![Hyundai ties up with Shell to install fast chargers - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/18/hyundai-shell.jpg.webp?itok=MhDfI1FY)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా ఎనర్జీ రంగంలో ఉన్న షెల్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హ్యుందాయ్‌కి చెందిన 36 డీలర్‌షిప్ కేంద్రాల వద్ద 60 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్లను షెల్ ఏర్పాటు చేస్తుంది. దేశంలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణను పెంచడం ఈ వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యం అని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్‌న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన
‘కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడాన్ని వేగవంతం చేయడంలో ఇటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాలు ప్రాథమికమైనవి’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. హ్యుందాయ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల కోసం దేశవ్యాప్తంగా 45 నగరాల్లో 72 కేంద్రాలను నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో..
Comments
Please login to add a commentAdd a comment