సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 మొదటి ర్యాంకు ఎవరిదో చెబితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా గ్రూప్–1 టాపర్లు ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ భోరోసా దీక్షలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ సిబ్బంది, ఈ కేసులో నిందితులైన రాజశేఖర్‌రెడ్డి, దాసరి కిషోర్‌లకు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 150 మార్కులకుగాను 120 మార్కులు సాధించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు తెలిసిన వారే టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా ఉన్నారని, అందువల్ల ఆ కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏ నిరుద్యోగ బిడ్డల త్యాగం వల్ల తెలంగాణ వచి్చందో, ఆ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు అమ్ముకుంటోందని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
‘టెన్త్’లో అలా.. టీఎస్‌పీఎస్సీలో ఇలా..
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ‘సిట్’విచారణ నత్తనడకన సాగుతోందని... నిందితులను బాధితులుగా చూపే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు 48 గంటల్లోనే పాత్రదారులు, సూత్రదారులను అరెస్ట్ చేశారని... కానీ టీఎస్‌పీఎస్సీ కేసులో సూత్రదారులు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నందునే ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు.
ఈ కేసుపై స్పందించకుండా ముఖ్యమంత్రి మౌనం వహిస్తున్నారంటే తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ముఖ్యమంత్రి గద్దె దిగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, తాము పేపర్ లీక్‌కు సంబందించి ఆధారాలతో వస్తామని ఆయన సవాల్ చేశారు.
18న నిరసన దీక్ష...
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిరుద్యోగులకు న్యాయం చేసేలా ప్రతిపక్ష పారీ్టలంతా ఏకతాటిపైకి రావాలని ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. అలాగే కొత్త కమిషన్ వేశాకే పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అన్ని పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలతో ఈ నెల 18న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
సీఎంకు 25 ప్రశ్నలు
రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు వాడుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంగళవారం బీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను ఓటుబ్యాంకుగా చూడటమే తప్ప చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 2016లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని... కానీ గతంలో దళిత, బహుజనులకు ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 25 ప్రశ్నలతో సీఎంకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ
Comments
Please login to add a commentAdd a comment