ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో మారుతి సుజుకి తన 'వ్యాగన్ఆర్'ను ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ దీనిని 'ఈడబ్ల్యూఎక్స్' (eWX) పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీని కోసం పేటెంట్ దాఖలు చేసింది.
2023 ఆటో ఎక్స్‌పోలో మొదటిసారి కనిపించిన ఈ కారు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు సీ షేప్ లైట్ క్లస్టర్‌లతో క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ పొందుతుంది. ప్లాస్టిక్ క్లాడింగ్ బంపర్ ఉంటుంది. వీల్స్, సైడ్ స్కర్ట్‌లపై పసుపు రంగుతో ఉండటం చూడవచ్చు. ఇది ఒక ఫుల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది. అయితే కచ్చితమైన గణాంకాలు లాంచ్ తరువాత తెలుస్తాయి.
మారుతి సుజుకి ఈ కారును భారతదేశంలో లాంచ్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి హైబ్రిడ్ కార్లను లాంచ్ చేయాలనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే స్విఫ్ట్ వంటి కార్లను హైబ్రిడ్ వెర్షన్‌లలో పరిచయం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment