అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య | man commits suicide in bhadradri district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

Published Wed, Nov 30 2016 4:48 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

man commits suicide in bhadradri district

పాల్వంచ రూరల్: అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం కోడిపుంజులవాగు గ్రామానికి చెందిన రైతు కొర్ర మత్రు(28) తనకున్న ఎకరం చెలకలో మొక్కజొన్న సాగుచేశాడు. అయితే పంట నష్టం వచ్చింది. పంట సాగుకు రూ.లక్ష పైన అప్పులు చేశాడు. అప్పులు తీర్చే దారిలేక మనోవేదనతో ఇంట్లోని బాత్రూంలో మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement