మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ సాయమవుతుంది. కప్పు నీటిలో ఒక మందార పువ్వు వేసి మరిగించి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్ తయారు చేసి మజ్జిగలో కలిపేసుకుని రోజూ తాగితే కాలేయం వ్యర్థపదార్థాల నుంచి రక్షణ పొందుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిరియాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి.
రోజూ రెండు మూడు పుదీనా ఆకుల్ని నమిలి మింగుతుంటే జీర్ణశక్తి పెరిగి, కడుపు ఉబ్బరం, తేన్పులు తగ్గుతాయి. శ్వాసకోశాల శక్తి పెరుగుతుంది.
వేపాకు, యాంటీ సెప్టిక్‌గాన, క్రిమి సంహారిణిగానూ బాగా పనిచేస్తుంది. వేపాకు పొడిని నీళ్లల్లో కలిపి చల్లితే ఎన్నో రకాల క్రిమి కీటకాలు దూరంగా వెళ్లిపోతాయి. వేపాకుల్ని నీటిలో వేసి మరిగించి స్ప్రే చేస్తే దోమల బెడద తప్పుతుంది. వేపాకు పొడిని పేస్ట్‌గా చేసి వాడితే పలు రకాల చర్మ సమస్యలు, మొటిమలు, ఎగ్జిమాల బాధలు తప్పుతాయి.
పసుపును పేస్ట్‌గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పను దాకా కడుపులోకి తీసుకోవచ్చు.
(చదవండి: ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు)
Comments
Please login to add a commentAdd a comment