
ఎంసెట్ నిర్వహణపై గవర్నర్ సమక్షంలో చర్చలు
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీశ్ రెడ్డిల మధ్య జరిగిన సమావేశం ముగిసింది. ఎంసెట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు నష్టపోకుండా సమస్య పరిష్కారం కోసం చర్చలు జరిపారు.