
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, (ఇన్‌సెట్) చిన్నారి మృతదేహం
పాల్వంచరూరల్ : సేవాలాల్ జాతరలో అపశృతి దొర్లింది. డీజే బాక్స్ పడడంతో బాలుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పాండురంగాపురం గ్రామంలో సేవాలాల్ ఆలయ శంకుస్థాపన తర్వాత ఆంజనేయస్వామి గుడికి భక్తులు వెళ్తున్నారు. టాటా ఏస్ వాహనంపై డీజేబాక్స్‌లు ఏర్పాటు చేశారు. వాహనం ముందు, పక్కన కొంద రు నృత్యాలు చేస్తున్నారు.
మార్గమధ్యలో ఒకచోట, పైన విద్యుత్ సర్వీ స్ వైరు ఒకటి డీజే బాక్స్‌లకు తగిలింది. దీనిని ఎవరూ గమనించలేదు. వాహనం ముందుకెళ్లడంతో పైన బాక్స్‌లు కిందపడ్డాయి. పక్కనే నడుస్తున్న భూక్యా పృధ్వీరాజ్(7)పై ఒక బాక్స్ పడింది. తలకు బలమైన గాయమవడంతో ఆ చిన్నారి మృతి చెందాడు. ఇతని తల్లిదండ్రులైన భూక్యా బాలకృష్ణ–అనిత దంపతులది నిరుపేద కుటుంబం. వీరిది ఇల్లెందుపాడు గ్రామం. ఈ చిన్నారి రెండోతరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు, అక్క కన్నీరు మున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదుతో సేవాలాల్ ఆలయ పూజారి భూక్యా ఠాగూర్ సాధు. టాటా ఏస్ డ్రైవర్ గబ్బర్, నిర్వాహకులు జి.శ్రీనుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment