Shell
-
నల్లగబ్బిలం పువ్వును ఎప్పుడైనా చూశారా!
అరుదైన ఈ పువ్వు నల్లగా గబ్బిలంలా కనిపిస్తుంది. ఈ పూలు పూసే మొక్కలను దూరం నుంచి చూస్తే, మొక్కల మీద గబ్బిలాలు వాలి ఉన్నాయేమోననిపిస్తుంది. గబ్బిలం వంటి ఆకారం వల్లనే ఈ పువ్వుకు ‘బ్లాక్ బ్యాట్ ఫ్లవర్’ అనే పేరు వచ్చింది. కంద జాతికి చెందిన ఒక మొక్కకు ఈ పూలు పూస్తాయి. ఫ్రెంచ్ వర్తకుడు, కళాసేకర్త ఎడ్వర్డ్ ఆండ్రూ తొలిసారిగా ఈ పూల గురించి 1901లో రాసిన తన పుస్తకంలో వర్ణించాడు.ఈ పూల మొక్కలు బంగ్లాదేశ్, కంబోడియా, దక్షిణ చైనా, లావోస్, మలేసియా, మయాన్మార్, థాయ్‌లండ్ అడవుల్లో కనిపిస్తాయి. ఈ పూల కేసరాలు పిల్లి మీసాల్లా ఉంటాయి. రేకులు గబ్బిలం రెక్కల్లా ఉంటాయి. పన్నెండు అంగుళాల వెడల్పు, పది అంగుళాల పొడవుతో గబ్బిలం ఆకారంలో కొంత భయం గొలిపేలా ఉండటంతో ఈ పువ్వులను దక్షిణాసియా స్థానిక భాషల్లో ‘దెయ్యం పువ్వులు’ అని కూడా పిలుస్తారు. చైనీస్ సంప్రదాయ వైద్యంలో ఈ పువ్వులను కొన్ని ప్రత్యేక ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు.అతి పురాతన రైల్వేస్టేషన్..ఇది ప్రపంచంలోనే అతి పురాతన రైల్వేస్టేషన్. ఇక్కడి నుంచే తొలి పాసింజర్ రైలుబండి నడిచింది. ఇంగ్లండ్‌లో ఉన్న ఈ రైల్వేస్టేషన్ పురాతన భవంతిని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో లివర్‌పూల్ రోడ్ స్టేషన్‌ను 1830లో నిర్మించారు. లివర్‌పూల్ రోడ్ నుంచి మాంచెస్టర్ వరకు తొలి పాసింజర్ రైలు నడిచేది. లివర్‌పూల్ అండ్ మాంచెస్టర్ రైల్వే కంపెనీ తరఫున ఈ రైల్వేస్టేషన్‌ను జార్జ్ స్టీఫెన్సన్ అనే ఇంజినీరు నిర్మించాడు.ప్రస్తుతం మ్యూజియంగా మార్చిన ఈ పురాతన రైల్వేస్టేషన్ భవంతిలో రైల్వే మ్యూజియంతో పాటు సైన్స్ ప్లస్ ఇండస్ట్రీ మ్యూజియం, పిల్లల ఆట స్థలం వంటివి కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే తొలి పారిశ్రామిక నగరంలో మాంచెస్టర్ గత వైభవాన్ని తెలిపే వస్తువులను ఇక్కడ కొలువు దీర్చారు. పారిశ్రామిక విప్లవం నాటి పురాతన యంత్రపరికరాలను ఇందులో భద్రపరచారు. రైల్వే మ్యూజియంలో బొగ్గుతో నడిచే తొలినాటి ఆవిరి ఇంజిన్లను, ఆనాటి రైలు బోగీలను, వివిధ కాలాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబించే రైలు ఇంజిన్లను, బోగీలను భద్రపరచారు. ఈ మ్యూజియంను చూడటానికి పద్నాలుగేళ్ల లోపు పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు.అతిచిన్న లకుముకి పిట్ట..ఇది ప్రపంచంలోనే అతిచిన్న లకుముకి పిట్ట. అత్యంత అరుదైన పక్షుల్లో ఇది కూడా ఒకటి. పొడవాటి ఎర్రని ముక్కుతో రంగురంగుల శరీరంతో ఉండే ఈ పక్షి, చూడటానికి పిచుక పరిమాణంలో ఉంటుంది. ఫిలిప్పీన్స్ అడవుల్లో ఈ జాతి పక్షులు కనిపించేవి. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త బెర్నార్డ్ జర్మెయిన్ డి లేస్పెడె 1799లో వీటిని తొలిసారిగా చూసినప్పుడు, ఇవి చిన్నసైజు కింగ్‌ఫిషర్ పక్షుల్లా కనిపించడంతో వీటికి ‘ఫిలిప్పీన్ డ్వార్ఫ్ కింగ్‌ఫిషర్’ అని పేరుపెట్టాడు.ఈ పక్షులు క్రమంగా తగ్గిపోయి, కనిపించడం మానేశాయి. ఈ పక్షులను స్థానికులు చివరిసారిగా 130 ఏళ్ల కిందట చూశారు. ఆ తర్వాత ఈ పక్షులు ఎవరికీ కనిపించకపోవడంతో ఇవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు కూడా భావించారు. ఫిలిప్పీన్స్ విహంగ శాస్త్రవేత్త మీగెల్ డేవిడ్ డి లియాన్ ఇటీవల దక్షిణ ఫిలిప్పీన్స్ అడవుల్లో ఈ పక్షులను గుర్తించి ఫొటోలు తీశాడు. -
షెల్ డీజిల్ లీటర్ 20 పెంపు
న్యూఢిల్లీ: షెల్ ఇండియా తన అవుట్లెట్ల ద్వారా విక్రయించే డీజిల్ ధరను లీటర్‌పై రూ.20 పెంచుతున్నట్టు ప్రకటించింది. వారం లోపే రెండో విడత ధరలను పెంచింది. దేశంలో అధిక వాటా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం ఎలాంటి మార్పుల్లేకుండా అవే రేట్లను కొనసాగిస్తున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విక్రయ ధరల్లో ఎలాంటి సవరణలు చేయకపోవడం గమనించొచ్చు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మే నెలలో 75 డాలర్లలోపు ఉంటే, ప్రస్తుతం 95 డాలర్లపైకి చేరుకోవడం తెలిసిందే. షెల్ ఇండియా గత వారం కూడా లీటర్ డీజిల్‌పై రూ.4 చొప్పున పెంచింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 346 పెట్రోల్ స్టేషన్లు ఉన్నాయి. ముంబైలో లీటర్ డీజిల్‌ను రూ.130కు, చెన్నైలో రూ.129 చొప్పున విక్రయిస్తోంది. పెట్రోల్ లీటర్ ధర రూ.117–118గా ఉంది. అదే ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్‌ను రూ.95, లీటర్ పెట్రోల్ ధరను రూ.107 స్థాయిలో విక్రయిస్తుండడం గమనార్హం. ప్రాంతాలను బట్టి ఈ రేట్లలో స్వల్ప మార్పులు ఉంటాయి. -
కోనసీమలో ‘నల్ల బంగారం’
సాక్షి అమలాపురం: కోనసీమలో తయారయ్యే ‘కొబ్బరి చిప్ప బొగ్గు’ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్‌గా, తాగునీటిని శుద్ధిచేసేందుకు వినియోగించడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, దేశ రక్షణకు చెందిన విడి భాగాలు, ఆటో మొబైల్ పరిశ్రమలలో కీలక విడిభాగాల తయారీలో ఈ బొగ్గు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. తయారీదారుల ఇంట నల్ల బంగారమై మెరుస్తోంది. ఇటువంటి అత్యుత్తమమైన, నాణ్యమైన కొబ్బరి చిప్ప బొగ్గు తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిలుస్తోంది. నదీతీరంలో బొగ్గు తయారీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో వైనతేయ నదీతీరంలో బొగ్గు తయారవుతోంది. ఇక్కడ నుంచి ఏడాదికి రూ. 2 కోట్ల విలువ చేసే 700 నుంచి 900 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడు లోని కాంగాయం, పల్లడం, కోయింబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, మన రాష్ట్రంలోని నెల్లూ రు, గూడూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రయోజనాలెన్నో.. కొబ్బరి చిప్ప బొగ్గు ప్రయోజనాలు తెలిస్తే నిజంగా నల్ల బంగారమే అంటారు. సౌందర్య పోషణకు వాడే ఫేస్‌ప్యాక్‌లతోపాటు కాస్మోటిక్స్, సబ్బులలో వాడకం అధికం. ఆటోమొబైల్‌లో కీలకమైన స్పేర్ పార్టుల తయారీ, రక్షణ రంగంలో యుద్ధ పరికరా లు, గ్యాస్ మాస్కుల తయారీలో వినియోగిస్తారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తిలో అధిక శాతం రికవరీకి ఇది దోహదపడుతుంది. నీటిలోని క్లోరిన్, పురుగు మందులు, మలినాలను, వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దీనిలో అధిక ఉష్ణ విలువ ఉంటుంది. మండించడానికి సమర్థవంతమైన ఇంధన వనరు గా ఉపయోగపడుతుంది. చిప్ప బొగ్గుతో భూమిలో వేగంగా సేంద్రియ కర్భనం ఉత్పత్తి అవుతుంది. బాగా ఆరిన కొబ్బరి చిప్ప బొగ్గు అత్యధిక ధర కేజీ రూ.35 నుంచి రూ.38 వరకు ఉండగా, ఈ ఏడాది ఆశించిన ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీ రూ.24 నుంచి రూ.26 కాగా, తడిసిన బొగ్గు ధర రూ.19 వరకు మాత్రమే ఉంది. దీనివల్ల నష్టపోతున్నామని, ఎగుమతులు లేక సరుకు పెద్ద ఎత్తున పేరుకుపోయిందని, అక్టోబర్ నుంచి మంచి ధర వస్తుందని తయారీదారులు ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడెక్టులో భాగంగా కోనసీమ జిల్లాను కొబ్బరికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చిప్ప బొగ్గు తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కోకోనట్ బోర్డు, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువైన యూనిట్‌కు 35 శాతం వరకు రాయి తీ అందించనుంది. అంతకన్నా పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే రూ.పది లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నా రు. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో జిల్లాలో కోకోనట్ మిల్క్ యూనిట్‌తోపాటు కోకోనట్ చార్ కోల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది. మన్నిక ఎక్కువ.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యమైంది. చిప్ప దళసరి కావడంతోపాటు దీనిలో అధిక శాతం గ్యాస్ నిక్షిప్తమైనందున ఇది వేగంగా మండుతోంది. మిగిలిన రాష్ట్రాలలో ఆరు బయట బొగ్గు తయారీ ఎక్కువ. కోనసీమలో బొగ్గు తయారీ డ్రమ్ములలో చేస్తారు. దీనివల్ల బూడిద శాతం తక్కువగా ఉంటోంది. ఇక్కడ తయారయ్యే బొగ్గు ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటుంది. మార్కెట్ అవకాశాలు పెరగాలి మనం తయారు చేసే బొగ్గే అత్యంత నాణ్యమైంది. మార్కెటింగ్ అవకాశాలు పెద్దగా లేక అనుకున్న ధర రావడం లేదు. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నుంచి బొగ్గు తీసుకెళ్లి మరింత నాణ్యంగా తయారు చేసి కేజీ రూ.50 నుంచి రూ.70 చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మనకు మాత్రం ఆ ధర రావడం లేదు. మార్కెటింగ్ అవకాశాలు పెరిగితే మరింత ధర వచ్చే అవకాశముంది.– మట్టపర్తి రామకృష్ణ,ముంజువరం, పి.గన్నవరం మండలం అత్యంత ధృడమైంది ఇక్కడ తయారయ్యే కొబ్బరి చిప్పలో 80 నుంచి 90 శాతం మేర చిన్న చిన్న రంధ్రాలు ఉండడంతో ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటోంది. ఆటోమొబైల్, రక్షణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీలో అధికంగా వాడుతున్నారు. – ఎ.కిరిటీ, ఉద్యాన శాస్త్రవేత్త, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా ఎనర్జీ రంగంలో ఉన్న షెల్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హ్యుందాయ్‌కి చెందిన 36 డీలర్షిప్ కేంద్రాల వద్ద 60 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్లను షెల్ ఏర్పాటు చేస్తుంది. దేశంలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణను పెంచడం ఈ వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యం అని కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్‌న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన ‘కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడాన్ని వేగవంతం చేయడంలో ఇటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాలు ప్రాథమికమైనవి’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. హ్యుందాయ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల కోసం దేశవ్యాప్తంగా 45 నగరాల్లో 72 కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
రిలయన్స్ కేజీ–డీ6 గ్యాస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–డీ6 బ్లాక్ నుంచి వెలికితీసే గ్యాస్ విక్రయం కోసం నిర్వహించిన వేలానికి మంచి స్పందన కనిపించింది. వివిధ రంగాలకు చెందిన 41 కంపెనీలు వేలంలో పాల్గొనగా 29 సంస్థలు 5 ఏళ్ల కాలానికి గ్యాస్‌ను కొనుగోలు చేశాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), అదానీ–టోటల్ గ్యాస్, షెల్ తదితర కంపెనీలు వీటిలో ఉన్నాయి. రోజుకు 6 మిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను విక్రయించగా ఐవోసీ దాదాపు సగభాగాన్ని (2.9 ఎంసీఎండీ) దక్కించుకుంది. గెయిల్ 0.7 ఎంసీఎండీ, అదానీ–టోటల్ గ్యాస్ 0.4 ఎంసీఎండీ, షెల్ 0.5 ఎంసీఎండీ, జీఎస్పీసీ 0.25 ఎంసీఎండీ, ఐజీఎస్ మరో 0.5 ఎంసీఎండీ గ్యాస్‌ను కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్దిష్ట ఫార్ములా ప్రకారం గ్యాస్ ధర యూనిట్‌కు (ఎంబీటీయూ) 13.35 డాలర్లుగా ఉంటుందని పేర్కొన్నాయి. అయితే, సంక్లిష్ట ప్రాంతాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌కు ప్రభుత్వం నిర్దేశించిన సీలింగ్ రేటును చెల్లించాల్సి ఉంటుందని వివరించాయి. ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఇది 12.12 డాలర్లుగా ఉందని తెలిపాయి. ఈ రేటును కేంద్రం 6 నెలలకోసారి సవరిస్తుంది. రిలయన్స్, దాని భాగస్వామి బీపీ ఈ జనవరిలోనే వేలం నిర్వహించాలని భావించినప్పటికీ జనవరి 13న కేంద్రం కొత్త ధరల విధానాన్ని ప్రకటించింది. దీంతో వేలాన్ని వాయిదా వేసుకుని, మార్చి 9 నుంచి నిర్వహించింది. -
2030 నాటికి 10,000 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు: షెల్ ప్రణాళికలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ పాయింట్లు నెలకొల్పుతున్న ఐవోసీ, రిలయన్స్–బీపీ తదితర సంస్థల జాబితాలో తాజాగా షెల్ కూడా చేరుతోంది. 2030 నాటికి దేశీయంగా 10,000 పైచిలుకు చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. కార్లు, ద్విచక్ర వాహనాల కోసం తమ తొలి ఈవీ చార్జర్లను ఆవిష్కరించిన సందర్భంగా సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. తొలి విడతలో బెంగళూరులోని యశ్వంత్‌పూర్, బ్రూక్‌ఫీల్డ్ తదితర ప్రాంతాల్లో ఉన్న తమ పెట్రోల్ బంకుల్లో రీచార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ విస్తరించనున్నట్లు సంస్థ పేర్కొంది. -
కదిలితే గెలుస్తారు.. ఆగితే అలాగే ఉండిపోతారు
కదిలితే గెలుస్తారు. జీవితం ఒక్కోసారి పంక్చర్ అవుతుంది. ఫ్లాట్. కదల్దు. మెదల్దు. స్నేహితులు, బంధువులు లేని కూడలిలో ఒంటరిగా వొదిలిపెడుతుంది. ఆ క్షణంలో జీవితం భయపెడుతుంది. కాని జీవితాన్ని భయపెట్టేవాళ్లు ఉంటారు. స్టీరింగ్ చేతుల్లోకి తీసుకుంటారు. విమెన్స్ డే సందర్భంగా ప్రసిద్ధ ఆయిల్ సంస్థ ‘షెల్’ స్త్రీల కోసం ఒక కాంపెయిన్ మొదలెట్టింది. ‘గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ వెన్ వియ్ మూవ్’ దాని పేరు. జీవితం ఆగినప్పుడు వాహనాల ఆధారంగా విజయం సాధించిన స్త్రీలపై ఇన్స్పిరేషనల్ ఫిల్మ్స్ తీసి విడుదల చేసింది. వారిలో ఇద్దరు భారతదేశపు తొలి మహిళా ట్రక్ డ్రైవర్ యోగితా రఘువంశీ, బాలీవుడ్ స్టంట్ ఉమన్ గీతా టండన్ మానవ పురోగతి అంతా కదలడంలోనే ఉంది. జీవన పురోగతి కూడా చలనంలోనే ఉంటుంది. ఆగితే నిలువ నీరు. ఆగితే శిల. ఆగితే అసహాయత. ఆగితే దు:ఖం. ఆగితే ఓటమి. కదలడం అంటే ఏదో బస్సెక్కి కదలడం కాదు. ఆ జీవన సందర్భం నుంచి కదలడం. ఆ కష్టం నుంచి కదలడం. ఆ ప్రతిబంధకం నుంచి కదలడం. ‘ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది’ అంటుంటాం మనం. పారిపోకూడదు. కదలాలి. బయలుదేరాలి. పారిపోవడంలో లక్ష్యంలో లేదు. బయలుదేరడంలో ఉంది. అలా బయలుదేరి విజయం సాధించిన స్త్రీలు ఎందరో ఉన్నారు దేశంలో. వారందరి కథలూ స్ఫూర్తి నింపేవే అని భావిస్తోంది ‘షెల్’. ప్రఖ్యాత ఈ ఆయిల్ సంస్థ మొన్నటి విమెన్స్ డే సందర్భంగా కొన్ని ఇన్స్పిరేషనల్ ఫిల్మ్స్ తయారు చేసి విడుదల చేసింది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు వాహనాలను ఒక ఉపాధి మార్గం చేసుకుని ముందుకు సాగిన వారిపై ఈ ఫిల్మ్స్ తయారు చేసింది. ‘ఫొటో’, ‘యెల్లో టిన్ కెన్ ఫోన్’వంటి అవార్డు చిత్రాలకు దర్శకత్వం వహించిన అరుణిమ శర్మ ఈ ఫిల్మ్స్‌కు దర్శకత్వం వహించారు. తొలి విడత మూడు చిత్రాలు సిద్ధమైతే వాటిలో రెండు యోగితా రఘువంశీ, గీతా టండన్లపై. కదలడం వల్ల వీరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయో ఈ ఫిల్మ్స్‌లో ఉంటాయి. గీతా టాండన్ 35 ఏళ్ల గీతా టాండన్‌ను మీరు చాలా సినిమాల్లో చూసి ఉంటారు. చూసి ఉండరు. ఎందుకంటే ఆమె హీరోయిన్లకు స్టంట్స్ చేసే డూప్ కాబట్టి. ‘ఈ స్టంట్స్ కంటే పెద్ద ప్రమాదాలు తెస్తుంది జీవితం’ అంటారు గీతా. ముంబైకు చెందిన గీతకు 9 ఏళ్లు ఉండగానే తల్లి మరణించింది. బంధువులు పెట్టే పెట్టని ముద్దతో ఆమెకు చిన్నప్పుడే ఆకలి తెలిసింది. ‘తల్లి లేని పిల్ల... ఒక అయ్య చేతిలో తొందరగా పెట్టెయ్’ అంటే కంగారు పడి తండ్రి 16 ఏళ్లకే పెళ్లి చేసేశాడు. అత్తారింట్లో భర్తే ఆమె పాలిట విలన్. ఇద్దరు పిల్లలు పుట్టినా ఆ ఇంట్లో నిష్కృతి లేదని పిల్లలతో పారిపోయారు. పుట్టింటికి చేరితే మింగ మెతుకు లేదు. ఆకలి. ఏ పనికి వెళ్లినా ముందు ఆమె శరీరాన్ని అడిగి తర్వాత జీతం మాట్లాడేవారు. ‘నేను ఒకటే నిర్ణయించుకున్నా. భర్త నుంచి విడిపోయిన స్త్రీ తన శరీరం ద్వారానే బతుకుతుందనే అపప్రథను తుడిచేయదలుచుకున్నా’ అంటారామె. ఆమె చిన్నప్పటి నుంచి బాగా ఆటలు ఆడేవారు. బైక్ రైడింగ్ తెలుసు. ‘నీకు బైక్ నడపడం వచ్చు కదా. సినిమాలలో టై చెయ్’ అంటే ఆమె స్టంట్స్ వైపు వచ్చింది. తొలి రిస్క్ స్టంట్‌కు ఆమెకు వచ్చిన మొత్తం 1,200 రూపాయలు. బైక్ మాత్రమే కాదు కార్లు బస్సులు కూడా ఆమె చేతుల్లో పెంపుడు శునకంలా చెప్పినట్టు వింటాయి. ‘నేను చేస్తూ వెళ్లాను నా పిల్లల కోసం. ఒకసారి ముఖం కాలింది. ఒకసారి నడుము విరిగింది. అయితే ఏమిటి? నాకు నచ్చినట్టు గౌరవంగా బతకగలుగుతున్నాను. కష్టం వచ్చినప్పుడు డిప్రెషన్ రావచ్చు. దానిని పక్కన పెట్టండి. మరుసటిరోజు మీ కోసం మంచి అవకాశం ఎదురు చూస్తుండొచ్చు’ అంటారు గీతా టాండన్. అదిగో బైక్ మీద ఆమె దూసుకుపోతోంది. మనమెందుకు ఊరికే అలా కూచుని ఉండటం? యోగితా రఘువంశీ 70 టన్నుల బరువు, పది చక్రాలు ఉన్న హెవీ ట్రక్‌ను నడపడం అంటే అది కేవలం మగవారి పని మన దేశంలో. దాని శక్తి కావాలి. చేవ కావాలి. చేతుల్లో బలం కావాలి. ఆ బలం నాకూ ఉంది అనుకున్నారు యోగితా రఘువంశీ. భోపాల్‌కు చెందిన ఈ 50 ఏళ్ల వనిత ఒక గొప్ప సాహసం చేశారు 2013లో. ఆ సంవత్సరం ఆమె భర్త రాజ్ రఘువంశీ ఒక రోడ్ యాక్సిడెంట్లో మరణించాడు. అతను అడ్వకేట్ అయినా ట్రక్కులతో నడిచే ట్రాన్స్పోర్ట్ సంస్థ ఉండేది. ఆ సమయానికి యోగితా కూడా లా పూర్తి చేశారు. కాని జూనియర్‌గా చేరితే చాలా తక్కువ డబ్బులు వస్తాయని అనుకున్నారు. ట్రాన్స్పోర్ట్ సంస్థను తానే నడపాలనుకున్నారు. డ్రైవర్లను మాట్లాడారు. వారితో తలనొప్పి మెల్లగా అర్థమైంది. ఒక డ్రైవర్ ఆమె సంస్థకు చెందిన ట్రక్కుకు యాక్సిడెంట్ చేసి హైదరాబాద్‌లో వదిలి పారిపోయాడు. ‘నాకు ఇక వేరే మార్గం కనిపించలేదు. నేనే డ్రైవింగ్ చేద్దామనుకున్నాను’ అంటారు యోగితా. పిల్లల భవిష్యత్తు కోసం స్టీరింగ్ అందుకున్నారు. ‘నా మొదటి ప్రయాణం భోపాల్ నుంచి అహమదాబాద్‌కి. అప్పటికి నాకు రోడ్లు తెలియవు. సరిగ్గా దారులు కూడా తెలియవు. అడుగుతూ అడుగుతూ గమ్యానికి చేరుకున్నాను. ధాబాల దగ్గర నన్ను చూసిన మగాళ్లు ఒక రకంగా చూసేవారు. నేను ట్రక్ ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూచునే సరికి ఆ కళ్లల్లో గౌరవం వచ్చేసేది. వారు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కాలక్రమంలో ధాబాలన్నీ నాకు చాలా ఆత్మీయంగా మారిపోయాయి’ అంటారు యోగితా. దేశంలో ఆమె తిరగని ప్రాంతం లేదు. ‘ట్రక్కు ప్రయాణంలో రక్షణకు సంబంధించి రిస్క్ ఉంది. భోజనం, స్నానం సమస్యలే. కాని మెల్లగా నేను వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నాను. ఒక్కోసారి దారి మధ్యలో నేనే ఒండుకుంటాను’ అంటారు యోగితా. నాడు ఆమె ఏకైక మహిళా ట్రక్ డ్రైవర్. ఇవాళ ఆమె స్ఫూర్తితో ఎందరో. చలన విజయగాథ అంటే ఇదే. -
వెలుగులోకి మాల్యా కొత్త కంపెనీలు
న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు ఉడాయించిన విజయ్ మాల్యా కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అనుచరుల ద్వారా డొల్ల(షెల్) కంపెనీలను సృష్టించి వాటిద్వారా నిధులను(బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను) మాల్యా తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెలుగులోకి తెచ్చింది. ఈ లావాదేవీల్లో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తూ కొన్ని షెల్ కంపెనీలను(యునైటెడ్ బ్రాండింగ్ వరల్డ్‌వైడ్ ఇతరత్రా) గుర్తించింది. దీని ఆధారంగా బెంగళూరుకు చెందిన వి.శశికాంత్, అతని కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ గతవారం సోదాలు నిర్వహించింది. శశికాంత్ అనే వ్యక్తి మాల్యాకు అత్యంత ఆప్తుడని ఈడీ వర్గాలు తెలిపాయి. తాజాగా అమల్లోకి వచ్చిన ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్(ఎఫ్ఈఓ) చట్టం కింద ఈ చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో దాదాపు రూ.9,000 కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టిన మల్యాపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కేసుల నుంచి తప్పించుకోవడానికి బ్రిటన్ పారిపోయిన మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. -
కొబ్బరి చిప్ప కావాలా, నాయనా?
సాక్షి, ముంబై: ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ అమ్మకాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. అయితే అమెజాన్‌లో బ్రాండెడ్ దుస్తులో, స్మార్ట్‌ఫోన్ అమ్మకాలో, ప్రముఖ ఎలక్ట్రానిక్ అమ్మకాలో కాదు.. అతి విలువైన పురాతన వస్తువులు అంతకన్నా కాదు. ఇప్పటివరకూ పిడకలు, గొబ్బెమ్మలు, రెడిమేడ్ పిడకలు కూడా అమెజాన్ ఆన్లైన్ స్టోర్లలో దర్శనమిచ్చాయి. తాజాగా కొబ్బరి చిప్ప కప్పు లిస్ట్‌లో కనిపించడం వింతగా కనిపించింది. నాచురల్ కోకోనట్ షెల్ కప్ పేరుతో దీన్ని అమ్మకానికి పెట్టింది. నెటిజన్ల వ్యంగస్త్రాలతో నాచురల్ కోకోనట్ షెల్ కప్ క్షణాల్లో వైరల్‌గా మారింది. నాచురల్ కోకోనట్ షెల్ కప్ ధర రూ.1289 నుంచి ప్రారంభం.. డిమాండ్ పెరిగితే రూ.2499 వరకూ అంటూ ఇది అమెజాన్‌లో కనిపించింది. పైగా 55 శాతం స్పెషల్ డిస్కౌంట్ తో రూ.1365 లకు (కొబ్బరిచిప్ప ధర రూ.3వేల) అందిస్తోందట. ఈ రేటుకు మంచి పవర్ బ్యాంకునో, లేదా బ్రాండెడ్ హెడ్సెట్ కొనొచ్చు. నోకియా ఫీచర్ ఫోన్ కూడా కొనొచ్చు. రెండు సోనీ హెడ్‌సెట్స్ కూడా వస్తాయంటూ ట్విటర్లో జోకులు పేలుతున్నాయి. మా యింటి ద్గగర గుట్టల కొద్దీ కొబ్బరి చిప్పలు ఉన్నాయి, అమెజాన్‌కు అవి ఉచితం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. దీంతో ట్విటర్లో పెద్ద చర్చే మొదలైంది. ఈ నాచులర్ కోకోనట్ షెల్ కప్ స్పెసిఫికేషన్స్ చూసి తీరాల్సిందే. మరోవైపు ప్రస్తుతం ఈ కప్ అందుబాటులో లేదు అన్న సమాచారం అమెజాన్ సైట్లో కనిపిస్తోంది. Didn’t realise that my mundane #malluanguish tweet would create a ‘storm in a coconut 🥥 cup’. 😀https://t.co/BXu7JobzJm — Rema Rajeshwari IPS (@rama_rajeswari) January 16, 201 Dear @amazonIN, If u come to my house I will give u free coconut shell in loads! #Amazon #Bravo #MiddleClassWithModi pic.twitter.com/6R0iKF1Y5r — Abimanyu Karthick (@abimanyukarthik) January 15, 2019 2 ways to become a millionaire: * Supply kottanguchi to Amazon (🥥 Coconut shell) * Sell Idly in front of Apollo hospital 😜#Justmillionairethings — barath kumar (@barathkumar22) January 15, 2019 -
సరికొత్త రికార్డ్ స్థాయికి రిలయన్స్
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరోసారి రికార్డ్ హైని నమోదు చేసింది. రూ. 1649 వద్ద ఆర్ఐఎల్ 9 ఏళ్ల గరిష్టాన్ని తాకింది.గత రెండు వారాల్లో 6.5 శాతం వృద్ధిని సాధించింది. దీంతో ఆర్ఐఎల్ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) రూ. 5.35 లక్షల కోట్లను అధిగమించింది. ఇటీవల ప్రకటించిన జూన్ క్వార్టర్ మంచి ఫలితాలు, 1:1బోనస్ సిఫార్సు, సహా షెల్ కంపెనీ ప్రమాద వార్త కూడా తోడ్పడిందని అంచనా. ప్రపంచ చమురు దిగ్గజం షెల్‌కు యూరప్‌లోని రోటర్‌డామ్‌లో గల అతిపెద్ద రిఫైనరీ భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకుందన్న వార్తలు దేశీ ప్రయివేట్ రంగ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు జోష్‌నిచ్చాయి. అంతేకాదు రోజుకి 4 లక్షల బ్యారళ్ల చమురు శుధ్ది సామర్థ్యం కలిగిన రోటర్‌డామ్ రిఫైనరీని మూసివేయనున్నారనే ఆందోళన కూడా వ్యాపించింది. ఫలితంగా సింగపూర్ తదితర ఆసియా రిఫైనరీ సంస్థలకు మేలు చేకూరనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) మెరుగుపడే వీలున్నట్లు చెబుతున్నారు. మరోవైపు హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్), ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మదర్సన్ సుమి సిస్టమ్స్, మాగ్మా ఫిన్‌కార్ప్, కాప్లిన్ పాయింట్ లాబొరేటరీస్ బిఎస్ఇ ఎస్ అండ్ పి లో టాప్ లో నిలిచాయి. కాగా ఆర్బీఐ వడ్డీరేట్ల కోత కారణంగా ప్రయివేటు, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లను కోల్పోయింది. దేశీయ స్టాక్‌మార్కెట్లలో తీవ్ర ఊగిసలాట కొనసాగుతోంది. -
రూ.25వేల కోట్లు చెల్లించండి!
ఓఎన్జీసీ, రిలయన్స్, షెల్‌కు కేంద్రం నోటీసులు న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, రాయల్ డచ్ షెల్ కంపెనీలకు 3.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.25,487 కోట్లు) బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది. దాదాపు రెండు నెలల క్రితం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) జారీ చేసిన ఈ నోటీసు విషయాన్ని తాజాగా ఓఎన్జీసీ ధ్రువీకరించింది. అరేబియా సముద్రంలోని పన్నా–ముక్తా అండ్ తపతీ (పీఎంటీ) చమురు, గ్యాస్ క్షేత్రాల విషయంలో ‘డిఫరెన్షియేట్ గవర్నమెంట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్– పెట్రోలియం అండ్ రాయిల్టీ’ కింద చెల్లించాల్సిన మొత్తాల విషయంలో తనకు సానుకూలంగా వచ్చిన ఆర్బిట్రేషన్ అవార్డు అమలు కోసం ప్రభుత్వం తాజా నోటీసులు ఇచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. పీఎంటీలో ఓఎంజీసీకి 40 శాతం వాటా ఉంది. ఆర్ఐఎల్, షెల్ కంపెనీలకు 30 శాతం చొప్పున వాటా ఉంది. దీనిప్రకారం ఓఎన్జీసీ చెల్లించాల్సిన మొత్తం రూ.10,195 కోట్లు. -
3 బిలియన్ డాలర్లు కట్టండి
పీఎంటీ క్షేత్రాలపై ఆర్ఐఎల్, షెల్, ఓఎన్జీసీకి ప్రభుత్వం నోటీసులు న్యూఢిల్లీ: పన్నా/ముక్తా, తపతి (పీఎంటీ) చమురు, గ్యాస్ క్షేత్రాల్లో ఉత్పత్తి వ్యయాల రికవరీకి సంబంధించి 3 బిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఆపరేటర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, రాయల్ డచ్ షెల్, ఓఎన్జీసీ సంస్థలకు డీజీహెచ్ నోటీసులు పంపింది. 2016 అక్టోబర్ నాటి ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పాక్షిక ఉత్తర్వుల ప్రకారం అసలు, వడ్డీ, ఇతర చార్జీలతో కలిపి ఈ మొత్తం చెల్లించాలని మే ఆఖరులో పంపిన డిమాండ్ నోటీసులో సూచించింది. అయితే, ఇందుకు ఆఖరు తేదీ, చెల్లించకపోతే పర్యవసానాలు వంటివేమీ అందులో పేర్కొనలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తుది ఉత్తర్వులు వెలువరించడానికి ముందుగానే ‘పాక్షిక’ ఆర్బిట్రేషన్ అవార్డు ఆధారంగా డీజీహెచ్ ఈ నోటీసు జారీ చేసినట్లు వివరించాయి. మరోవైపు పరిహార మొత్తాన్ని (ఏదైనా కట్టాల్సింది ఉంటే) ఆర్బిట్రేషన్ ప్యానెల్ పూర్తిగా ఖరారు చేయకముందే ఇటువంటి చర్యలు సరికాదని ఆర్ఐఎల్ వర్గాలు పేర్కొన్నాయి. నోటీసులకు తగు వివరణ ఇప్పటికే పంపినట్లు తెలిపాయి. వివరాల్లోకి వెడితే.. పీఎంటీలో ఆర్ఐఎల్, బీజీ ఎక్స్‌ప్లొరేషన్‌కు చెరి 30 శాతం, ఓఎన్జీసీకి మిగతా వాటాలు ఉన్నాయి. బీజీని టేకోవర్ చేసిన షెల్ ఆ తర్వాత దాని స్థానంలో వాటాలు దక్కించుకుంది. వ్యయాల రికవరీ, లాభాల్లో వాటాలు, ఉత్పత్తి పంపక ఒప్పందంలోని (పీఎస్సీ) అకౌంటింగ్ విధానాలు మొదలైన అంశాలపై ఆపరేటర్లకు, ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. దీనిపై 2010లో ఆర్ఐఎల్ .. ప్రభుత్వంపై ఆర్పిట్రేషన్ ట్రిబ్యునల్‌కు వెళ్లగా 2012లో దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అయితే, ప్రభుత్వం వీటిని సవాలు చేసింది. తదుపరి బ్రిటన్‌లో ఆర్బిట్రేషన్ కమిటీ.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. -
ప్రకృతి విపత్తులను తట్టుకునేట్టుగా...
జర్మనీః కొబ్బరి చెట్టు' వ్యాసం ప్రతి విద్యార్థీ చిన్న తరగతుల్లో చదువుకునే ఉంటాడు. కొబ్బరిచెట్టు ఆకులు, కాండం నుంచీ కాయలదాకా ప్రతి భాగం మనిషి జీవితంలో ఎంతో ఉపయోగ పడుతుందని ఆ వ్యాసం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఎందరికో అనుభవపూర్వకం కూడా. అందుకే కాబోలు జర్మనీ శాస్త్రవేత్తల దృష్టి కొబ్బరి పై పడింది. నాగరికతద్వారా మనుషులు భూమిపై వారి ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నా... ప్రకృతి సహజ విపత్తులు, అంటువ్యాధులు వంటివి ఇంకా జీవితాలపై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి విపత్తుల పరిష్కారం దిశగా ఆలోచించిన జర్మన్ శాస్త్రవేత్తలు కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. భూకంపాలను నిరోధించేందుకు కొబ్బరి కాయలో అత్యంత ధృఢంగా ఉండే పెంకులపై దృష్టి సారించారు. జర్మన్ రీసెర్చ్ ఫౌండేషన్ విపత్తులను ఎదుర్కొనేందుకు కొత్త మార్గంలో ప్రయోగాలు చేస్తోంది. తమ ప్రణాళికలను అభివృద్ధి పరిచేందుకు పరిశోధకులు ప్రయత్నాలు ప్రారంభించారు. సహజ విపత్తులను తట్టుకోగలిగే శక్తి కొబ్బరి పెంకులో ఉన్నట్లు గుర్తించారు. అందులోని పదార్థాల ఆధారంగా భూ కంపాలు ఇతర ప్రకృతి విలయాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా 30 మీటర్ల ఎత్తు ఉండే కొబ్బరి చెట్లనుంచీ కాయలు కింద పడినా పగిలిపోకుండా కాపాడే కొబ్బరి పెంకు ధృఢత్వాన్ని గుర్తించిన పరిశోధకులు... దాని ఆధారంగా విపత్తు నివారణా మార్గాలపై అధ్యయనం చేశారు. కొబ్బరి పెంకు నిర్మాణానికి సంబంధించిన ఫార్ములాపై ప్రయోగాలు చేస్తున్నారు. కొబ్బరి పెంకులో ఉండే లెథరీ ఎక్సో కార్ప్, ఫైబరస్ మెకోకార్స్, ఎండోకార్ప్ అనే మూడు పొరల వల్ల కొబ్బరి పెంకు ధృఢంగా ఉంటుందన్న విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు అదే స్ఫూర్తిగా ఇళ్ళ నిర్మాణం చేపడితే విపత్తులను, భూకంపాలను తట్టుగోగల్గుతాయన్న దిశగా ఆలోచిస్తున్నారు. బయోలాజికల్ డిజైన్ అండ్ ఇంటిగ్రేటివ్ స్ట్రక్చర్స్ ప్రాజెక్టు ద్వారా.. జర్మనీలోని ఫ్రీబర్గ్ యూనివర్శిటీ ప్లాంట్ బయో మెకానిక్స్ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు, మెటీరియల్ సైంటిస్టు ల బృందం సంయుక్తంగా భూకంపాలను తట్టుకునే నిర్మాణాలను చేపట్టే దిశగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యంత్రాలను వినియోగించి కొబ్బరి పెంకులోని మూడు పొరల్లో ఉండే శక్తిని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎండోకార్ప్ పొర కారణంగా కొబ్బరి పెంకు ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగలదని, పగుళ్ళు లోపలకు పోనీకుండా అందులోని లిగ్నిఫైడ్ స్టోన్ సెల్స్ ప్రభావం చూపిస్తాయని గుర్తించారు. తమ ప్రయోగాలు ఫలిస్తే.. భవిష్యత్తులో భూకంపాలు వచ్చినా తట్టుకోగలిగే ఇళ్ళ నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని చెప్తున్నారు.