ప్రకృతి విపత్తులను తట్టుకునేట్టుగా... | Coconut Shell Inspires Scientists To Envision An Earth-quake Resistant Material | Sakshi

ప్రకృతి విపత్తులను తట్టుకునేట్టుగా...

Jul 9 2016 11:38 AM | Updated on Sep 4 2017 4:29 AM

ప్రకృతి విపత్తులను తట్టుకునేట్టుగా...

ప్రకృతి విపత్తులను తట్టుకునేట్టుగా...

జర్మన్ రీసెర్చ్ ఫౌండేషన్ పరిశోధకులు విపత్తులను ఎదుర్కొనేందుకు కొత్త మార్గంలో ప్రయోగాలు ప్రారంభించారు. సహజ విపత్తులను తట్టుకోగలిగే శక్తి.. కొబ్బరి పెంకులో ఉన్నట్లు గుర్తించారు.

జర్మనీః కొబ్బరి చెట్టు' వ్యాసం ప్రతి విద్యార్థీ చిన్న తరగతుల్లో చదువుకునే ఉంటాడు. కొబ్బరిచెట్టు ఆకులు, కాండం నుంచీ కాయలదాకా ప్రతి భాగం మనిషి జీవితంలో ఎంతో ఉపయోగ పడుతుందని ఆ వ్యాసం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఎందరికో అనుభవపూర్వకం కూడా. అందుకే కాబోలు జర్మనీ శాస్త్రవేత్తల దృష్టి కొబ్బరి పై పడింది. నాగరికతద్వారా మనుషులు భూమిపై వారి ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నా... ప్రకృతి సహజ విపత్తులు, అంటువ్యాధులు వంటివి ఇంకా జీవితాలపై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి విపత్తుల పరిష్కారం దిశగా ఆలోచించిన జర్మన్ శాస్త్రవేత్తలు కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. భూకంపాలను నిరోధించేందుకు కొబ్బరి కాయలో అత్యంత ధృఢంగా ఉండే పెంకులపై దృష్టి సారించారు.

జర్మన్ రీసెర్చ్ ఫౌండేషన్ విపత్తులను ఎదుర్కొనేందుకు కొత్త మార్గంలో ప్రయోగాలు చేస్తోంది. తమ ప్రణాళికలను అభివృద్ధి పరిచేందుకు పరిశోధకులు ప్రయత్నాలు ప్రారంభించారు. సహజ విపత్తులను తట్టుకోగలిగే శక్తి కొబ్బరి పెంకులో ఉన్నట్లు గుర్తించారు. అందులోని పదార్థాల ఆధారంగా భూ కంపాలు ఇతర ప్రకృతి విలయాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా 30 మీటర్ల ఎత్తు ఉండే కొబ్బరి చెట్లనుంచీ కాయలు కింద పడినా పగిలిపోకుండా కాపాడే కొబ్బరి పెంకు ధృఢత్వాన్ని గుర్తించిన పరిశోధకులు... దాని ఆధారంగా విపత్తు నివారణా మార్గాలపై అధ్యయనం చేశారు. కొబ్బరి పెంకు నిర్మాణానికి సంబంధించిన ఫార్ములాపై ప్రయోగాలు చేస్తున్నారు. కొబ్బరి పెంకులో ఉండే లెథరీ ఎక్సో కార్ప్, ఫైబరస్ మెకోకార్స్, ఎండోకార్ప్ అనే మూడు పొరల వల్ల కొబ్బరి పెంకు ధృఢంగా ఉంటుందన్న విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు అదే స్ఫూర్తిగా ఇళ్ళ నిర్మాణం చేపడితే విపత్తులను, భూకంపాలను తట్టుగోగల్గుతాయన్న దిశగా ఆలోచిస్తున్నారు.  

బయోలాజికల్ డిజైన్ అండ్ ఇంటిగ్రేటివ్ స్ట్రక్చర్స్ ప్రాజెక్టు ద్వారా.. జర్మనీలోని  ఫ్రీబర్గ్ యూనివర్శిటీ ప్లాంట్ బయో మెకానిక్స్ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు, మెటీరియల్ సైంటిస్టు ల బృందం సంయుక్తంగా  భూకంపాలను తట్టుకునే నిర్మాణాలను చేపట్టే దిశగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యంత్రాలను వినియోగించి కొబ్బరి పెంకులోని మూడు పొరల్లో ఉండే శక్తిని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎండోకార్ప్ పొర కారణంగా కొబ్బరి పెంకు ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగలదని, పగుళ్ళు లోపలకు పోనీకుండా అందులోని లిగ్నిఫైడ్ స్టోన్ సెల్స్ ప్రభావం చూపిస్తాయని గుర్తించారు.  తమ ప్రయోగాలు ఫలిస్తే.. భవిష్యత్తులో భూకంపాలు వచ్చినా తట్టుకోగలిగే ఇళ్ళ నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement