కల్తీ జరిగిందని పేర్కొంటున్న మాంసాహారమిదే..
పాల్వంచరూరల్: పాల్వంచ పట్టణంలోని బీసీఎం రోడ్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో కల్తీ మాంసాహారం సరఫరా చేశారని బూర్గంపాడు మండలం రెడ్డిపాలేనికి చెందిన పి.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. బుధవారం రాత్రి తాను స్నేహితుడితో కలిసి బీసీఎం రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లామని తెలిపారు.
మటన్ ఆర్డర్ ఇవ్వగా, మటన్‌లో ఇతర జంతువుల మాంసం కలిపి వడ్డించారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు వచ్చి ఆహార పదార్థాలను సీజ్ చేసి, పరీక్షకు పంపారని తెలిపారు. ఫలితాలను బట్టి తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నట్లు బాధితులు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment