పాట్నా/దేవగఢ్: నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బిహార్ పోలీసు శాఖ ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నీట్ అసలైన ప్రశ్నపత్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) నుంచి సేకరించారు. పేపర్ లీకేజీకి సంబంధించి గత నెలలో పాటా్నలోని ఓ ఇంట్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న ప్రశ్నపత్రాలతో ఈ ప్రశ్నపత్రాలను సరిపోల్చనున్నారు.
ఫోరెన్సిక్ టెస్టు తర్వాత సరిపోల్చే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన నిందితులకు నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాల్లో మనీ లాండరింగ్ కోణం కూడా ఉండడంతో ఈడీ సైతం దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment