irresponsibility
-
కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు చెంపపెట్టు
న్యూఢిల్లీ: నీట్–యూజీ అంశంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కాంగ్రెస్ బాధ్యతారాహిత్యానికి, చిల్లర రాజకీయాలకు చెంపపెట్టని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. సుప్రీం నిర్ణయం విద్యార్థుల ఓటమి కానేకాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రం ప్రభుత్వంపైనే కాదు, సుప్రీంకోర్టుపైనా విశ్వాసం లేదని విమర్శించారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ పేపర్ లీకేజీలు జరగడం తెలియదా అని ఆ పార్టీ చీఫ్ ఖర్గేను ఆయన ప్రశ్నించారు. అప్పటి ఘటనలపై ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. పేపర్ లీకేజీలకు, అవినీతికి తండ్రివంటిది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. రాజకీయ మనుగడ కోసం ఆ పార్టీ అబద్ధాలు, అరాచకాలనే నమ్ముకుందని మంత్రి మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలపైనే తప్ప, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఖర్గేకు, రాహుల్ గాం«దీకిగానీ, కాంగ్రెస్ పార్టీకిగానీ ఏమాత్రం పట్టింపు లేదని ఆరోపించారు. -
సమాజాన్ని చీలుస్తున్నాయి
న్యూఢిల్లీ: వార్తల ప్రసారంలో పలు చానళ్ల తీరును ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాధ్యతారాహిత్యంతో అవి సమాజాన్ని చీలుస్తున్నాయంటూ ఆగ్రహించింది. విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేసేలా చూడటంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. విద్వేష ప్రసంగాలు సమాజం పాలిట పెను బెడదగా పరిణమించాయంటూ ఈ సందర్భంగా మండిపడింది. వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాల్సిందేనని స్పష్టం చేసింది. బాధ్యతారాహిత ప్రసారాలతో సమాజంలో సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించే చానళ్లపై చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘‘మనకు కావాల్సింది సంతులనంతో కూడిన స్వేచ్ఛాయుతమైన మీడియా. కానీ హెచ్చు టీఆర్పీ రేటింగులు సాధించడమే ఈ రోజుల్లో వార్తల కవరేజీకి పరమావధిగా మారింది. అందుకోసం చానళ్లు తమలో తాము పోటీ పడుతూ ప్రతిదాన్నీ సంచలనాత్మంగా మారుస్తున్నాయి. చాలాసార్లు టీవీల్లో లైవ్ చర్చల్లో యాంకర్లు తామే సమస్యలో భాగంగా మారిపోతున్నారు. ప్యానల్లోని వ్యక్తులు మాట్లాడుతుండగానే ఇష్టారాజ్యంగా మ్యూట్ చేస్తున్నారు. వారికి తమ వాదన విన్పించే అవకాశమే ఇవ్వడం లేదు. టీవీ దృశ్య మాద్యమం కావడంతో పత్రికల కంటే చాలా శక్తిమంతమైనది. వీక్షకులను ఎంతో ప్రభావితం చేయగలుగుతుంది. దురదృష్టవశాత్తూ ప్రేక్షకుల్లో చాలామంది పరిణతి ఉన్నవాళ్లు కాదు. టీవీలు చూపించే దృశ్యాలను చూసి రెచ్చిపోకుండా ఉండటం కష్టం. ఈ నేపథ్యంలో పత్రికలకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాదిరిగా టీవీ ప్రసారాల విషయంలో ఎలాంటి నియంత్రణ వ్యవస్థా లేకపోవడం శోచనీయం’’ అంటూ జస్టిస్ జోసెఫ్ ఆందోళన వెలిబుచ్చారు. విద్వేష వ్యాఖ్యల వ్యాప్తి ద్వారా సమస్యలో భాగంగా మారుతున్న టీవీ న్యూస్ యాంకర్లను ప్రసారం నుంచి ఎందుకు తప్పించకూడదని ప్రశ్నించారు. చానళ్లు తీర్పరులుగా మారి విచారణ కూడా జరుపుతున్నాయంటూ ఆక్షేపించారు. ‘‘ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాయి. అతనింకా విచారణ ఎదుర్కొంటున్నాడు. ప్రతివారికీ పరువు ప్రతిష్టలుంటాయి’’ అన్నారు. పోలీసును పొడిచేసినా పట్టించుకోరా! ఢిల్లీలో ఇటీవల ఒక పోలీసు అధికారిని చైన్‌స్నాచర్ పట్టపగలు అందరి ముందే పొడిచేసినా ఎవరూ పట్టించుకోలేదని ఒక్కరూ అడ్డుకోలేదని జస్టిస్ నాగరత్న ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కానీ చానళ్లలో, బయటా మాత్రం ఎవరు ఏమైనా మాట్లాడే పరిస్థితి నెలకొంది. వార్తా చానళ్లు వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మన దేశంలో వాటిపై ఇప్పటికీ ఎలాంటి నియంత్రణలూ లేవు. భావ ప్రకటన స్వేచ్ఛ గొప్ప బాధ్యతతో కూడుకుని ఉంటుంది. టీవీ చానళ్లు విద్వేష ప్రసంగాల వ్యాప్తికి పాల్పడి కార్యక్రమాల నియమావళిని ఉల్లంఘిస్తే వాటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవచ్చు’’ అని స్పష్టం చేశారు. ఒకరిపై అలాంటి చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్లంతా దారికొస్తారని జస్టిస్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంలో ఇలాంటి వేలాది ఫిర్యాదులొచ్చాయని, సదరు చానళ్లపై చర్యలు కూడా తీసుకున్నామని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ చాలా సున్నితమైన అంశమని ధర్మాసనం పేర్కొంది. దానికి భంగం కలగని రీతిలో చానళ్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఈ సమస్య ఇప్పటికే కేంద్రం దృష్టిలో ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ బదులిచ్చారు. విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కు సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సమస్యగా మారొద్దు ‘‘ప్రత్యక్ష ప్రసారాల్లో చర్చలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత యాంకర్దే. యాంకరే సరిగా వ్యవహరించకపోతే భిన్నాభిప్రాయాలను అనుమతించరు. అవతలి వక్తను మ్యూట్ చేయడమో, వారిని అసలు ప్రశ్నలే అడగకపోవడమో చేస్తారు. ఇది పక్షపాతమే. ఇలాంటి సందర్భాల్లో యాంకర్లపై ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నారు? సమాజంపై ఎంతో ప్రభావం చూపగల అత్యంత బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నామని మీడియాలోని వ్యక్తులు అర్థం చేసుకోవాలి. సమస్యలో భాగంగా మారి మనసుకు ఏది తోస్తే అది మాట్లాడొద్దు’’ అంటూ ధర్మాసనం హితవు పలికింది. -
కష్టాన్ని జుట్టుపట్టిఈడ్చేసింది
కష్టం అలివిగాని జుట్టులా అదేంటో నెత్తి మీదే మొలుస్తుంది. పెద్ద భారమైపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చిక్కులుగా తయారవుతుంది. అలాగే భరిస్తూ కూచుంటే ఊడల్లాగా పాకుతుంది. ఎక్కడో మనలో దాగున్న మనోధైర్యాన్ని బయటికి తీసుకొస్తే ఆ కష్టాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చేయొచ్చు. ‘అమ్మా... బిడ్డల మొహం చూసి బతకాలమ్మా... కష్టం ఎప్పుడూ శాశ్వత చుట్టం కాదు.. ఏదో ఒక రోజు అది పెట్టె సర్దుకొని వచ్చినదారినే వెళ్లాల్సిందే’ అని ఆమె ఇచ్చిన మానసిక ధైర్యంతో ఆలోచన విరమించుకున్నా. మా స్వస్ధలం చీరాల. చిన్న వయసులోనే మా అమ్మానాన్నలు నాకు లోకేశ్వర్‌రావుతో పెళ్లి చేశారు. నా భర్తది బార్బర్ పని. ఆరుగురు పిల్లలు పుట్టారు. అందరూ కొడుకులే. నా భర్త ఉమ్మడి కుటుంబంలో ఉంటూ బార్బర్‌గా కుటుంబాన్ని పోషించేవాడు. పెళ్లయిన కొన్నాళ్లు మా జీవితం సజావుగానే సాగింది. మూడో పిల్లాడు కలిగేనాటి నుంచి నా భర్తలో మార్పులొచ్చాయి. చెడు అలవాట్లలో పడి ఇంటికి ఆలస్యంగా రావడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం చేసేవాడు. అతని బాధ్యతారాహిత్యంపై ఆయన అన్నదమ్ములు విసిగిపోయారు. నా భర్త మారతాడని ఎన్ని రకాలుగానో ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి కుటుంబం నుంచి దూరంగా పెడితే బాగుపడతాడని మమ్మల్ని దూరం పెట్టారు. స్కూలు ఉప్మాయే భోజనం నా భర్త, నేను, పిల్లలం విశాఖ వలస వచ్చేసి పాతగోపాలపట్నంలో చిన్నపాక అద్దెకు తీసుకుని బతకడం ప్రారంభించాం. మా ఆయన చిన్నబడ్డీ పెట్టుకుని క్షౌరవృత్తితో సంపాదనకు ప్రయత్నించాడు. కొంతకాలం తిండికి ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని నెట్టుకు వస్తుండగా కష్టం నా నెత్తి మీద పడింది. ఆయనకు హటాత్తుగా క్యాన్సర్ సోకింది. నాకేం అర్థం కాలేదు. ఇంత పెద్ద కష్టమా అనుకున్నాను. కేజీహెచ్‌లో ఆయనకు వైద్యం ఇప్పిస్తూ ఇంకో వైపు పిల్లలను పోషించడానికి నానా ప్రయాశలు పడ్డాను. చేతిలో చిల్లి గవ్వ ఉండేది కాదు. భయంకరమైన ఆకలి. చివరకు శనక్కాయలు అమ్మి పిల్లలకు పట్టెడన్నం పెట్టడానికి చాలా కష్టపడ్డాను. చాలామార్లు పస్తులుండేదాన్ని. పాతగోపాలపట్నం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో పెట్టే ఉప్మాయే తప్ప ఇంట్లో భోజనం ప్రతి రోజూ ఉండేది కాదు. పాఠశాలకు సెలవిస్తే ఆ రోజు నాతో పాటు పిల్లల పరిస్ధితి రోదనగానే ఉండేది. నా వేదనను మా బావ బోసుబాబు, మరిది అప్పారావు అర్థం చేసుకున్నారు. పెద్దకొడుకు వరప్రసాద్‌ను చీరాల తీసుకువెళ్లారు. రెండో కొడుకు శ్రీనుని తొమ్మిదో ఏటే గత్యంతరం లేక గోపాలపట్నంలో ఓ సెలూన్లో చేర్పించాను. శ్రీను నాకు తోడుగా రోజుకి రూపాయి సంపాదన తెచ్చిపెడుతుండేవాడు. అదే చాలా పెద్ద మొత్తంగా ఉండేది నాకు. నా మూడో కొడుకు విజయకుమార్ అప్పటికి ఒకటో తరగతి చదువుతుండగా, బలరాం నాలుగో సంవత్సరంలో అడుగులేస్తున్నాడు. కవలపిల్లలుగా ఉన్న రామ లక్ష్మణులకు రెండేళ్ల వయసు. ఆ సమయంలో నా భర్తకి ఆపరేషన్ చేసినా బతకలేదు. చనిపోయాడు. ఆ రోజు పాతగోపాలపట్నంలో భోరున వర్షం. క్యాన్సర్ రోగి అని నా భర్తని మోయడానికి గ్రామస్తులు ముందుకు రాలేదు. అంత్యక్రియలు చేయడానికి నా చేతిలో చిల్లిగవ్వలేదు. ఆ కష్టం ఒకటి ఈ కష్టం ఒకటి. చివరికి గ్రామస్తుల్ని ప్రాధేయపడితే నలుగురు వ్యక్తులు వచ్చారు. వారితో నేను కూడా పాడి మోశాను. పదేళ్ల వయసున్న నా కొడుకు శ్రీను తలకొరివి పెట్టాల్సి వచ్చింది. మళ్లీ సొంతూరికి ప్రయాణం... నా భర్త మరణంతో తేరుకోలేకపోయాను. ఒంటరి బతుకు ఎలా బతకాలా అని భయపడిపోయాను. బతుకు సాగించలేక పిల్లలతో స్వస్ధలం చీరాల వెళ్లిపోయాను. మా బావకు ఇద్దరు కొడుకుల్ని, మరిదికి ఇద్దరు కొడుకుల్ని అప్పగించి రామలక్ష్మణులతో అదే ఊళ్లో కన్నవారి ఇంటికి వెళ్లిపోయాను. చీరాల వెళ్లాక ఎన్నో అవమానాలు, సూటిపోటి మాటలు, నిందలూ భరించాను. తండ్రిలేని బిడ్డలతో ఎన్నాళ్లిలా కాలం గడిపేదని కుమిలిపోతుండేదాన్ని. ఆ రోజుల్లో భర్త లేని ఆడవాళ్లను సమాజంలో ఆదరించే పరిíస్థితి లేదు. విధవరాలి మొహం చూడకూడదని, ఎదురు పడితే ఛీఛీ అంటూ కొంతమంది ఈసడించుకుంటుండే వారు. మనోధైర్యం చెప్పేవారు ఉండేవారు కాదు. బంధుమిత్రుల్లో ఆదరణలేదు. ఇలాగైతే బతకలేమని, బతికి ఉన్నా జనం బతకనిచ్చేలా లేరని కుంగిపోయేదాన్ని. ఒకదశలో ఆత్మహత్యే శరణ్యమనుకున్నా. కానీ, ఆ సమయంలో ఓ ముసలామె ఓదార్పు నాకు బతకాలనిపించేలా చేసింది. ‘అమ్మా... బిడ్డల మొహం చూసి బతకాలమ్మా... కష్టం ఎప్పుడూ శాశ్వత చుట్టం కాదు.. ఏదో ఒక రోజు అది పెట్టె సర్దుకొని వచ్చినదారినే వెళ్లాల్సిందే’ అని ఆమె ఇచ్చిన మానసిక ధైర్యంతో ఆలోచన విరమించుకున్నా. మున్ముందు మంచి రోజులొస్తాయని ఆమె చెప్పిన మాటలు ఇపుడు నిజమయ్యాయి. కొత్తజీవితం పెద్ద ఫ్యామిలీగా... పిల్లలు ఎదిగొచ్చాక కుటుంబాన్ని వృద్ధి చేసుకోవడానికి మళ్లీ పిల్లలతో విశాఖ వలస వచ్చేశాను. గోపాలపట్నం శివారు చంద్రనగర్‌లో కుటుంబాన్ని నిలబెట్టుకున్నాను. ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో కష్టార్జితంతో కమ్మలిల్లు కట్టించాను. పిల్లలు సెలూన్లలో చేరి నాకు అండగా నిలిచారు. ఇలా ప్రతిరూపాయినీ పొదుపు చేసి బుచ్చిరాజుపాలెంలో చిన్నసెలూన్ పెట్టించాను. పిల్లలకు వరుసగా పెళ్లిళ్లు చేశాను. కోడళ్లు, కొడుకులతో ఉమ్మడి కుటుంబాన్ని బలోపేతం చేశాను. పిల్లల రెక్కల కష్టంతో కమ్మలింటిని కాస్తా మేడ ఇల్లుగా చేసుకున్నాం. పిల్లలు ఇపుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు సెలూన్లని నిర్వహించడంతో అవి ‘ఎంహెచ్yీ ఫ్యామిలీ∙సెలూన్’ పేరిట విస్తరిస్తున్నాయి. గోపాలపట్నంలో ఎంహెచ్‌డీ సెలూన్ నగరంలో అతిపెద్దదిగా పేరుపొందిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మా ఆలోచనలకు తోడుగా కోడళ్లు కూడా ఊరికే కూర్చోకుండా ఫ్యామిలీ సెలూన్‌ని నడుపుతున్నారు. ఇలా కొడుకులు, కోడళ్లు మనుమలు, మనువరాళ్లతో ఒకేతాటిపై పెద్ద కుటుంబంగా ఉన్నామని చెప్పడానికి ఇపుడు గర్వంగానే ఉంది. కష్టాలొస్తే జీవితం లేదన్న భావన ఉండకూడదు...ఓర్పు, శ్రమ, విలువలే జీవితమని నన్ను ఉదహరిస్తూ జనం చెప్పుకుంటుంటే సంతోషంగా ఉంది. – ఉద్దండం హరేకృష్ణగాంధీ, గోపాలపట్నం -
ఈవేళ హాలిడే అని తెలియదా?
ఆస్పత్రికి హాజరుకాని వైద్యుడి మాటలు సకాలంలో వైద్యం అందక వ్యక్తి మృతి చింతూరు : ఏజెన్సీలో సకాలంలో వైద్యసేవలందక పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సేవలందించాల్సిన వైద్యులు అందుబాటులో లేక రోగులతో పాటు కుటుంబ సభ్యులూ నరకయాతన అనుభవిస్తున్నారు. వైద్యుడు లేక సరైన వైద్యం అందక ఓ బడుగుజీవి మరణించిన సంఘటన చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోతుగూడేనికి చెందిన వడ్డి రాజు(40)కు రెండు రోజులుగా ఆయాసం అధికంగా ఉండి, పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదివారం రాత్రి 108లో చింతూరు ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో, స్టాఫ్ నర్సు, 108 సిబ్బంది అతడిని పరిశీలించి వైద్యుడికి ఫో¯ŒS చేశారు. ఆయాసం అధికంగా ఉండడంతో డాక్టర్ సూచన మేరకు రెండు ఇంజెక్షన్లు చేసినట్టు ఆమె తెలిపింది. కొంతసేపటికి రాజు చలనం లేకుండా పడి ఉండడంతో.. ఏం జరిగిందో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. డాక్టర్‌కు ఫో¯ŒS చేస్తే, ఈరోజు పబ్లిక్ హాలిడే అని, అందుకే తాను డ్యూటీలో లేనని చెప్పినట్టు వారు తెలిపారు. ఈ విషయమై నర్సును ప్రశ్నించగా, నాడి కొట్టుకోవడం లేదని, వైద్యులు పరీక్షిస్తేనే కానీ ఏమైనదీ తెలియదని చెప్పినట్టు రాజు భార్య శాంతి, కుమార్తె కుసుమ తెలిపారు. దీనిపై మరోసారి వైద్యుడిని సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన ఫో¯ŒS స్విచాఫ్ వచ్చిందని, అయన వస్తేనే కానీ తానేమీ చెప్పలేనని స్టాఫ్ నర్సు స్పష్టం చేసినట్టు వారు తెలిపారు. నిర్థారించేందుకు రెండు గంటలు అప్పటికే రాజు మరణించినట్టు పరిస్థితులు చెబుతున్నా, నిర్ధారించలేని పరిస్థితి స్టాఫ్ నర్సుది. మరోవైపు అతను చనిపోయాడని తెలుస్తున్నా వైద్యాధికారి వచ్చి పరీక్షిస్తే ప్రాణం ఉండవచ్చేమోనని కుటుంబ సభ్యుల్లో చిన్న ఆశ. ఇలా రెండు గంటలు గడిచినా వైద్యుడి జాడ లేకపోవడంతో చివరకు వారు కూడా ఆశ వదులుకున్నారు. వైద్యుడు లేడని ముందే చెబితే ప్రైవేటు ఆస్పత్రికైనా తీసుకెళ్లేవారమని, పెద్దాస్పత్రికి వస్తే మంచి వైద్యం అందుతుందనుకుంటే ప్రాణమే పోయిందని కుటుంబ సభ్యులు రోదించారు. రాజు మృతిని నిర్థారించేందుకు వైద్యాధికారి తప్పనిసరి కావడంతో మీడియా సిబ్బంది పీఓ చినబాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శేషారెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో వారు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంటలో నివసిస్తున్న చింతూరు మండలం తులసిపాక పీహెచ్సీ వైద్యాధికారి కోటేశ్వరరావును హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి పంపారు. ఆయన రాజును పరీక్షించి, మధుమేహం అధికంగా ఉండడంతో మరణించినట్టు నిర్థారించారు. రోగుల ఇబ్బందులు కాగా వైద్యాధికారి మధ్యాహ్నం నుంచి ఆస్పత్రిలో లేకపోవడంతో చాలామంది రోగులు ఇబ్బందులు పడ్డారు. చింతూరు మండలం గూడూరుకు చెందిన ఎనిమిదో తరగతి గిరిజన విద్యార్థి మడివి జోగయ్యకు జ్వరం, వాంతులు, విరేచనాలు అవుతుండడంతో 108లో ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యుడు లేకపోవడంతో స్టాఫ్‌నర్సు వైద్యం అందించినట్టు విద్యార్థి తల్లి తెలిపింది. ఇక్కడి వైద్యుడు తెలంగాణలోని భద్రాచలంలో నివసిస్తూ, అక్కడినుంచే రాకపోకలు సాగిస్తున్నట్టు రోగులు ఆరోపించారు. -
రహదారి నిర్వహణలోనూ నిర్లక్ష్యమే
గోదావరి పుష్కరాల ఆరంభంలో బ్యారేజిపై రోడ్డు నిర్మాణం ఏడాది తిరగకుండానే గోతులు పడిన వైనం గోదారిలో కలిసిన రూ.అరకోటి నిధులు బొబ్బర్లంక (ఆత్రేయపురం) : ధవళేశ్వరం బ్యారేజి నిర్వహణలోనే కాదు.. దీనిపై ఉన్న రోడ్డు నిర్వహణలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, నిడదవోలు, విజ్జేశ్వరం తదితర ప్రాంతాల ప్రజలు రాజమహేంద్రవరం రావాలంటే ఈ రోడ్డునే ఆశ్రయిస్తారు. దెబ్బతిన్నదిలా.. ∙ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా నిలుస్తున్న బ్యారేజిపై దెబ్బ తిన్న రహదారిని గత ఏడాది గోదావరి పుష్కరాల ఆరంభంలో సుమారు రూ.50 లక్షలతో నిర్మించారు. ఆ సమయంలో నాణ్యతా ప్రమాణాలు పటించకపోవడంతో ఏడాది పూర్తి కాకుండానే ఈ రోడ్డు దెబ్బతింది. బ్యారేజి రోడ్డుపై జాయింట్ల వద్ద ఎక్కడికక్కడ గోతులు పడ్డాయి. అక్కడకు చేరేసరికి వాహనాలు ఎగిరి పడుతున్నాయి. వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు కూడా పాడవుతున్నాయి. జాయింట్లవద్ద ఖాళీలు ఏర్పడటంతో పాటు అక్కడక్కడ ఇనుప ఊచలు పైకి లేచిపోయాయి. విద్యుద్దీపాలు వెలగక బ్యారేజిపై రాత్రి వేళల్లో అంధకారం అలముకుంటోంది. ఆ సమయంలో వాహనచోదకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యతతో రోడ్డు నిర్మించాలి బ్యారేజిపై రహదారిని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నాణ్యంగా నిర్మించాలి. జాయింట్లవద్ద ఖాళీలు, గోతులు లేకుండా చర్యలు తీసుకోవాలి. బ్యారేజిని కూడా సుందరంగా తీర్చిదిద్దాలి. – చిలువూరి చిన వెంకట్రాజు, ఆత్రేయపురం నిర్వహణపై శ్రద్ధ చూపాలి బ్యారేజి నిర్వహణపై ఇరిగేషన్ అధికారులు శ్రద్ధ చూపాలి. కనీసం రక్షిత ప్రాంతంలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేసి ప్రజలు సేద తీరేవిధంగా పార్కులు నిర్మించాలి. బ్యారేజీపై రాత్రి ప్రయాణాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి. – కప్పల శ్రీధర్, ర్యాలి -
పేదల ఆస్పత్రులకు పెద్ద జబ్బు
-
స్వయంకృతం
జీవన కాలమ్ బాధ్యతారాహిత్యంగా తనని దోచుకునే మానవాళిని ప్రకృతి ఎప్పటికప్పుడు నిశ్శబ్దంగా హెచ్చరిస్తూనే ఉంది. ఇటీవల దోపిడీ ఎక్కువయింది కనుక, హెచ్చరికలు తరుచుగా వినవస్తున్నాయి. మనకి ధర్మం అంటే బూతు మాట. మన నైమిత్తిక జీవ నంలో ఒకరు చెప్ప కుండానే మనం పాటిం చాల్సిన విధి ధర్మం. మతం అంటే మరో పెద్ద బూతు. మానవుని జీవన సరళి సజావుగా సాగడానికి మానవుడే ఏర్పరచుకున్న ప్రణాళిక మతం. మనకు 33 కోట్ల మంది దేవతలు. ఎలుక, కుక్క, పాము, భూమి, చెట్టు, నీరు, వర్షం- అన్నీ మనకు దేవతలే. నేటి ఇంగ్లిష్ చదువులు చదువుకుంటున్న మీ అబ్బాయే ఈ మాట చెప్తే మిమ్మల్ని వెక్కిరిస్తాడు- మా నాన్న తరం మరీ ఇంత ఆటవిక సంస్కృతిలో జీవించారని. మనకి ఉపకారం చేసే ప్రతి ప్రాణినీ, శక్తినీ దేవతగా భావించడం ఆనాటి తరాల సంస్కారమని ఆ కుర్రాడికి ఎవరూ నేర్పలేదు. ఇవాళ తమిళనాడులో గత శతాబ్దంలో ఎన్నడూ కురవనంత వర్షం కురిసింది. మరి శతాబ్దం కిందట ఇంత అనర్థం ఎందుకు జరగలేదు? 125 సంవత్సరాల కిందట ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ వంటి తుపాను వచ్చిందన్నారు చదువుకున్న పెద్దలు. అప్పుడు ఇంత అనర్థం ఎందుకు జరగలేదు? ఇప్పుడు వేల మంది చెన్నైలోనే చచ్చిపోయారు. మృతదేహాలను ఇంట్లో పెట్టుకుని, వాటికి సంస్కారం ఎలా చెయ్యాలో తెలీక గిజగిజలాడారు. కొన్ని వేల ఇళ్లు మునిగిపోయాయి. నదులు పొంగి వీధుల్లోకి, ఇళ్లల్లోకి దూకాయి. సమాచార సాధనాలు దెబ్బతిన్నాయి. ఆ మధ్య హైదరాబాద్‌లో, ఇటీవల ముంబైలో, మొన్ననే కేదార్‌నాథ్‌లో జరిగిన అనర్థాల గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు టీవీలలో, చదువుకున్న చాలా గొప్పగొప్ప వారు- పర్యావర ణాన్ని గురించీ, మరి కొందరు నగరంలో అక్రమకట్టడాల గురించీ చాలా ఆవేశంగా ప్రసంగించారు. ఇవి కాలిన చేతులకి చాలనన్ని ఆకులు. ఆ రోజుల్లోనే- కేదార్ విలయం జరిగినప్పుడు ఒక చానల్ శివుడు మూడో కన్ను తెరిచాడని చాలా హృదయ విదారకమైన పాటను వేసి ఆ దృశ్యాల్ని రక్తి కట్టించింది. శివుడు మూడో కన్ను, ముప్పయ్యవ కన్ను తెరిచేంత మూర్ఖుడు కాదు- ఆయన దేవుడని కొందరయినా నమ్మితే. శివుడు లాలూప్రసాద్ యాదవ్ కాదు. సోనియాగాంధీ కాదు. ములాయంసింగ్ కాదు. సంవత్సరాల తరబడి- తెలివైన స్వార్థపరులు- చెయ్యకూడని పనులు చేస్తూ, అక్రమంగా కట్టడాలను కట్టి డబ్బు చేసుకుంటూంటే- ధర్మానికీ, బాధ్యతకీ అర్థం తెలీని- నేలబారు ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వ్యాపారులూ గడ్డికరుస్తూ ఉంటే- మానవాళిని కాపాడటానికి నీటి గమనానికి ఉద్దేశించిన ఆ స్థలాలలో భవనాలు లేస్తే- నూరేళ్ల తర్వాత మునిగిపోయాయని ఏడిస్తే ఏం లాభం? అడిగే నాథుడూ, సంజాయిషీ చెప్పే నాయకుడూ ఎక్కడ? ఎవరి హయాంలో ఎవరు గడ్డి తిన్నారు? మీనంబాక్కం విమానాశ్రయం, చెంబురు బాక్కం నదీ పరీవాహక ప్రాంతమట. ఇది నూరు సంవత్సరాలు మనకి తెలియని విషయం. చెన్నైలో కురిసిన 100 సెంటిమీటర్ల కనీవినీ ఎరుగని వర్షపు నీటిని అలవోకగా సముద్రానికి చేర్చగలిగిన కొన్ని వేల (కనీసం 2 వేలు!) నీటి మార్గాలలో ప్రస్తుతం భవనాలున్నాయని పెద్దలు నిన్న టీవీల్లో చెప్పారు. ఈ తిలాపాపం ఎవరిది? ప్రకృతికి నోరులేదు. చెప్పదు. చేసి చూపుతుంది. హెచ్చరించదు. తిరగబడుతుంది. తలవొంచు కోదు. తలవొంచుతుంది - అది ప్రాథమిక శక్తి కనుక.18 సంవత్సరాల కిందట- నేను చెన్నైలో కొనాలనుకున్న స్థలంలో ఒక నుయ్యి ఉండేది. అది మూసివేస్తే కాని కుదరని పరిస్థితి. పెద్దలు నా చేత శాంతి చేయించి, నష్టపోతున్న నీటి వనరుకి ప్రత్యామ్నాయాన్ని నిర్దేశింపజేసి- అప్పుడు మూయనిచ్చారు. ఒక చిన్న నుయ్యి అవసరాన్ని గుర్తుపట్టి హెచ్చరించిన సంస్కృతి మనది. దీనికి మరో పేరుంది - ధర్మం. ఈ సృష్టిలో భూమి మీద తిరిగే వానపాముకీ, పిచ్చుకకీ, పక్షికీ, సీతాకోకచిలకకీ, చెట్టుకీ, పుట్టకీ ఒక ప్రయోజనం ఉంది. మానవుడు నిస్వార్థంగా వాటిని కాపాడుతూ సహజీవనం చేశాడు. ఈ ప్రకృతిని దేవతలాగ భావించి, గౌరవించి, పూజించాడు. ఆ కారణానికే మానవుల శ్రేయస్సుని శతాబ్దాలుగా కాపాడింది ప్రకృతి. దీనికి మరో పేరుంది- మతం. బాధ్యతారాహిత్యంగా తనని దోచుకునే మాన వాళిని ప్రకృతి ఎప్పటికప్పుడు నిశ్శబ్దంగా హెచ్చరిస్తూనే ఉంది. ఇటీవల దోపిడీ ఎక్కువయింది కనుక, హెచ్చ రికలు తరుచుగా వినవస్తున్నాయి. ప్రకృతిది మౌనశక్తి. మహా ప్రళయం. దానికి శివుడూ, కాకరకాయా అని పేరు పెట్టి ‘మెలోడ్రామా’ని చానళ్లు అమ్ముకుంటే- అది మరో ఆత్మవంచన అవుతుంది. సృష్టి ప్రాథమిక శక్తి. ఏ వంచనకూ లొంగదు. నిన్నటి చెన్నై అందుకు పెద్ద ఉదాహరణ. - గొల్లపూడి మారుతిరావు -
ఆస్తి అంతా పంచుకున్నారు అమ్మానాన్నను గెంటేశారు