
ఢిల్లీ: నీట్-యూజీ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలు దేశంలో దూమారం రూపుతున్నాయి. మరోవైపు.. గ్రేస్ మార్కులు మార్కులు సంపాధించిన 1563 మంది అభ్యర్థులకు ఆదివారం పరీక్ష నిర్వహించగా.. కేవలం 813 మంది మాత్రమే మళ్లీ పరీక్ష రాశారు. 750 మంది పరీక్షకు హాజరు కాలేదు. చంఢిఘర్‌లో ఇద్దరు అభ్యర్థుల పరీక్ష అర్హత సాధించగా.. ఇద్దరూ పరీక్షకు హాజరుకాకపోవటం గమనార్హం.
🔴 #JustIn | NEET-UG 2024 retest: Only 52% (813 out of 1563) students turned up for the retest today. pic.twitter.com/JZzsxmDh8c
— NDTV (@ndtv) June 23, 2024
నీట్ పరీక్షలో అవకతవకలు జరగడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి ఆదివారం నీట్ పరీక్ష నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నీట్ యూజీ -2024 రీటెస్ట్ నిర్వహించింది. ఈ నీట్ రీఎగ్జామ్‌లో కేవలం 52 శాతం మాత్రమే హాజరయ్యారు.
రాష్ట్రాల వారిగా పరీక్షకు హాజరైన వారి సంఖ్య...
- చంఢీఘర్: ఇద్దరికి అర్హత.. ఇద్దరు గైర్హాజరు
- ఛత్తీస్‌గఢ్: 602 మందికి అర్హత.. 311 మంది గైర్హాజరు. 291 మంది పరీక్ష రాశారు.
- గుజరాత్: ఒక్కరికి అర్హత( పరీక్ష రాశారు)
- హర్యానా: 494 మందికి అర్హత.. 207 మంది గైర్హాజరు. 287 మంది పరీక్ష రాశారు.
- మేఘాలయ: 464 మందికి అర్హత.. 230 మంది గైర్హాజరు. 234 మంది పరీక్ష రాశారు.
మరోవైపు.. నీట్-యూజీ అక్రమాలపై దర్యాప్తు కోసం సీబీఐ రంగంలోకి దిగింది. కేసులో మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆదివారం సీబీఐ వెల్లడించింది. గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా చేరుస్తూ పలు సెక్షన్ల కింద అధికారులు కేసు నమోదు చేశారు. నీట్ అవకతవకలపై పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేసేలా చర్యలు చేపట్టారు. యూజీసీ-నెట్ పరీక్ష అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల బృందంపై బిహార్‌లోని నవడా జిల్లా కాసియాదీ గ్రామంలో శనివారం సాయంత్రం దాడి జరిగింది. సీబీఐ అధికారుల వాహనాలపై స్థానికులు దాడికి దిగటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment