ఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, రద్దు చేసి తిరిగి నిర్వహించాలని దాఖలైన పదుల సంఖ్యలో పిటిష్లున్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
విచారణ సందర్భంగా పరీక్ష సెంటర్ల వారీగా విడుదల చేసిన ఫలితాల్లో కూడా గందరగోళం ఉందన్న పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి గుజరాత్ నుంచి బెల్గావి వెళ్లి పరీక్ష రాస్తే.. 700పైగా మార్కులు వచ్చాయని చెప్పారు. ఎన్టీఏ నుంచి బ్యాంక్ లాకర్లకు పేపర్లు చేరడానికి మధ్యలో ఏదో జరిగిందని తెలిపారు.
విచారణ సందర్భంగా.. ఫిజిక్స్ పేపర్‌లోని 19వ ప్రశ్నకు రెండు ఆప్షన్‌లు సరైనవిగా ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొందని, కొత్త ఎన్‌సీఈఆర్‌టీ ఎడిషన్ ప్రకారం, ఆప్షన్ 4 సరైన సమాధానం అని ఉంటే, మునుపటి ఎడిషన్ల ప్రకారం ఆప్షన్ 2 సరైనదిగా పేర్కొన్న విద్యార్థులకు కూడా షనల్ టెస్టింగ్ ఏజెన్సీ గ్రేస్ మార్కులు కలిపిందని పిటిషనర్ తన న్యాయవాది ద్వారాకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీనికిసీజేఐ బదులిస్తూ.. తాజా ఎన్‌సీఈఆర్‌టీ ఎడిషన్‌లోని సూచనలే పరిగణలోకి తీసుకోవాలని, అయితే ఆప్షన్‌కు సమాధానం ఇచ్చిన వారికి పూర్తి మార్కులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఎందుకు ఎన్టీయే అలా చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. అయితే రెండూ సాధ్యమయ్యే సమాధానాలేనని ఎస్జీ బదులిచ్చారు.అయితే ఇది సరైనది కాదని, ఏదైనా ఒక ఆప్షన్‌ను మాత్రమే ఎంపిక చేయాలని, రెండూ సరైన సమాధానాలు కాలేవని సీజేఐ పేర్కొన్నారు
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ ఐఐటీ నుంచి నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని డీవై చంద్రచూడ్ తెలిపారు. "సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి ముగ్గురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఐఐటీT ఢిల్లీ డైరెక్టర్‌ను కోరారు. ఈ నిపుణుల బృందం సరైన ఆప్షన్‌పై అభిప్రాయాన్ని రూపొందించి, రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు రిజిస్ట్రార్‌కు తెలియజేయవలసిందిగా ఆదేశించారు.
మరోవైపు.. నీట్ పరీక్ష తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదన్న కేంద్రం పేర్కొంది. ఇరు వర్గాల సుధీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణను సర్వోన్నత న్యాయ స్థానం రేపటికి(మంగళావారం) వాయిదా వేసింది.
ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వారీగా నీట్ పరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్‌టీఏ) విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష రద్దు కోరుతూ 38 పిటిషన్లు దాఖలు కాగా.. అదేవిధంగా పలు రాష్ట్రాలోని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరిన ఎన్టీఏ రెండు పిటిషన్లపైనా సుప్రీం విచారణ జరపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment