ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లె గ్రామంలో భారీ చోరీ జరిగింది.
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లె గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన భూక్యాలచ్చ గిరిజన సహాకార సొసైటీలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అయితే, గత ఆదివారం సాయంత్రం తిరుపతి వెళ్లి గురువారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. కాగా, ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే బీరువా తాళాలు తెరిచి ఉండటంతో దొంగతనం జరిగిందని గుర్తించారు. దుండగులు బీరువా ఉన్న 35 తులాల బంగారం, 1 కేజీ వెండి, రూ. 3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.