grey hair
-
తెల్లవెంట్రుకలకు శాశ్వతంగా గుడ్ బై : అమేజింగ్ వీడియో
ప్రస్తుతం కాలంలో తెల్లవెంట్రుకలు ఎక్కువగా బాధించే సమస్య. 50ఏళ్ల దాటిన తరువాత నల్లుజుట్టు తెల్లగా మారితే పెద్దగా సమస్య ఉండదు. కానీ టీనేజ్లోనే తెల్ల జుట్టు రావడంతో చాలి నిరాశకు లోనవు తున్నారు. తెల్లజుట్టు పోగొట్టుకోవడానికి యువత పడని పాట్లు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. మార్కెట్లో రకరకాల కాస్ట్లీ ఉత్పత్తులతోపాటు, సహజంగా దొరికే, ఆర్గానిక్ పదార్థాలతో తయారైన చిట్కాలకోసం ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్విటర్లో ఒక వీడియో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ వీడియోలో లవంగాలు, ఉల్లిపాయల పొట్టు, టీ బ్యాగులతో కషాయం తయారుచేశారు. దీన్ని చక్కగా వడబోసుకుని ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. కావాలంటే ఫ్రిజ్‌లో కూడా పెట్టుకోని వాడుకోవచ్చు. ఈ కషాయాన్ని కుదుళ్లతో సహా తలకు బాగా పట్టించి, బాత్ క్యాప్ లేదా, ప్లాస్టిక్ కవర్‌తో తలను కవర్ చేసి కొద్దిసేపు వదిలివేయాలి. ఆ తరువాత వాటర్‌తో కడిగేయాలి. షాంపులాంటివి వాడకూడదు. ఇలా చేయడం ద్వారా తెల్ల వెంట్రుకలకు చక్కటి పరిష్కారం లభిస్తుందని ఈ వీడియోలో పేర్కొనడం విశేషం. దీని వల్ల జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుందట. అయితే దీనిపై నెటిజన్లు కమెంట్లు విభిన్నంగా ఉన్నాయి. నోట్: ఇది అవగాహన కోసం అందించిన వీడియో మాత్రమే. Say Goodbye to gray hair permanently pic.twitter.com/EVYDMLJkTJ — Learn Something (@cooltechtipz) April 4, 2024 -
తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఇవిగో చిట్కాలు!
మారుతున్న కాలంలో చాలా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వచ్చేస్తోంది. దీంతో చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. మరికొంతమంది మార్కెట్లో దొరికే అనేక రకాల రసాయనాలతో కూడిన హెయిర్ డైలను ఎడా పెడా వాడేస్తున్నారు. ఈ అనారోగ్యకరమైన కెమికల్స్‌తో కొత్త సమస్యలొస్తున్నాయి. అయితే మరికొంతమంది మాత్రం ఓపిగ్గా సహజమైన హెన్నా, ఇతర చిట్కాలను వాడుతున్నారు. మరి అలాంటి చిట్కా మీకోసం.. జామ ఆకులు: సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన చుట్టూదొరికేవాటితోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో జామ ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జామ ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్నుంచి తీసిన రసంలో 2 స్పూన్ల బాదం ఆయిల్ కలిపి జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నల్ల నువ్వులు నల్ల నువ్వులు జుట్టును నల్లగా మారుస్తాయి. కొన్ని నల్ల నువ్వులను వారానికి రెండుసార్లు తినడం వల్ల జుట్టు నెరిసే ప్రక్రియ నెమ్మదిస్తుంది లేదా రివర్స్ కూడా చేయవచ్చు. ఆమ్లా లేదా పెద్ద ఉసిరి ఆమ్లా జుట్టు పిగ్మెంటేషన్‌ను మెరుగుపరుస్తుంది. ఎండబెట్టిన ఉసిరికాయముక్కలు, కొబ్బరి నూనెలో కలిపి బాగా నల్లగా వచ్చే దాకా మరగించాలి. ఈ తైలాన్ని జుట్టు పట్టిస్తే కేశాలు నల్లగా మారతాయి. అంతేకాదు ఈ ఆయిల్‌ను మాడుకు మసాజ్ చేసినా, ఆమ్లా జ్యూస్ తాగినా జుట్టు రాలడం తగ్గుతుంది, నల్లని నిగనిగలాడే జుట్టు మీ సొంతం. కరివేపాకు: కరివేపాకు జుట్టు ప్రయోజనకారిగా ఉంటుంది. కరివేపాకులను పేస్ట్‌లా చేసి పెరుగుతో కలిపి వారానికి రెండుసార్లు జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అశ్వగంధ: ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జుట్టు తెల్లగా అయిపోవడానికి తగ్గిస్తుంది.అశ్వగంధ వేరు పౌడర్‌తో పాటు బ్రాహ్మీ పొడిని పేస్ట్‌గా తయారు చేసి మాస్క్‌గా ఉపయోగించవచ్చు. ఈ మాస్క్‌ని నెత్తిమీద మసాజ్ చేసి తర్వాత కడిగేసుకుంటే లాభాలు వస్తాయి. అశ్వగంధ టీ తీసుకోవడం వల్ల జుట్టు నెరసిపోవడం కూడా తగ్గుతుంది. భృంగరాజ్: దీన్నే గుంట గలకర అని కూడా అంటారు. బృంగరాజ్ ఆకులను ఏదైనా నూనెలో రాత్రంతా నానబెట్టి, ఈ నూనెను జుట్టుకు రాసుకోవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా చాలామంచిది. మందార పువ్వు: మందారలో విటమిన్ సి ఎ , ఐరన్ లభిస్తాయి. జుట్టుకు ఏదైనా నూనెతో కలిపి దాని ఎండబెట్టిన, లేదా పచ్చి పువ్వులను వేసి బాగా మరిగించి, చల్లారిన తరవుఆత దాన్ని జుట్టుకు పట్టించుకొని, తరువాత వాష్ చేసుకుంటే తెల్ల జుట్టు నివారణతో పాటు, మంచి మెరుపు కూడా వస్తుంది. తెల్ల జుట్టును తగ్గించడంలో ఉల్లిపాయ కూడా బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన జుట్టు కోసం సలాడ్లు, చేపలు, మాంసం, పండ్లు , ఆకు కూరలు ఎక్కువగా తినాలి. -
చిన్న వయసులోనే అని.. జుట్టు పీక్కుంటే ఏం లాభం, ఇవి తెలుసుకోండి!
కాస్త వయసు మీద పడ్డాక అంటే దాదాపు 40-50 ఏళ్ల మధ్య నల్లటి జుట్టు తెల్లగా మారడం సహజమే. కానీ మారుతున్న జీవనశైలి ఇతర కారణలతో చిన్న వయస్సులోనే వైట్ హెయిర్ రావడంపెద్ద సమస్యగా మారుతోంది. దీనికి కారణాలేంటి? చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా చిన్న వయసులోనే,అనుకున్నదానికంటే ముందుగానే జుట్టు మెరిసిపోవడం అనేది జన్యుపరమైన సమస్యలతో పాటు అంతర్లీన ఆరోగ్య సమస్యలతో కూడా ముడిపడి ఉంటుంది. హెయిర్ ఫోలికల్స్ కణాల ద్వారా తగినంత మెలనిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు, జుట్టు రంగు మారిపోతుంది. ఇంకా ఒత్తిడి, హార్మోన్ల మార్పులు లేదా బొల్లి లాంటి చర్మ వ్యాధి లాంటి అనేక కారణాలు దీనికి కారణమవుతాయంటున్నారు. డెర్మటాలజిస్ట్‌లు జన్యుపరమైన కారణం: తల్లిదండ్రులులేదా తాతల్లో ఇలానే చిన్న వయసులోనే జుట్టు తెలబడిపోయిందా? ఒక్కసారి పరిశీలించు కోండి. మన శరీరంలోని కొన్ని జన్యువులు మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఇది గ్రే హెయిర్‌కు దారితీస్తుంది. ఒత్తిడి: శరీరంలో ఫ్రీ రాడికల్స్ ,యాంటీఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత ఉన్నప్పుడు ఆక్సిడేటివ్ ఒత్తిడి ఏర్పడుతుంది. కాలుష్యం,యూవీ రేడియేషన్ , అనారోగ్యకరమైన ఆహారం వంటి బాహ్య కారకాలుదీనికి కారణం. ఈ ఒత్తిడి జుట్టు రంగుకు కారణమైన మెలనోసైట్లను దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ లోపాలు: అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లోపం కూడా మరో ముఖ్య కారణం. ముఖ్యంగా విటమిన్ B12,ఐరన్,, రాగి, జింక్ తగినంతగా తీసుకోకపోవడం వల్ల జుట్టు తెల్లబడిపోతాయి. ఈ పోషకాలు మెలనిన్ ఉత్పత్తిలోనూ, హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. హార్మోన్లు: శరీరంలో హార్మోన్ల మార్పులు, ముఖ్యంగా యుక్తవయస్సు, గర్భధారణ లేదా బహిష్టు సమయంలో జుట్టును ప్రభావితం చేసే అవకాశం ఉంది. మెలనోసైట్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (MSH) , కార్టిసాల్ వంటి హార్మోన్లలో హెచ్చుతగ్గులు తెల్ల జుట్టుకు దోహదం చేస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి: ఒత్తిడికి ఎక్కువ కాలం గురికావడం ఒత్తిడి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది, జుట్టు రంగును మాత్రమే కాదు వివిధ శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక లేదా అధిక స్థాయి ఒత్తిడి మెలనోసైట్లను ప్రభావితం చేస్తుంది. ధూమపానం: వివిధ ఆరోగ్య సమస్యలకారణమై, ఆరోగ్యాన్ని పాడు చేసే ధూమపానంవల్ల శరీరంలోకి హానికరమైన టాక్సిన్స్ చేరతాయి. ఫలితంగా మెలనిన్ ఉత్పత్తితో సహా సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. బొల్లి: ఈ చర్మ వ్యాధి సోకిన వారిలో రోగనిరోధక వ్యవస్థ వర్ణద్రవ్యం కణాలపై దాడి చేస్తుంది. ప్రధానంగా చర్మం,జుట్టు రంగును కూడా ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ : థైరాయిడ్ (హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం) ఉన్నవారిలో కూడా చిన్న వయసులోనే గ్రే హెయిర్ వచ్చే అవకాశః ఉంది. రక్తహీనత ,కీమోథెరపీ, ఇతర కొన్ని మందుల వల్ల కూడా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టుకు దోహదం చేస్తుంది. కెమికల్ ప్రొడక్ట్స్: రసాయనాలతోకూడిన బ్లీచ్ లేదా కలరింగ్ ఏజెంట్లను ఉపయోగించడం ,హెయిర్ ట్రీట్మెంట్స్ ఎక్కువైతే హెయిర్ షాఫ్ట్ దెబ్బతింటుంది . మెలనోసైట్లను ప్రభావితం చేయవచ్చు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్: రోగనిరోధక వ్యవస్థను ప్రభావితంచేసే ఆటోఇమ్యూన్ వ్యాధులు, లోపాలవల్ల కూడా తెల్లజుట్టు తొందరగా వచ్చేస్తుంది. అలోపేసియా అరేటా లాంటి డిజార్డర్ కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోవడంతో పాటు తెల్ల జుట్టు, ఇంకా పిగ్మెంటేషన్‌లో మార్పులు వస్తాయి. కాలుష్యం: వాయు, ఇంధన కాలుష్యం లాంటి పర్యావరణ కాలుష్య కారకాలు జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఈ కాలుష్య కారకాలు ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఫలితంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది. నోట్: ఈ కారణాల్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో, లోపాలేంటో గమనించండి. వీలైతే పరిష్కరించుకోండి. దీంతో పాటు చక్కటి ఆహారం, నిద్ర, క్రమం తప్పని వ్యాయామం లాంటి నిబంధనలు పాటించండి. అదీ కానపుడు.. ఇపుడు గ్రే హెయిర్ కూడా ఒక ఫ్యాషనోయ్... అనుకుంటూ ముందుకుసాగిపోండి జాలీగా..! -
అలా చేస్తే తెల్లజుట్టు నల్లబడేనా?
వయసు ముదిరే కొద్దీ తలనెరవడం కామన్. కానీ యుక్త వయసులోనే నెరవడం ఆరంభమై, మధ్యవయసు వచ్చేసరికి తల ముగ్గుబుట్టలాగా మారడం చాలామందిలో కనిపిస్తోంది. తెల్లబడుతున్న జుట్టు యువతలో మానసికాందోళనకు కారణమవుతోంది. దీన్ని కవర్ చేయలేక, ఎలా ఆపాలో తెలియక పలువురు సతమతమవుతుంటారు. ఈ తరుణంలో ఎలాంటి చిట్కా చెప్పినా పాటించేందుకు రెడీ అవుతుంటారు. అంతర్జాతీయంగా కూడా ఈ అంశంపై పలు పరిశోధనలు జరిగాయి. ఒత్తిడి వల్ల జుట్టు త్వరగా తెల్లబడిపోతుందన్నది నిజమేనంటోంది సైన్స్. ఈ విషయం ఆధారంగా తాజాగా జరిగిన ఒక పరిశోధన ఆశలు రేకిత్తించే ఫలితాలనిచ్చింది. ఈ పరిశోధనలో నల్లజట్టు తొందరగా తెల్లబడేందుకు ఒత్తిడే కారణమని భావించి కొలంబియా యూనివర్సిటీలో ప్రయోగాలు చేశారు. ఒత్తిడిని అదుపులో పెట్టుకోగలిగితే జుట్టు మళ్లీ నల్లబడుతుందని ‘ఈలైఫ్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం చెబుతోంది. ‘ఒత్తిడికి, తెల్లజుట్టుకు ఉన్న సంబంధం గురించి చాలా ఏళ్లుగా పరిశోధన చేస్తూ ఉన్నాం. మానసిక ఒత్తిడికి, జుట్టు పండిపోవడానికి కచ్చితమైన సంబంధం ఉంది అని తెలిపే అధ్యయనం ఇది. ఒత్తిడి తగ్గించుకుంటే అనూహ్యంగా కొంతమేర జుట్టు తిరిగి సహజ రంగులోకి మారుతుందనేందుకు ఆధారాలు లభించాయి’ అని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్టిన్ పికార్డ్ తెలిపారు. ప్రయోగంలో భాగంగా ప్రతి వెంట్రుకను అధ్యయనం చేస్తూ, దాన్లో ఉన్న పిగ్మెంటేషన్ నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ పరిశోధక బృందం ఒక కొత్త పద్ధతిని అభివృద్ధి చేసింది. అనంతరం వివిధ వయసులకు చెందిన 14 మంది వలంటీర్లను ఎంపిక చేసుకుని, ప్రతి వారం వాళ్ల ఒత్తిడి స్థాయిలు ఎలా ఉన్నాయో నమోదు చేయమన్నారు. ఈ 14 మంది శరీరంలోని వివిధ భాగాల నుంచి వెంట్రుకలు పరిశీలించారు. ఆశ్చర్యకరంగా ఈ ప్రయోగంలో పాల్గొన్నవారిలో అతి పిన్నవయస్కుల జీవితాల్లో ఒత్తిడి మాయమైపోయినప్పుడు జుట్టు వారి సహజ రంగుకు తిరిగి వచ్చేసిందని గమనించారు. వీరిలో ఒక వ్యక్తి రెండు వారాలు సెలవులు తీసుకుని, ఏ ఒత్తిడి లేకుండా హాయిగా గడిపిన తరువాత ఆయన వెంట్రుకల్లో కొన్ని వాటి సహజ రంగును తిరిగి పొందాయి. ఒత్తిడి లేకుంటే చాలా? జీవితంలో అనుభవించే టెన్షన్లు, ఒత్తిళ్లు మాయం కాగానే తెల్లబడిపోయిన జుట్టంతా వెంటనే నల్లగా మారిపోతుందని భావించకూడదని సైంటిస్టులు చెప్పారు. కేవలం కుదుళ్ల నుంచి పెరుగుతున్న వెంట్రుకలు తమ సహజ రంగుకు వచ్చేస్తాయని పికార్డ్ స్పష్టం చేశారు. అంటే అప్పటికే కుదురు నుంచి పైకి వచ్చిన వెంట్రుక రంగు మారదు. ఎందుకని ఇలా జరుగుతోందనేందుకు ఒత్తిడి కారణంగా మైటోకాండ్రియాలో జరిగే మార్పుల వల్లనే జుట్టు రంగు మారుతోందని సైంటిస్టులు వివరించారు. మైటోకాండ్రియాలు కణలకు శక్తి సరఫరా కేంద్రాలు. ‘మానసిక ఒత్తిడి వలన మైటోకాండ్రియా విడుదల చేసే శక్తిలో మార్పులు వస్తాయి. మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోతే కుదుళ్ల కింద ఉండే కణాలు సరిగా పనిచేయక జుట్టు పింగ్మెంట్‌ను కోల్పోతుంది’ అని పరిశోధకులు చెప్పారు. అయితే ఒత్తిడి తగ్గగానే మైటోకాండ్రియా శక్తి విడుదలలో మార్పులు సర్దుకుంటాయని, అందువల్ల కుదుళ్ల నుంచి మొలిచే కొత్త జుట్టు తన సహజ రంగును తిరిగి పొందుతుందని తెలిపారు. అయితే అందరిలో ఇది సాధ్యమేనా? అంటే కాదనే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలంపాటు తెల్లజుట్టు ఉన్నవారికి నల్లరంగు మళ్లీ రాదు. ‘ప్రతి ఒక్కరికి ఒక బయోలాజికల్ లిమిట్ (జీవసంబంధమైన పరిమితి) ఉంటుంది. అంటే ఒక వయసొచ్చాక జుట్టు పండిపోతుంది. ఆ పరిమితికి దగ్గర్లో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి పెరిగితే రావలసిన సమయం కన్నా ముందే తెల్లజుట్టు వచ్చేస్తుంది. అంటే నిర్ణీత వయసు దాటిపోయి చాలాకాలం అయిపోతే తెల్ల జుట్టు నల్లగా మారడం దాదాపు అసాధ్యం’ అని పరిశోధకులు వివరించారు. అంటే ఒత్తిడి తగ్గిపోయిన ప్రతివారికీ నల్లజుట్టు పెరగడం ప్రారంభమవుతుందని కాదు. కానీ చిన్న వయసులోనే మానసిక ఒత్తిడి కారణంగా జుట్టు తెల్లబడినవారికి మాత్రం ఒత్తిడి తగ్గితే మళ్లీ నల్లజుట్టు పెరిగే అవకాశం ఉంటుంది. కేవలం జుట్టు రంగు మార్పు గురించే కాకుండా వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న ఇతర అంశాలను మానసిక ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుంది, అలాంటి మార్పులను రివర్స్ చేయగలమా లేదా అనే అంశాలపై తమ బృందం పరిశోధన కొనసాగిస్తోందని పికార్డ్ తెలిపారు. ఈ ప్రయోగాలు సత్ఫలితాలనిస్తే మానవ జీవన గమనంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. -
తెల్ల వెంట్రుకల గుట్టు తెల్సింది!
న్యూఢిల్లీ : నెత్తిన నల్లగా నిగనిగలాడాల్సిన వెంట్రుకలు ఎందుకు తెల్లబడతాయి? ఇంతవరకు ఏ శాస్త్రవేత్త ఇదీ కారణమంటూ నిగ్గు తేల్చలేకపోయారు. వయస్సు మీరితే వెంట్రుకలు తెల్లపడతాయని కొందరు, బలహీనత వల్ల తెల్లబడతాయని కొందరు, విటమిన్ల లోపం వల్ల వస్తాయని మరికొందరు చెబుతూ వచ్చారు. వయస్సులో ఉన్న వారికి వెంట్రుకలు ఎందుకు తెల్లబడుతున్నాయి, విటమిన్లు పుష్టిగా ఉన్నా ఎందుకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయంటూ అడుగుతున్న ప్రశ్నలకు ఇంతకాలం సరైన జవాబు దొరకలేదు. హార్వర్డ్ యూనివర్శిటీ నిపుణులు ఎలుకలపై జరిపిన తాజా అధ్యయనంలో అసలు కారణం తెల్సింది. మానసిక ఒత్తిడి కారణంగానే వెంట్రుకలు తెల్లబడతాయని తేలింది. మానసిక ఒత్తిడి వల్ల ‘నోర్పైన్ప్రైన్ లేదా నోరాడ్రెనాలైన్ లేదా నోరాడ్రెనాలిన్గా పిలిచే హార్మోన్ శరీరం నుంచి విడుదలై అది రక్తంలో కలుస్తుంది. దాని వల్ల గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. రక్తంలో కలిసిన ఈ హార్మోన్ వెంట్రుకలను ఎప్పుడు నల్లగా ఉంచే ‘మెలానోకైట్’ మూల కణాలను తెబ్బతీస్తుంది. అందుకని వెంట్రుకలు తెల్లబడుతాయి. సాధారణంగా తెల్ల వెంట్రుకలు 30వ ఏట మొదలై, 50వ ఏడు వచ్చే సరికి సగం జుట్టు తెల్లబడుతుంది. ఇంకా అంతకంటే ముందు టీనేజ్లోనే వెంట్రుకలు తెల్లబడినట్లయితే అది వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు కారణం. ఒత్తిడి నుంచి శరీర భాగాలను రక్షించేందుకే నోరాడ్రెనాలిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఎలుకల్లో నోరాడ్రెనాలిన్ హార్మోన్‌ను పంపించిన 24 గంటల్లోనే వాటి వెంట్రుకలు 50 శాతం తెల్లబడ్డాయని అధ్యయన బృందం పేర్కొంది. మానసిక ఒత్తిడి వల్ల ఒక్క వెంట్రుకలే కాకుండా శరీరంలోని పలు భాగాలపై ప్రభావం చూపుతుందని, వేటి వేటిపై ప్రభావం చూపుతుందో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపింది. ఒక్కసారి తెల్లబడిన వెంట్రుకలు ఎప్పటికీ నల్లగా మారే ప్రసక్తే లేదని, మానసిక ఒత్తిడి తట్టుకునేందుకు ఎప్పుడు మానసికంగా అప్రమత్తంగా ఉండాలని వైద్య బృందం సూచించింది. వారి అధ్యయన వివరాలను ‘నేచర్’ తాజా సంచికలో ప్రచురించారు. -
తెల్ల జుట్టు రహస్యం తెలిసిపోయిందోచ్!
జుట్టుకు రంగు వేసుకొని.. వేసుకొని విసిగిపోయారా? ఇక ఆ రంగులకు, బ్రష్‌లకు ప్యాకప్ చెప్పేయొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. అందరినీ వేధిస్తున్న తెల్లజుట్టు బెంగ ఇక అక్కర్లేదట. జుట్టు తెల్లబడటానికి కారణమైన జన్యువును కనుగొన్నామని.. ఇది మరింత విప్లవాత్మక మార్పులకు దారితీయనుందని లండన్ పరిశోధకులు చెబుతున్నారు. ఐఆర్ఎఫ్ 4 అనే జన్యువు వల్లే జుట్టు రంగు మారుతోందని గుర్తించారు. మెలనిన్‌ను నియంత్రిస్తున్న ఈ జన్యువే జుట్టును కూడా తెల్లబరుస్తోందని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ ఆవిష్కరణతో జట్టు తెల్లబడటాన్ని నిరోధించడం భవిష్యత్తులో సాధ్యమే అంటున్నారు. జుట్టు రంగు, సాంద్రత, ఆకారాన్ని ప్రభావితం చేసే జన్యువులను గుర్తించేందుకు లాటిన్ అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఆరువేల మందిపై ఈ పరిశోధన సాగింది. జుట్టు తొందరగా తెల్లబడటానికి కేవలం జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు కాకుండా.. మనిషిలోని జన్యువే ప్రధాన పాత్ర పోషిస్తోందని లండన్ శాస్త్రవేత్తలు తేల్చారు. బట్టతల రావడానికి, జుట్టు రంగును మార్చే జన్యువులను ఇప్పటికే గుర్తించినా, మానవుల్లో జుట్టు తెల్లగా మారడానికి కారణమైన జన్యువును గుర్తించడం ఇదే ప్రథమమని, చాలా కీలకమైందంని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (యూసీఎల్) కు చెందిన డాక్టర్ కౌస్తుభ్ అధికారి చెప్పారు. ఇది ఇంతకు ముందెన్నడూ జరగని పరిశోధన అని పేర్కొన్నారు. ఇది కాస్మోటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందంటున్నారు. మానవ వృద్ధాప్య జీవశాస్త్రం అంశాల పరిశోధనలో తమ అధ్యయనం మంచి పరిణామమని ప్రొఫెసర్ ఆండ్రెస్ రూయిజ్- లినారెస్ చెప్పారు. గడ్డం దగ్గర జుట్టు మందం, కనుబొమ్మల మందాన్ని, వైవిధ్యాన్ని నియంత్రించే జన్యువులను కూడా తమ పరిశోధనలో గుర్తించినట్టు తెలిపారు. వేసవిలో మెదడును చల్లగా ఉంచేందుకు ఉంగరాల జుట్టు సహాయపడుతుందని తమ అధ్యయనంలో తేలిందంటున్నారు. ఉత్తర, దక్షిణ ప్రాంత వాసుల జుట్టు స్ట్రయిట్‌గా ఉండటానికి కూడా ఇదే కారణమన్నారు. తీవ్రమైన చలి నుంచి తట్టుకునేందుకు వీలుగా వారి జుట్టు సాదాగా ఎదుగుతుందంట. యూరోపియన్లలో 20 ఏళ్లకు ముందు, తూర్పు ఆసియన్లలో 30లలో, సహారా ఆఫ్రికన్లలో 40లలో జుట్టు తెల్లబడటం మొదలవుతుందని తెలిపారు. భారత సంతతికి చెందిన డాక్టర్ కూడా భాగస్వామిగా ఉన్న ఈ పరిశోధన.. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.