Eros Now
-
ఓటీటీ ప్రియులకు ఇక పండగే!
ఓటీటీలో మూవీస్ చూసేవారికి పండుగ లాంటి వార్తా అమెజాన్ ప్రైమ్ చెప్పింది. భారతదేశంలో అమెజాన్ తన వ్యూహాత్మక చర్యలలో భాగంగా ప్రైమ్ వీడియో ఛానల్స్ ప్రారంభించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఎనిమిది సబ్ స్క్రిప్షన్ ఆధారిత ఒటీటీ యాప్స్ ప్రత్యేక కంటెంట్ ని ఇక నుంచి సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు అని తెలిపింది. డిస్కవరీ+, లయన్స్ గేట్ ప్లే, డోకూబాయ్, ఇరోస్ నౌ, ఎంయుబిఐ, హోయిచోయ్, మనోరమా మ్యాక్స్, షార్ట్స్ టివి వంటి స్ట్రీమింగ్ యాప్స్ కంటెంట్‌ని యాడ్ ఆన్ సబ్ స్క్రిప్షన్లతో ప్రైమ్ వీడియో సభ్యులు యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చిన ఈ అన్ని యాప్స్ కొరకు సింగిల్ బిల్లింగ్ మెకానిజం ఉంటుంది. ప్రైమ్ వీడియో ఛానల్స్ నేటి (సెప్టెంబర్ 24) నుంచి ప్రారంభమవుతాయి. ప్రైమ్ వీడియో ఛానల్స్ ద్వారా డిస్కవరీ+, లయన్స్ గేట్ ప్లే, డోకుబే, ఎరోస్ నౌ, ఎంయుబిఐ, హోయిచోయ్, మనోరమాక్స్, షార్ట్స్ టివి వంటి ఎనిమిది వీడియో స్ట్రీమింగ్ యాప్స్ వేలాది షోలు, మూవీలు, రియాలిటీ టివి, డాక్యుమెంటరీలు మొదలైన వాటితో సహా గ్లోబల్, లోకల్ బింగే-వర్తీ కంటెంట్ ప్రైమ్ సభ్యులు చూడవచ్చు. అయితే, కస్టమర్లు తాము ఎంచుకున్న సేవలకు మాత్రమే డబ్బులు చెల్లించవచ్చు. ఈ ఎనిమిది ఒటీటీ ప్లాట్ ఫారమ్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది గనుక, వినియోగదారులు తమకు ఇష్టమైన షోలను చూడటానికి ఇక ఈ ఎనిమిది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే, అన్నీ ఛానెల్స్ మధ్య సులభంగా స్విచ్ అవ్వవచ్చు. ప్రైమ్ వీడియో ఛానల్స్ ఓటిటి యాప్స్ సబ్ స్క్రిప్షన్ ధర డిస్కవరీ+ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.299 డోకుబే సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.499 ఇరోస్ నౌ సబ్ స్క్రిప్షన్ ధర రూ.299 హోయిచోయ్ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.599 లయన్స్ గేట్ ప్లే సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.699 మనోరమాక్స్ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.699 ఎంయుబిఐ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.1999 షార్ట్స్ టీవీ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.299 -
కాస్తైనా సిగ్గుపడండి; మమ్మల్ని క్షమించండి!
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌కు చెందిన ఓటీటీ ఈరోస్ నౌ నెటిజన్లను క్షమాపణ కోరింది. మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. భారత్‌లోని విభిన్న సంస్కృతుల పట్ల తమకు గౌరవభావం ఉందని, తాము షేర్ చేసిన పోస్టుల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా వాటిని తక్షణమే తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఈరోస్ నౌ బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. అసలేం జరిగిందంటే.. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో కొలుస్తారన్న విషయం తెలిసిందే. తొమ్మిది రకాల నైవేద్యాలు.. స్త్రోత్రాలతో దుర్గామాతను పూజిస్తారు. అలాగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో నవ వర్ణాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. (చదవండి: నా ఒడి నింపే వేడుక..ఇప్పుడేంటి!?) ఆయా రోజుల్లో పసుపు, ఆకుపచ్చ, బూడిద, నారింజ, తెలుపు, ఎరుపు, నీలం, గులాబి, ఊదా తదితర రంగులు కలిగిన దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో చాలా మంది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఒక్కోరోజు ఒక్కో రంగు దుస్తులు వేసుకుని సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోస్ నౌ.. తమ మాతృసంస్థ నిర్మాణ సారథ్యంలో నిర్మించిన సినిమాల్లోని హీరోయిన్ల స్టిల్స్‌ను తమ సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తోంది. హీరోయిన్ల అవుట్‌ఫిట్ రంగులకు మ్యాచ్ అయ్యే డ్రెస్సులు ధరించి తమతో ఫొటోలు పంచుకోవాల్సిందిగా నెటిజన్లకు సూచించింది. అయితే ఈరోస్ నౌ టీం రూపొందించిన ఐడియా నుంచి పుట్టుకొచ్చిన ఈ ‘వినూత్న’థీమ్ చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. నవరాత్రి ఉత్సవాలను సెలబ్రేట్ చేసేందుకు ఇంతకంటే మంచి మార్గం దొరకలేదా అంటూ విరుచుకుపడుతున్నారు. (‘నాపై ఎప్పుడైనా దాడి జరుగవచ్చు’) ముఖ్యంగా.. ‘‘ఎరుపు అంటేనే అంతులేని విశ్వాసం. ప్రేమకు చిహ్నం. నవరాత్రి. నాలుగో రోజు రెడ్ కలర్. చూడండి ఎంత బాగున్నారో’’ అంటూ షేర్ చేసిన కత్రినా కైఫ్, కరీనా కపూర్ ఫొటోలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. ఇక పసుపు రంగు చీరలో ఉన్న కత్రినా ఫొటోతో వారి కోపం నశాళానికి అంటింది. దీంతో #BOYCOTTEROSNOWను ట్రెండ్ చేస్తూ ఆగ్రహం ప్రదర్శించారు. పిచ్చి పిచ్చి మీమ్స్‌తో ఫొటోలు పోస్ట్ చేస్తున్న ఈరోస్ నౌ కంటెంట్‌ను వీక్షించబోమని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాస్తైనా సిగ్గుపడండి అంటూ చురకలు అంటిస్తున్నారు. అంతేగాకుండా కత్రినాకు సంబంధించిన మరికొన్ని స్టిల్స్ షేర్ చేసి, పవిత్రమైన నవరాత్రుల సందర్భంగా ఇలాంటి ఫొటోలతో ఏం సందేశం ఇస్తున్నారంటూ ఏకిపారేశారు. అంతేగాక మతాలకు అతీతంగా ప్రతీ సందర్భంలోనూ ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయగల దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు దిగివచ్చిన ఈరోస్ బృందం తాము చేసిన పోస్టుల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందున ఆ ఫొటోలు డెలిట్ చేసింది. కాగా ఇటీవల తనిష్క్ సైతం ట్రోలింగ్ బారిన పడటంతో తమ యాడ్‌ను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. pic.twitter.com/oKxyc2xfA2 — Eros Now (@ErosNow) October 22, 2020 Look At What Type Of Post Is Posted By Eros Now On Instagram Regarding Navaratri. #BoycottErosNow pic.twitter.com/qCxSYJqBtP — Narendra Modi fan (@narendramodi177) October 22, 2020 Okay people, today we're wearing white! Show us your outfits!#Navratri #Navrarti2020 #ENStyleIcons @priyankachopra @deepikapadukone @sonamakapoor pic.twitter.com/SNCv3Vsp7U — Eros Now (@ErosNow) October 19, 2020 -
ఎరోస్ నౌ తో మైక్రోమాక్స్ భాగస్వామ్యం
ముంబై: దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీదారు మైక్రోమాక్స్, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తో డిజిటల్ కంటెంట్ సేవల భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. నియోగదారులకు సీమ్ లెస్ డిజిటల్ కంటెంట్ అందించే లక్ష్యంతో ఎరోస్ ఇంటర్నేషనల్ డిజిటల్ ప్లాట్ ఫాం ఎరోస్ నౌ తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంతో వినియోగదారులకు సౌకర్యవంతమైన, అసాధారణ డిజిటల్ సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మైక్రో మాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం మైక్రో మాక్స్ లేటెస్ట్ స్మార్మ్ ఫోన్లలో ఎరోస్ నౌ యాప్ ప్రీ ఇన్ స్టాల్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది. ఈ యాప్ ద్వారా మ్యూజిక్ లవర్స్ సంగీతాన్ని ఆస్వాదించవచ్చన్నారు. సినిమాల డిజిటల్ కంటెంట్, వీడియోలతో పట్టణ, గ్రామీణ ప్రాంత వినియోగదారులకు విరివిగా అందుబాటులోకి వస్తుందని మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు వికాస్ జైన్ వివరించారు. అలాగే లక్షా యాభైవేలకు పైగా ఔట్ లెట్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న మైక్రోమాక్స్ పరపతి తమ వ్యాపార వృద్ధి తోడ్పడనుందని చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ సీఈవో రిషిక లుల్లా సింగ్ వెల్లడించారు. మైక్రోమాక్స్ యూజర్లు ఇక ఎరోస్ నౌ యూనిక్ కంటెంట్ ప్రాప్యతకు ఆమోదం లభించనుందన్నారు. దాదాపు 3.5 మిలియన్ల వినియోగదారులు ఇక ఎక్కడైనా ఎప్పుడైనా వినోదాన్ని ఆస్వాదించవచ్చని తెలిపారు.