ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో మంగళవారం విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో మంగళవారం విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కర్మాగారంలోని 1 నుంచి 10 యూనిట్లు ట్రిప్ అవడంతో దీని వల్ల 1220 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గ్రిడ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే ఒకే సారి యూనిట్లన్నీ ట్రిప్ అయినట్లు సీఈ లక్ష్మయ్య తెలిపారు. సాంకేతిక లోపం ఏర్పడటంతో అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.