భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కొత్త స్కీమ్ పేరు ''పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్'' (PM E-DRIVE). ఇది మార్చి వరకు తొమ్మిదేళ్లపాటు అమలులో ఉన్న ప్రస్తుత 'ఫేమ్' ప్రోగ్రామ్‌ను భర్తీ చేస్తుంది.
ఈ కొత్త పథకం ద్వారా ఎలక్ట్రిక్ కార్లకు ఎటువంటి సబ్సిడీలు లభించదు. కానీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, బస్సులకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. దీనికోసం కేంద్రం రెండేళ్లకు రూ. 10900 కోట్లు కేటాయించారు. ఇందులో హైబ్రిడ్ అంబులెన్స్‌లు, ఎలక్ట్రిక్ ట్రక్కులకు కూడా కొంత ప్రోత్సాహాలు లభిస్తాయి.
పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ కింద 88500 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్' ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు వైష్ణవ్ విలేకరులతో చెప్పారు.
రాష్ట్ర రవాణా సంస్థలు & ప్రజా రవాణా సంస్థల ద్వారా 14,028 ఎలక్ట్రిక్ బస్సుల సేకరణకు రూ.4,391 కోట్లు అందించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పూణె, హైదరాబాద్‌ల వంటి 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న తొమ్మిది నగరాల్లో CESL ద్వారా డిమాండ్ అగ్రిగేషన్ చేయనున్నారు. రాష్ట్రాలతో సంప్రదించిన తరువాత ఇంటర్‌సిటీ, ఇంటర్‌స్టేట్ ఎలక్ట్రిక్ బస్సులకు కూడా మద్దతు లభిస్తుంది.
ఎలక్ట్రిక్ అంబులెన్స్‌ల ఏర్పాటు చేయడానికి కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. రోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రిక్ ట్రక్కుల ప్రోత్సహించేందుకు కూడా రూ.500 కోట్లు అందించారు.
ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్‌స్టాలేషన్స్
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పటికి కూడా చాలామంది కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణం.. ఛార్జింగ్ సదుపాయాలు లేకపోవడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయనుంది. ఎంపిక చేసిన నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్‌స్టాల్ చేయనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ కోసం 22,100 ఫాస్ట్ ఛార్జర్‌లు, ఈ-బస్సుల కోసం 1,800 ఫాస్ట్ ఛార్జర్‌లు, టూ వీలర్ & త్రీ వీలర్స్ కోసం 48400 ఫాస్ట్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేయనున్నట్లు సమాచారం. దీనికోసం రూ. 2000 కోట్లు వెచ్చించారు.
Comments
Please login to add a commentAdd a comment