పాల్వంచ(ఖమ్మం జిల్లా): పాల్వంచ ఆర్టీ చెక్‌పోస్టు సమీపంలో లారీ, టాటా మ్యాజిక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.