ties up
-
ఇటాలియన్ సంస్థతో హిందాల్కో జట్టు - కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచన
న్యూఢిల్లీ: హై–స్పీడ్ అల్యుమినియం రైలు కోచ్‌ల తయారీకి సంబంధించి ఇటలీకి చెందిన మెట్రా సంస్థతో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు హిందాల్కో ఇండస్ట్రీస్ తెలిపింది. దీనితో ఎక్స్‌ట్రూషన్, ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ విషయంలో హిందాల్కోకు మెట్రా సహకారం అందించనుంది. వాణిజ్య వాహనాలు, ఫ్రైట్ వ్యాగన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ప్యాసింజరు రైళ్లలో అల్యూమినియం వినియోగాన్ని పెంచే దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఉపయోగపడగలదని హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ చెప్పారు. అల్యూమినియం వినియోగంతో రైల్వే కోచ్‌ల బరువు కొంత తగ్గగలదని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ రైళ్ల కోచ్‌ల నిర్మాణం ప్రాజెక్టుపై రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు పాయ్ వివరించారు. అల్యుమినియం కోచ్‌లకు ముందు కాస్త ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చినా, దీర్ఘకాలంలో పలు ప్రయోజనాలు ఉంటాయని ఆయన తెలిపారు. -
హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా ఎనర్జీ రంగంలో ఉన్న షెల్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హ్యుందాయ్‌కి చెందిన 36 డీలర్షిప్ కేంద్రాల వద్ద 60 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్లను షెల్ ఏర్పాటు చేస్తుంది. దేశంలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణను పెంచడం ఈ వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యం అని కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్‌న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన ‘కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడాన్ని వేగవంతం చేయడంలో ఇటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాలు ప్రాథమికమైనవి’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. హ్యుందాయ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల కోసం దేశవ్యాప్తంగా 45 నగరాల్లో 72 కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
కొరియన్ కంపెనీతో మిందా జట్టు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ డేసంగ్ ఎల్టెక్‌తో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు మిందా కార్పొరేషన్ తెలిపింది. దీని కింద కొత్త తరం అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) సొల్యూషన్స్‌ను భారత ఆటోమోటివ్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. రాబోయే కొన్నేళ్లలో పలు ఏడీఏఎస్ ఫీచర్లు సర్వత్రా వినియోగంలోకి వస్తాయని కార్ల తయారీ దిగ్గజాలు అంచనా వేస్తున్నట్లు మిందా కార్పొరేషన్ ఈడీ ఆకాశ్ మిందా తెలిపారు. ఇప్పటికే దేశీ మార్కెట్లో ఇందుకు సంబంధించి తొలి సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. -
ఎస్బీఐతో బెంజ్ జట్టు: ప్రత్యేక ఆఫర్లు
సాక్షి,ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భాగస్వామ్యాన్నికుదుర్చుకుంది. తద్వారా తన వినియోగదారులకు ఆకర్షణీయమైన వడ్డీరేటుతోపాటు, ఇతర ప్రయోజనాలను కల్పించనుంది. అలాగే ఎస్బీఐ యోనో ద్వారా కార్లను కొనుగోలు చేసినవారికి అదనపు ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. తమ లగ్జరీ కార్లను బుక్ చేసుకున్న ఎస్బీఐ కస్టమర్లకు తక్కువ వడ్డీరేట్లకే కార్ల ఫైనాన్సింగ్, ఇతర అనేక ఆర్థిక ప్రయోజనాలను అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బెంజ్ మంగళవారం తెలిపింది. అలాగే ఎస్బీఐ డిజిటల్ ప్లాట్‌ఫామ్ యోనో ద్వారా బెంజ్ కార్లను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. బెంజ్ కారును బుక్ చేసుకునే వినియోగదారులందరికీ డీలర్‌షిప్‌ల వద్ద రూ.25 వేల అదనపు ప్రయోజనం లభిస్తుందని తెలిపింది. డిసెంబర్ 31 వరకు ఇవి అమల్లో ఉండనున్నాయి. మెర్సిడెస్ బెంజ్ కొత్త కస్టమర్లను చేరుకోవడానికి కొత్త మార్గాలను నిరంతరం అన్వేషిస్తోందనీ, అలాగే ఒక బ్యాంకుతో టై అప్ కావడం ఇదే మొదటిసారని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ అండ్ సీఈవొ మార్టిన్ ష్వెంక్ అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలోని మొత్తం 17 సర్కిల్లలోని ఎస్బీఐ హెచ్ఎన్ఐ(అధిక నికర-విలువ గల వ్యక్తులు) కస్టమర్లకు మెర్సిడెస్ బెంజ్ సహకారంతో ఆఫర్లను అందిస్తున్నామని ఎస్బీఐ రీటైల్ అండ్ డిజిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ సెట్టి చెప్పారు. పండుగ సీజన్లో ఈ అవకాశాన్నిఉపయోగించుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
కూతురిని గొలుసుతో బంధించిన తండ్రి
లక్నో : తన కూతురు ఓ యువకుడితో చనువుగా ఉంటోందని అనుమానించిన తండ్రి బాలిక (17) కాళ్లకు ఇనుప గొలుసు కట్టి ఇంట్లో బంధించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో శనివారం చోటుచేసుకుంది. తన తండ్రి గత మూడు రోజులుగా ఇనుస గొలుసుతో కట్టేసి ఇంట్లో బంధించాడని సమీపంలో మీర్గంజ్ పోలీస్ స్టేషన్లో బాలిక ఫిర్యాదు చేసింది. తాను ఓ యువకుడితో స్నేహం చేస్తున్నాని, తన తల్లిదండ్రులు, సోదరులు కలిసి తన ఇంట్లో బంధించారని ఫిర్యాదులో పేర్కొంది. అర్థరాత్రి ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలో తప్పించుకుని వచ్చి పోలీస్‌లను ఆశ్రయించినట్లు తెలిపింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తండ్రిని శనివారం అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను అక్రమంగా నిర్భందించారని ఐపీసీ సెక్షన్ 342 ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలికను మహిళ కానిస్టేబుల్ సహాయంతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమె మేజర్ అయ్యే వరకు బాలిక సంరక్షణ కేంద్రంలో ఉంటుందని అధికారులు తెలిపారు. బాలిక ఆరోపణలపై కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని బరేలీ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ వెల్లడించారు. -
ఎరోస్ నౌ తో మైక్రోమాక్స్ భాగస్వామ్యం
ముంబై: దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీదారు మైక్రోమాక్స్, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తో డిజిటల్ కంటెంట్ సేవల భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. నియోగదారులకు సీమ్ లెస్ డిజిటల్ కంటెంట్ అందించే లక్ష్యంతో ఎరోస్ ఇంటర్నేషనల్ డిజిటల్ ప్లాట్ ఫాం ఎరోస్ నౌ తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంతో వినియోగదారులకు సౌకర్యవంతమైన, అసాధారణ డిజిటల్ సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మైక్రో మాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం మైక్రో మాక్స్ లేటెస్ట్ స్మార్మ్ ఫోన్లలో ఎరోస్ నౌ యాప్ ప్రీ ఇన్ స్టాల్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది. ఈ యాప్ ద్వారా మ్యూజిక్ లవర్స్ సంగీతాన్ని ఆస్వాదించవచ్చన్నారు. సినిమాల డిజిటల్ కంటెంట్, వీడియోలతో పట్టణ, గ్రామీణ ప్రాంత వినియోగదారులకు విరివిగా అందుబాటులోకి వస్తుందని మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు వికాస్ జైన్ వివరించారు. అలాగే లక్షా యాభైవేలకు పైగా ఔట్ లెట్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న మైక్రోమాక్స్ పరపతి తమ వ్యాపార వృద్ధి తోడ్పడనుందని చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ సీఈవో రిషిక లుల్లా సింగ్ వెల్లడించారు. మైక్రోమాక్స్ యూజర్లు ఇక ఎరోస్ నౌ యూనిక్ కంటెంట్ ప్రాప్యతకు ఆమోదం లభించనుందన్నారు. దాదాపు 3.5 మిలియన్ల వినియోగదారులు ఇక ఎక్కడైనా ఎప్పుడైనా వినోదాన్ని ఆస్వాదించవచ్చని తెలిపారు. -
ఫ్యూచర్ గ్రూప్‌తో రాందేవ్ బాబా ఒప్పందం
న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలి ఆయుర్వేదిక్స్.. ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ ఫ్యూచర్ గ్రూప్ తో కీలక వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. పతంజలి సంస్థ తయారుచేసే ఉత్పత్తులను.. 240 నగరాల్లోని రిటైల్ అవుట్ లెట్లలో విక్రయించనున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే 20 నెలల కాల వ్యవధిలో వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరుపనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా రాందేవ్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ లాంటి స్వదేశీ రిటైల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా తమ సంస్థకు రెట్టింపు గౌరవం దక్కుతుందని, తద్వారా ప్రపంచ శ్రేణి ఉత్పత్తుతులను తక్కువ ధరకే అందించే వీలుంటుందన్నారు. 20015- 16 ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యేలోపు పతంజలి ఫుడ్స్ టర్నోవర్ రూ. 5 వేల కోట్లకు చేరుకుంటుందని రాందేవ్ చెప్పారు. మ్యాగీ నిషేధం తరువాత తమ సంస్థ రూపొందించిన దేశీ ఆటా నూడుల్స్ విక్రయాలను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు, ఒక్కో ప్యాకెట్ ధర రూ. 25గా నిర్ధారించినట్లు వివరించారు.