ముంబై: దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీదారు మైక్రోమాక్స్, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తో డిజిటల్ కంటెంట్ సేవల భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. నియోగదారులకు సీమ్ లెస్ డిజిటల్ కంటెంట్ అందించే లక్ష్యంతో ఎరోస్ ఇంటర్నేషనల్ డిజిటల్ ప్లాట్ ఫాం ఎరోస్ నౌ తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంతో వినియోగదారులకు సౌకర్యవంతమైన, అసాధారణ డిజిటల్ సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మైక్రో మాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం మైక్రో మాక్స్ లేటెస్ట్ స్మార్మ్ ఫోన్లలో ఎరోస్ నౌ యాప్ ప్రీ ఇన్ స్టాల్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది. ఈ యాప్ ద్వారా మ్యూజిక్ లవర్స్ సంగీతాన్ని ఆస్వాదించవచ్చన్నారు. సినిమాల డిజిటల్ కంటెంట్, వీడియోలతో పట్టణ, గ్రామీణ ప్రాంత వినియోగదారులకు విరివిగా అందుబాటులోకి వస్తుందని మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు వికాస్ జైన్ వివరించారు.
అలాగే లక్షా యాభైవేలకు పైగా ఔట్ లెట్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న మైక్రోమాక్స్ పరపతి తమ వ్యాపార వృద్ధి తోడ్పడనుందని చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ సీఈవో రిషిక లుల్లా సింగ్ వెల్లడించారు. మైక్రోమాక్స్ యూజర్లు ఇక ఎరోస్ నౌ యూనిక్ కంటెంట్ ప్రాప్యతకు ఆమోదం లభించనుందన్నారు. దాదాపు 3.5 మిలియన్ల వినియోగదారులు ఇక ఎక్కడైనా ఎప్పుడైనా వినోదాన్ని ఆస్వాదించవచ్చని తెలిపారు.
ఎరోస్ నౌ తో మైక్రోమాక్స్ భాగస్వామ్యం
Published Mon, Jun 27 2016 3:50 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM
Advertisement
Advertisement