గుండెపోటుతో వీఆర్వో మృతి | VRO dies after cardiac arrest | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో వీఆర్వో మృతి

Published Sat, Dec 10 2016 6:06 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

VRO dies after cardiac arrest

భద్రాద్రి కొత్తగూడెం: విధి నిర్వహణలో ఉన్న ఓ రెవెన్యూ అధికారిని గుండెపోటుకు గురై మృతి చెందింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శనివారం చోటు చేసుకుంది. పినపాక మండలం గడ్డంపల్లికి చెందిన కోలం అంజమ్మ(40) అశ్వాపురంలో వీఆర్వోగా పనిచేస్తోంది. గత రెండు రోజులుగా భూ దస్తావేజుల విషయంలో పాల్వంచలోని డిప్యూటీ కల్టెర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది.
 
ఈ క్రమంలో శనివారం కార్యాలయంలో పని చేస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement