ప్రస్తుతం కాలంలో తెల్లవెంట్రుకలు ఎక్కువగా బాధించే సమస్య. 50ఏళ్ల దాటిన తరువాత నల్లుజుట్టు తెల్లగా మారితే పెద్దగా సమస్య ఉండదు. కానీ టీనేజ్‌లోనే తెల్ల జుట్టు రావడంతో చాలి నిరాశకు లోనవు తున్నారు. తెల్లజుట్టు పోగొట్టుకోవడానికి యువత పడని పాట్లు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. మార్కెట్లో రకరకాల కాస్ట్లీ ఉత్పత్తులతోపాటు, సహజంగా దొరికే, ఆర్గానిక్ పదార్థాలతో తయారైన చిట్కాలకోసం ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో ఒక వీడియో హాట్ టాపిక్‌గా నిలిచింది.
ఈ వీడియోలో లవంగాలు, ఉల్లిపాయల పొట్టు, టీ బ్యాగులతో కషాయం తయారుచేశారు. దీన్ని చక్కగా వడబోసుకుని ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. కావాలంటే ఫ్రిజ్‌లో కూడా పెట్టుకోని వాడుకోవచ్చు. ఈ కషాయాన్ని కుదుళ్లతో సహా తలకు బాగా పట్టించి, బాత్ క్యాప్ లేదా, ప్లాస్టిక్ కవర్‌తో తలను కవర్ చేసి కొద్దిసేపు వదిలివేయాలి. ఆ తరువాత వాటర్‌తో కడిగేయాలి. షాంపులాంటివి వాడకూడదు. ఇలా చేయడం ద్వారా తెల్ల వెంట్రుకలకు చక్కటి పరిష్కారం లభిస్తుందని ఈ వీడియోలో పేర్కొనడం విశేషం. దీని వల్ల జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుందట. అయితే దీనిపై నెటిజన్లు కమెంట్లు విభిన్నంగా ఉన్నాయి.
నోట్: ఇది అవగాహన కోసం అందించిన వీడియో మాత్రమే.
Say Goodbye to gray hair permanently pic.twitter.com/EVYDMLJkTJ
— Learn Something (@cooltechtipz) April 4, 2024
Comments
Please login to add a commentAdd a comment