మారుతున్న కాలంలో చాలా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వచ్చేస్తోంది. దీంతో చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. మరికొంతమంది మార్కెట్లో దొరికే అనేక రకాల రసాయనాలతో కూడిన హెయిర్ డైలను ఎడా పెడా వాడేస్తున్నారు. ఈ అనారోగ్యకరమైన కెమికల్స్‌తో కొత్త సమస్యలొస్తున్నాయి. అయితే మరికొంతమంది మాత్రం ఓపిగ్గా సహజమైన హెన్నా, ఇతర చిట్కాలను వాడుతున్నారు. మరి అలాంటి చిట్కా మీకోసం..
జామ ఆకులు: సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన చుట్టూదొరికేవాటితోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో జామ ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జామ ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌నుంచి తీసిన రసంలో 2 స్పూన్ల బాదం ఆయిల్ కలిపి జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నల్ల నువ్వులు
నల్ల నువ్వులు జుట్టును నల్లగా మారుస్తాయి. కొన్ని నల్ల నువ్వులను వారానికి రెండుసార్లు తినడం వల్ల జుట్టు నెరిసే ప్రక్రియ నెమ్మదిస్తుంది లేదా రివర్స్ కూడా చేయవచ్చు.
ఆమ్లా లేదా పెద్ద ఉసిరి
ఆమ్లా జుట్టు పిగ్మెంటేషన్‌ను మెరుగుపరుస్తుంది. ఎండబెట్టిన ఉసిరికాయముక్కలు, కొబ్బరి నూనెలో కలిపి బాగా నల్లగా వచ్చే దాకా మరగించాలి. ఈ తైలాన్ని జుట్టు పట్టిస్తే కేశాలు నల్లగా మారతాయి. అంతేకాదు ఈ ఆయిల్‌ను మాడుకు మసాజ్ చేసినా, ఆమ్లా జ్యూస్ తాగినా జుట్టు రాలడం తగ్గుతుంది, నల్లని నిగనిగలాడే జుట్టు మీ సొంతం.
కరివేపాకు: కరివేపాకు జుట్టు ప్రయోజనకారిగా ఉంటుంది. కరివేపాకులను పేస్ట్‌లా చేసి పెరుగుతో కలిపి వారానికి రెండుసార్లు జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అశ్వగంధ: ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జుట్టు తెల్లగా అయిపోవడానికి తగ్గిస్తుంది.అశ్వగంధ వేరు పౌడర్‌తో పాటు బ్రాహ్మీ పొడిని పేస్ట్‌గా తయారు చేసి మాస్క్‌గా ఉపయోగించవచ్చు. ఈ మాస్క్‌ని నెత్తిమీద మసాజ్ చేసి తర్వాత కడిగేసుకుంటే లాభాలు వస్తాయి. అశ్వగంధ టీ తీసుకోవడం వల్ల జుట్టు నెరసిపోవడం కూడా తగ్గుతుంది.
భృంగరాజ్: దీన్నే గుంట గలకర అని కూడా అంటారు. బృంగరాజ్ ఆకులను ఏదైనా నూనెలో రాత్రంతా నానబెట్టి, ఈ నూనెను జుట్టుకు రాసుకోవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా చాలామంచిది.
మందార పువ్వు: మందారలో విటమిన్ సి ఎ , ఐరన్ లభిస్తాయి. జుట్టుకు ఏదైనా నూనెతో కలిపి దాని ఎండబెట్టిన, లేదా పచ్చి పువ్వులను వేసి బాగా మరిగించి, చల్లారిన తరవుఆత దాన్ని జుట్టుకు పట్టించుకొని, తరువాత వాష్ చేసుకుంటే తెల్ల జుట్టు నివారణతో పాటు, మంచి మెరుపు కూడా వస్తుంది.
తెల్ల జుట్టును తగ్గించడంలో ఉల్లిపాయ కూడా బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన జుట్టు కోసం సలాడ్లు, చేపలు, మాంసం, పండ్లు , ఆకు కూరలు ఎక్కువగా తినాలి.
Comments
Please login to add a commentAdd a comment