న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ డేసంగ్ ఎల్టెక్‌తో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు మిందా కార్పొరేషన్ తెలిపింది. దీని కింద కొత్త తరం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) సొల్యూషన్స్‌ను భారత ఆటోమోటివ్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది.
రాబోయే కొన్నేళ్లలో పలు ఏడీఏఎస్ ఫీచర్లు సర్వత్రా వినియోగంలోకి వస్తాయని కార్ల తయారీ దిగ్గజాలు అంచనా వేస్తున్నట్లు మిందా కార్పొరేషన్ ఈడీ ఆకాశ్ మిందా తెలిపారు. ఇప్పటికే దేశీ మార్కెట్లో ఇందుకు సంబంధించి తొలి సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment