జుట్టు రాలడం తగ్గి కురులు ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కా ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా మందార తైలం తయారు చేసుకుని తలకు పట్టిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
►ఇరవై మందార పువ్వులను తీసుకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి.
►పువ్వులు బాగా ఆరిన తరువాత మిక్సీజార్‌లో వేసుకుని రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
►ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెపెట్టి దానిలో అరలీటరు నువ్వుల నూనె లేదా కొబ్బరినూనె పోయాలి.
మెంతులు కూడా వేసి
►అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మందార పువ్వుల పేస్టు, స్పూను మెంతులు వేసి మరగనివ్వాలి.
►మరిగిన తరువాత దించేముందు కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి.
పచ్చకర్పూరం లేదంటే..
►తర్వాత ఆయిల్‌ను చల్లారనిచ్చి వడకట్టి సీసాలో భద్రపరుచుకోవాలి.
►ఈ మందార తైలాన్ని వారానికి రెండుసార్లు తలకు పట్టించి మర్దనా చేస్తే.. కుదుళ్లకు పోషణ అందుతుంది.
►ఫలితంగా రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
►పచ్చకర్పూరం లేదా ముద్దకర్పూరం వేయడం వల్ల పేలు రాకుండా ఉండటమే కాక మాడుకు చల్లగా హాయిగా అనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment