న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర విద్యుత్ శాఖ బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.
వీటి ప్రకారం బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు (బీసీఎస్), బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల (బీఎస్‌ఎస్) ఓనర్లు, మార్చుకోతగిన బ్యాటరీలను చార్జ్ చేసేందుకు ప్రస్తుతమున్న విద్యుత్ కనెక్షన్‌నే ఉపయోగించుకోవచ్చు. కనెక్టెడ్ లోడ్‌ను పెంచుకున్నా, పెంచుకోకపోయినా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. మెరుగైన స్వాపింగ్, చార్జింగ్ కోసం ట్రక్కులు, బస్సులు లాంటి భారీ వాహనాలు లిక్విడ్–కూల్డ్ స్వాపబుల్ బ్యాటరీలను వినియోగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment