నాన్న కళ్లలో ఆనందం కోసం.. ‘కలాసీ కూతురు ఇంజినీర్‌’ అని చెప్పుకోవాలి | Kamireddy Hemashri is the tenth topper of AP Govt schools | Sakshi
Sakshi News home page

శభాష్‌! హేమశ్రీ టెన్త్‌లో (594/600): ‘కలాసీ కూతురు ఇంజినీర్‌’ అని అందరూ చెప్పుకోవాలి 

Published Wed, May 10 2023 3:17 AM | Last Updated on Wed, May 10 2023 9:00 AM

Kamireddy Hemashri is the tenth topper of AP Govt schools - Sakshi

‘‘మా నాన్న వ్యవసాయ కూలీగా ఉంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఆ సం పాదన మా చదువులకు సరిపోదని విశాఖ వచ్చి పూర్ణామార్కెట్‌లో కలాసీగా పనిచేస్తున్నారు. నాకు మంచి మార్కులు వస్తున్నాయని, బాగా చదివించమని మా ఉ పాధ్యాయులు చెప్పడంతో నాన్న ఎప్పుడూ నా గురించే ఆలోచించేవారు. చాలీచాలని సం పాదనతో ఎలా చదివించాలన్నదే ఆయన ఆందోళన.

అలాంటి సమయంలో నేను 8వ తరగతిలో ఉండగా మొదటిసారి అమ్మ ఒడి అందింది. వరుసగా మూడేళ్లు ఆ పథకం వల్ల లబ్ధి ΄పొందడం వల్ల నా చదువు ఎలాంటి భారం లేకుండా సునాయాసంగా సాగిపోయింది. మా పాఠశాల ఉ పాధ్యాయులందరూ ప్రత్యేక శ్రద్ధతో నన్ను తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది’’ 

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 594 మార్కులు సాధించి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో టాపర్‌గా నిలిచిన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఏపీ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాల విద్యార్థిని కామిరెడ్డి హేమశ్రీ మనోగతమిది. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి  చదువుల సరస్వతిగా నిలిచింది. తల్లిదండ్రులకు, ఉ పాధ్యాయులకు మంచి పేరు తెచ్చింది. ఒకప్పుడు కార్పొరేట్‌ స్కూళ్లకే పరిమితమైన టెన్త్‌ టాపర్లు.. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి పుట్టుకొచ్చారు. అలాంటి టాపర్లలో ఈమె ఒకరు. ఆమెతో ‘సాక్షి’ సంభాషించింది. హేమశ్రీ ఎలా ఈ స్థాయికి చేరుకుందో ఆమె మాటల్లోనే.. 

నాన్న మాటలే స్ఫూర్తి 
‘‘అమ్మ గోవిందమ్మ, మా నాన్న శ్రీనివాసరావు. నాన్న పదో తరగతిలో రెండు సబ్జెక్టులు ఫెయిల్‌. ప్రస్తుతం విశాఖలోని పూర్ణా మార్కెట్లో కలాసీ. ఓ రకంగా నాన్నే నా విజయానికి స్ఫూర్తి. తను బాగా చదవలేకపోవడం వల్లే టెన్త్‌ ఫెయిలయ్యారు. కలాసీగా రాత్రీపగలూ కష్టపడుతున్నారు. అదే మాకు పదేపదే చెప్పేవారు. తానెన్ని కష్టాలుపడ్డా.. అదంతా నా కోసం, నా తమ్ముడి కోసమేనని గుర్తు చేసేవారు. మా చదువులకు డబ్బులు అవసరమవుతాయనే ఆరేళ్ల క్రితం దేవరాపల్లి నుంచి విశాఖ వచ్చేశారు. నాన్న కష్టం తెలుసు. అందుకే చదువు తప్ప వేరే ధ్యాసలేకపోయింది. అదే నన్ను పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులతో టాపర్‌గా నిలిపింది.  

చదువంతా సర్కారీ స్కూల్లోనే.. 
ఒకటో తరగతి నుంచి 4వ తరగతి వరకూ మా స్వగ్రామం దేవరాపల్లి మండలం కొత్తపెంటలోని మండల పరిషత్‌ ్ర పాథమిక పాఠశాలలో చదువుకున్నా. ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షలో 92 మార్కులు సాధించా. దీంతో అచ్యుతాపురం ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ (గరల్స్‌)లో సీటు వచ్చింది. నా జీవితంలో నేను సాధించిన తొలి విజయమది. ఐదోతరగతి నుంచి పదో తరగతి వరకూ ఇక్కడే. అమ్మానాన్నల కష్టం తెలియడంతో వారికి ఏ రోజూ నా చదువు భారం కాకూడదనుకున్నాను. ఎంత బాగా చదివితే.. నా చదువుకు అంత తక్కువ ఖర్చవుతుందని తెలుసుకున్నాను. దీనికి నా తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత తెలియడం ఒక కారణమైతే, మా స్కూల్‌ టీచర్లు మరో కారణం. ఇక్కడ చదువుతున్న వారిలో దాదాపు అంతా దిగువ మధ్యతరగతికి చెందిన వారే. అందుకే మా టీచర్లు చదువు విలువ తెలిసేలా, పరీక్షల భయం పోయేలా నిత్యం మమ్మల్ని ్రపోత్సహించారు.  

వసతులు పెరిగాయి 
సాధారణంగా రెసిడెన్షియల్‌ స్కూళ్లు మిగిలిన ప్రభుత్వ స్కూళ్లతో పోల్చుకుంటే కాస్త మెరుగ్గానే ఉంటాయి. అయితే నా వ్యక్తిగత అవసరాలకు మొదటి మూడేళ్లు ఇంటి నుంచి కొంత డబ్బులు తీసుకొచ్చేదాన్ని గత మూడేళ్లుగా పరిస్థితి చాలా మారింది. వసతులు మరింత మెరుగయ్యాయి. పర్యవేక్షణ పెరిగింది. పుస్తకాలు, యూనిఫాం, షూస్‌.. ఇలాంటి వాటి కోసం అమ్మానాన్నల్ని డబ్బులడిగే అవసరం లేకుండా పోయింది. మూడుసార్లు అమ్మ ఒడి అందుకున్నా. సీఎం జగన్‌ మామయ్య ప్రభుత్వంలో కార్పొరేట్‌ స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు బాగుపడ్డాయి.  

ఇంజినీర్‌ కావడమే లక్ష్యం 
ఇంజినీర్‌ కావాలన్నది నా కల. అందుకు రూ.లక్షల్లో ఖర్చుపెట్టే స్థోమత నా కుటుంబానికి లేదు. బాగా చదవడమే ఖర్చులేని దారని నాకు తెలుసు. అందుకే టీచర్లు చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేసుకునేదాన్ని. అర్థంకాని విషయాల్ని ఎప్పుడు అడిగినా, టీచర్లు ఓపిగ్గా విడమరిచి చెప్పేవారు. నా తమ్ముడు సందీప్‌ ప్రస్తుతం 7వ తరగతి పూర్తి చేసుకున్నాడు. మా అమ్మానాన్నలకు మేం భరోసాగా నిలవాలన్నదే నా కోరిక. దాన్ని నెరవేర్చేందుకు చదువు తప్ప, నాకు వేరే మార్గం తెలియదు. ఇంజినీర్‌గా స్థిరపడి నాలాంటి వారికి ఆసరాగా నిలవగలిగితే చాలు. ‘కలాసీ కూతురు ఇంజినీర్‌’ అని నలుగురూ చెప్పుకుంటే.. మా నాన్న కళ్లలో కనిపించే ఆనందాన్ని చూడాలి.. అంతే..!’’

మిట్టు.. సూపర్‌ హిట్టు టెన్త్‌లో  594 మార్కులు
శ్రీకాకుళం జిల్లా (ఆంధ్రప్రదేశ్‌) పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివిన మిట్టు మహా పాత్రో 600కు 594 మార్కులు సాధించాడు. పాతపట్నంలోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ ఎదురుగా ప్రధాన రహదారిలో వీరి ఇల్లు. మహా పాత్రో తండ్రి దుర్గాప్రసాద్‌ మహా పాత్రో ద్విచక్రవాహనాల టైర్లకు పంక్చర్లు వేస్తుంటారు. తల్లి మమత మహా పాత్రో గృహిణి. మిట్టు పాఠశాల సెలవుల్లోను, ఇంటి వద్ద ఉన్నప్పుడు సైకిల్‌కు, బైక్‌లకు పంక్చర్లు వేయడంలో తండ్రికి సహాయం చేస్తుండేవాడు.

ఒడియా బ్రహ్మణ కుటుంబానికి చెందిన పేద కుటుంబం వీరిది. మిట్టుకు పదో తరగతిలోఅత్యధిక మార్కులు రావడంతో ఆ కుటుంబంపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. పాతపట్నంలో 20 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నా అత్యధిక మార్కులు మాత్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన మిట్టు సాధించాడు. తన కుమారుడికి పదో తరగతిలో జిల్లా మొదటి స్థానం రావడంతో ఆనందంగా ఉందని తండ్రి దుర్గా ప్రసాద్‌ తెలి పారు. మిట్టు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు పాతపట్నం ప్రభుత్వ ్ర పాథమిక ఒడియా పాఠశాలలో చదివాడు.
– రవి కుమార్, సాక్షి పాతపట్నం
 

ఇంజినీర్‌ అవుతా...
అమ్మ, నాన్న, ఉ పాధ్యాయుల ్రపోత్సాహంతో పదో తరగతిలో మంచి మార్కులు సాధించాను. ట్రిపుల్‌ ఐటీ చదివి, ఇంజినీర్‌ అవుతా.          
– మిట్టు మహా పాత్రో

– లోవరాజు, సాక్షి, అనకాపల్లి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement