఉదాహరణకు మీరు ఈ రోజు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారు? లాంటి ప్రశ్నలు వేసేవాడు. పోలీసులు ఈ కేసుపై స్పందిస్తూ తాను ఈ పని ఎప్పటి నుంచో చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతంలో ఉండి అసభ్య సందేశాలు పంపించేవాడని తెలిపాడు. ఎట్టకేలకు అతడి నంబర్ ద్వారా బాంద్రాలోని మౌంట్ మేరి వద్ద అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. -
మహిళా ఎమ్మెల్యేకు బూతు మెసేజ్‌లు
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే వర్షా గైక్వాడ్ మొబైల్ ఫోన్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బూతు మేసేజ్‌లు వచ్చాయి. వర్షా గైక్వాడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 'చాలామంది మహిళ నేతలకు ఇలాంటి అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయి. పురుషాధిక్యం గల రాజకీయాల్లోకి వస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకోవడం ట్రెండ్‌గా మారింది. మావంటి వారి పరిస్థితే ఇలా ఉంటే, సామాన్య మహిళలకు వేధింపులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగలను. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా' అని వర్ష అన్నారు. ధరవి నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవలే మరో ఇద్దరు మహిళ నేతలకు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. శివసేన నాయకురాలు నీలమ్ గోర్ఖెను అత్యాచారం చేసి, చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఇక బీజేపీ నాయకురాలు షైనా మొబైల్ ఫోన్‌కు బూతు మెసేజ్‌లు వచ్చాయి. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
'పగలూ, రాత్రి నువ్వే కలలోకి వస్తున్నావు'
తాడేపల్లి : ‘పగలూ, రాత్రి, నువ్వే కలలోకి వస్తున్నావు... ముద్దు మురిపెంతో ఊరిస్తున్నావు... ఒక్క ముద్దు పెట్టకుంటే చచ్చిపోతా... కాళ్ళావేళ్ళా పడి బతిమిలాడుతున్నా కనికరించటంలేదు.. మర్యాదగా ముద్దు ఇస్తావా.. లేదంటే నువ్వు బాత్రూమ్లో స్నానం చేసేటప్పుడు ఫొటోలు తీశాను. వాటిని నెట్లో పెడతా’ అంటూ వివాహితను వెంటాడి వేధిస్తున్న ఓ ఆకతాయికి బాధితురాలి బంధువులు మంగళవారం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి... ఉండవల్లికి చెందిన సంధు సురేష్ ఆవారాగా తిరుగుతుంటాడు. కొద్ది రోజులుగా స్థానిక సీతానగరానికి చెందిన ఓ వివాహితను వెంట పడివేధిస్తున్నాడు. ఆమె ఫోన్ నంబరు సంపాదించి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నాడు. తనకు నిద్ర పట్టడంలేదని, కోరిక తీర్చాలని, కనీసం ముద్దైనా పెట్టాలంటూ వేధించసాగాడు. మొదట్లో అల్లరవుతానని భయపడ్డ బాధితురాలు ఎవరికీ విషయం చెప్పలేదు. వేధింపులు శృతిమించడం, బాత్రూమ్లో స్నానం చేస్తుండగా ఫొటోలు తీశానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగటంతో బాధితురాలు బంధువులకు విషయం చెప్పింది. వారి సూచన మేరకు సురేష్‌కు బాధితురాలు ఫోన్ చేసి మంగళవారం ప్రకాశం బ్యారేజీ వద్దకు రప్పించింది. అక్కడ కాపు కాసిన ఆమె బంధువులు ఆకతాయిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అతడి శరీరంపై దుస్తులు తొలగించి పోలీసులకు అప్పగించారు. అయితే యువతిని వేధించింది తాను కాదని, తన స్నేహితుడని బుకాయించేందుకు అతడు యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కుర్రాళ్ల వెకిలిచేష్టలు
లంగర్‌హౌస్: ప్రేమపేరుతో వేధించడమే కాకుండా అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్న ఇద్దరు యువకులు చివరకు కటకటాలపాలయ్యారు. లంగర్‌హౌస్ ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం..లంగర్‌హౌస్ పెన్షన్పురలో నివాసముండే ఓ యువతి (17) మెహిదీపట్నంలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. చాంద్రాయణగుట్టలో నివాసముండే మహ్మద్‌ఖాదర్(21) లంగర్‌హౌస్‌లోని బాగ్దాదీ దర్గా వద్ద పూలు అమ్ముతూ జీవిస్తున్నాడు. గత మూడునెలలుగా యువతి వెంట పడుతూ ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. అసభ్యపదజాలంతో రోజూ లంగర్‌హౌస్ నుంచి మెహిదీపట్నం వరకు ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. రోజురోజుకు అతని వేధింపులు ఎక్కువవడంతో విసుగు చెందిన ఆ యువతి విషయాన్ని ఆమె తమ్ముడు షోయబ్‌కు చెప్పింది. దీంతో షోయబ్ మంగళవారం ఉదయం దర్గా వద్దకు వెళ్లి ఖాదర్‌ను నిలదీశాడు. కోపోద్రిక్తుడైన ఖాదర్ కర్రతో షోయబ్‌పై దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఖాదర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అసభ్య మెసేజ్‌లు, ఈమెయిళ్లు.. సరూర్‌నగర్: ప్రేమంటూ ఓ యువతికి అసభ్య మెసేజ్‌లు, ఈమెయిల్స్ పంపుతూ వేధిస్తున్న ఓ విద్యార్థిపై మీర్ పేట పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ శ్రీధర్‌రెడ్డి వివరాల ప్రకారం..ఇబ్రహీంపట్నం శ్రీదత్త ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న నరేశ్(20) అదే కాలేజీకు చెందిన ఓ విద్యార్థినిని ప్రేమపేరుతో ఏడాదిన్నరగా వేధిస్తున్నాడు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా..వారు నరేశ్ కుటుంబసభ్యులను కలిసి హెచ్చరించారు. అయినా నరేశ్ ప్రవర్తన మార్చుకోకుండా సదరు యువతి సెల్‌ఫోన్‌కు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నాడు. విసిగివేసారిన యువతి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.