
ఆటో లారీ ఢీ.. ఒకరి మృతి
ఖమ్మం: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. కంకర లోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ వెంపటి శ్రీనివాస చంద్రశేఖర్(35) అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు కొత్తగూడం హనుమాన్ బస్తీకి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.