న్యూఢిల్లీ: 'వి ఆర్ ది క్రేజీ బోయ్స్' అంటూ కొత్తగా మానవ వనరుల అభివృద్ధిశాఖ పగ్గాలు అందుకోబోతున్న ప్రకాశ్ జవదేకర్ అన్నారు. గురువారం బాధ్యతలు స్వీకరించనున్న ఆయన ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో తాము గొప్పగా పనిచేస్తామని చెప్పారు. బుధవారం ఓ మీడియాతో మాట్లాడిన జవదేకర్ ప్రధాని నరేంద్రమోదీ కలగంటున్న అభివృద్ధి ఎజెండాకు అనుకూలంగా ఫ్యాషన్, జీల్ తో పనిచేస్తామని అన్నారు.
'ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో సమర్థంగా పనిచేయగల టీం మాకుంది. ఇది భారత్ టీం. దీనికి అభివృద్ధి మాత్రమే కాకుండా సుస్థిర అభివృద్ధి కోసం పనిచేయాలన్న బలమైన కోరిక ఉంది. మేమంతా ఆ మార్గంలో పనిచేసే క్రేజీ బాయ్స్ లాంటి వాళ్లం' అంటూ జవదేకర్ అన్నారు. 'మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేసేవారికి కచ్చితంగా క్యాబినెట్ ర్యాంక్ అవసరం. అది సాంకేతికపరంగా కూడా' అని ఆయన అన్నారు. మార్పు సాకారానికి విద్య ఒక ఆయుధంలాంటిదని అన్నారు. అందుకోసం నాణ్యమైన విద్య అందించడం ఎంతో ముఖ్యం అని చెప్పారు. విద్యకు సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ శాఖ నిర్వహించిన స్మృతి ఇరానీ సలహాలు కూడా తీసుకుంటానని ఆయన చెప్పారు.
'మోదీ టీంలో మేమంతా క్రేజీ బోయ్స్'
Published Wed, Jul 6 2016 12:16 PM | Last Updated on Thu, Jul 11 2019 5:20 PM
Advertisement
Advertisement