తల్లి ఫోన్‌తో ఓ కొడుకు అసభ్య నిర్వాకం..
ముంబయి: తప్పుడు మార్గంలో 20మంది అమ్మాయిల ఫోన్ నెంబర్లు తెలుసుకొని వారికి అసభ్యకరమైన సందేశాలు, ఫొటోలు పంపిస్తున్న ఓ ప్రబుద్ధుడిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి పనులను తాను కొన్ని నెలలుగా చేస్తున్నానని స్వయంగా అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే.. ముంబయిలో రోహణ్ డీ సౌజా అనే యువకుడు ఉన్నాడు.
అతడు తొలుత ఏ అమ్మాయిల ఫేస్‌బుక్ ప్రొఫెల్స్‌కు ఫోన్ నెంబర్లు జమ చేసి ఉన్నాయో చూసేవాడు. ఆ తర్వాత అతడి తల్లి ఫోన్ నుంచి సందేశాలు పంపిస్తూ వివరాలు తెలుసుకునేవాడు. అసభ్యకరమైన, ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగేవాడు. ఉదాహరణకు మీరు ఈ రోజు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారు? లాంటి ప్రశ్నలు వేసేవాడు. పోలీసులు ఈ కేసుపై స్పందిస్తూ తాను ఈ పని ఎప్పటి నుంచో చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతంలో ఉండి అసభ్య సందేశాలు పంపించేవాడని తెలిపాడు. ఎట్టకేలకు అతడి నంబర్ ద్వారా బాంద్రాలోని మౌంట్ మేరి వద్ద అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.