adulteration of food
-
రూ.200 బిర్యానీ తిన్న పాపానికి ఆసుపత్రి బిల్లు ఎంతయిందో తెలుసా..?
Food Adulteration Impact On Health: అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉంటున్న రాము మూడు రోజుల కిందట ఓ హోటల్లో బిర్యానీ కొన్నాడు. మధ్యాహ్నం వేళ ఇంటికెళ్లి ఆవురావురుమంటూ తినేశాడు. సాయంత్రానికి వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఆస్పత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు ఫుడ్ పాయిజన్‌గా తేల్చారు. రోజుల తరబడి నిల్వ ఉన్న మాంసం... కలర్ కోసం వాడిన రంగుల వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు చెప్పారు. రూ.200 బిర్యానీ తిన్న పాపానికి రూ.2 వేలు ఆస్పత్రి బిల్లు కట్టి బయటపడ్డాడు. ఇలాంటి కేసులు జిల్లాలో ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు తమ ఉద్యోగాన్నే మరిచిపోవడంతో... వ్యాపారులు డబ్బు కోసం జనం ప్రాణాలతో ఆటలాడుతున్నారు. సాక్షి, అనంతపురం: జిల్లాలో ఆహార భద్రత నియంత్రణ శాఖ నిద్ర మత్తులో జోగుతోంది. ఇబ్బడి ముబ్బడిగా కల్తీ ఆహారం సరఫరా అవుతున్నా తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. ముగ్గురు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నా...వారు ఎక్కడున్నారో...ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. జిల్లా ఫుడ్‌కంట్రోల్ అధికారిగా మరో జిల్లాకు చెందిన అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎప్పుడొస్తారో.... ఎప్పుడు వెళతారో కూడా అంతుబట్టడం లేదు. దీంతో ఏ హోటళ్లలో ఎలాంటి ఆహారం వండి వడ్డిస్తున్నారన్న దాని గురించి ఆరా తీసే నాథుడే లేకుండా పోయారు. దీంతో వ్యాపారులు ఆహార ప్రియులను ఆకర్షించడానికి ప్రమాదకర రంగులు వాడుతూ జనం ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. కల్తీ జోరు...చర్యలు తీసుకునే వారే లేరు ఇటీవల పప్పులు మొదలుకొని నూనెల వరకూ అన్నీ కల్తీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కల్తీపై నిఘా వేసి జనాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. వాస్తవంగా వండిన ఏ ఆహారమైనా ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు ర్యాండమ్‌గా నమూనాలు తీయాలి. ఆహార పదార్థాలపై ఆర్సెనిక్ (క్యాన్సర్ కారక) ప్రభావం ఉన్న రంగులు వేస్తే వాటిపై చర్యలు తీసుకోవాలి. టీపొడి నుంచి పాల వరకూ ఇలా ప్రతి ఒక్కదానిపైనా నాణ్యతను పరిశీలించడం, ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలి. చదవండి: (Neem Tree: వెయ్యి జబ్బులను నయం చేసే.. వేప చెట్టుకు ఆపదొచ్చింది) ఈ క్రమంలో ఒక్కో ఫుడ్ ఇన్స్పెక్టర్ నెలకు కనీసం 12 నమూనాలు తీసి ఎఫ్ఎస్ఎల్ (ఫుడ్‌సేఫ్టీ ల్యాబొరేటరీ)కి పంపించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం కల్తీ అయినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేయడంతో పాటు తీవ్రతను బట్టి సదరు హోటల్‌ను సీజ్ చేసే అధికారం కూడా వారికి ఉంటుంది. కానీ జిల్లాలో ఒక్క కేసూ నమోదు కావడం లేదు. అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారన్న విషయం కూడా ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. మూడు వేల షాపుల పైనే జిల్లాలో చిన్న చిన్న బడ్డీ కొట్ల నుంచి మోస్తరు హోటళ్ల వరకు దాదాపు 3 వేలు ఉన్నాయి. ఇందులో చాలా వాటిని మున్సిపాలిటీ లైసెన్సు గానీ, ట్రేడ్ లైసెన్సు గానీ లేకుండానే నడిపిస్తున్నారు.. గంటల తరబడి మరిగించిన నాసిరకం నూనెల్లో వేయించిన చిప్స్ అమ్ముతున్నారు. వీటిపై మాన్యుఫాక్చరింగ్ తేదీలుగానీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా) లోగోలు గానీ ఉండవు. అయినప్పటికీ వీటిపై చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎక్కడా కనిపించడం లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఐపీఎం (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్) పరిధిలో ఉంటారు. వీరిపై ఐపీఎం డైరెక్టర్ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. చదవండి: (విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!) ధర తక్కువ...కల్తీ ఎక్కువ ►కిలో వంటనూనె, కిలో క్రీమ్‌పౌడర్‌ను బాగా కలిపి మిక్సీలో వేసి తిప్పితే 10 లీటర్ల నకిలీ పాలు తయారవుతాయి. లీటర్ రూ.40 అమ్మినా రూ.400 సొమ్ము చేసుకోవచ్చు. ►స్వచ్ఛమైన నెయ్యి కిలో రూ.600 నుంచి రూ.800 వరకూ అమ్ముతున్నారు. కానీ కొందరు కిలో రూ.120 అమ్ముతున్నారు. ఇదెలా సాధ్యమంటే పామాయిల్లో నెయ్యి వాసన వచ్చే పదార్థాలను కలిపి తయారు చేస్తున్నారు. ఇదేమీ తెలియని జనం ఎగబడి కొంటున్నారు. ►గ్లూకోన్‌డీ పౌడర్ పేరుతోనూ చిన్నారుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. రసాయనాల మిశ్రమం, తియ్యగా ఉండేందుకు శాక్రిన్ కలిపి మల్టీ నేషనల్ కంపెనీ కంటే అద్భుత ప్యాకింగ్‌లో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇది తాగితే చాలా ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. ►చికెన్ 65, చిల్లీ చికెన్ పేరు చెప్పగానే మాంసాహార ప్రియులకు నోరూరుతుంది. కానీ తింటే ఆస్పత్రి పాలు కావాల్సి వస్తోంది. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్లపై బండ్లలో విక్రయించే వారు మిగిలి పోయిన మాంసాన్ని రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. దానికి ఆర్సెనిక్ కారక రసాయనాలు చల్లి ఆర్డర్ రాగానే వండి వారుస్తున్నారు. ఫలితంగా దీన్ని తిన్న వారు ఆనారోగ్యం బారిన పడుతున్నారు. ►పప్పు దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. కిలో శనగపప్పులో 250 గ్రాముల బియ్యాన్ని కలిపి నేరుగా మెషిన్ ఆడిస్తారు. ఈ విషయం ఇటీవలే అధికారుల దృష్టికి వచ్చింది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇద్దరే ఉన్నారు మా వద్ద ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇద్దరే ఉన్నారు. అందుకే అనంతపురంలో ఆహార నమూనాలు సేకరించడం లేదు. జనవరిలో పోస్టులు భర్తీ అవుతాయని చెప్పారు. కొత్తగా సిబ్బంది వస్తే నమూ నాలు తీస్తాం. నేను కూడా ఇన్చార్జిగా ఉన్నాను. –శ్రీనివాసులు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ (ఇన్చార్జ్) నా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటా ఏదైనా ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం. అనంతపురం జిల్లాలో నమూనాలు తీసే విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటాం. –డా.మంజరి, డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ -
శీతలపానీయంలో విషం కలిపి తాగించి..
సాక్షి, వినుకొండ : వినుకొండ మండలం నీలగంగవరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన రసూల్, సలోమి(35) దంపతులు బతుకు దెరువు కోసం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, మేళ్లచెరువు మండలం వెల్లటూరు పాలేనికి కొన్నేళ్ల కిందట వలస వెళ్లారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో బుధవారం సలోమి తన ఇద్దరు కుమారులైన విలియమ్ కేర్(12), బిలీగ్రామ్(8)లకు శీతలపానీయంలో విషం కలిపి తాగించి, తాను తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, శుక్రవారం మృతదేహాలను స్వగ్రామమైన నీలగంగవరం గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సలోమి కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. -
74 మంది విద్యార్థులకు అస్వస్థత
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలంలోని పెర్కిట్‌లో గల సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళా శాలలో ఆహారం వికటించి 74 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాలలో శుక్రవారం రాత్రి విద్యార్థులు భోజనం చేసి పడుకున్నాక వేకువజామున నుంచి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో కళాశా ల ప్రిన్సిపల్, కేర్ టేకర్‌కు సమాచారం ఇవ్వగా వారు ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్మూర్ డిప్యూటీ డీఎం హెచ్‌వో రమేశ్, వైద్యులు అశోక్, స్వాతి వినూత్న, వైద్య సిబ్బంది హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. ఆర్మూర్ డివిజన్లోని ఐదు రాష్ట్రీయ బాల ల స్వస్థ్య కార్యక్రమ్ బృందాలు కళాశాలకు చేరుకునారు. తీవ్ర అస్వస్థతకు గురైన 40 మంది విద్యార్థులకు వైద్యాధికారులు కళాశాలలోనే సెలైన్ బా టిళ్లు ఏర్పాటు చేసి చికిత్సలు అందజేశారు. మరో 34 మంది విద్యార్థులకు మాత్రలతో నయం చేశా రు. మధ్యాహ్నం విద్యార్థుల పరిస్థితి నిలకడకు వ చ్చింది. కారణాలు అవేనా.. కళాశాలలో 380 మంది విద్యార్థులున్నారు. శుక్రవారం 361 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా రాత్రి ఆహారంలో విద్యార్థులకు పప్పు, ఆలుగడ్డ కూరలను వడ్డించారు. ఆలుగడ్డ కూర మాడి పోవడంతో విద్యార్థులు దాన్ని వదిలి పప్పుతో భోజనం చేశారు. మాడిపోయిన కూరను తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాగా దీనికి ముందు విద్యార్థులు ఐరన్ మాత్రలను తీసుకున్నారు. ఖాళీ కడుపుతో ఐరన్ మాత్రలను తీసుకోవడంతో వచ్చే గ్యాస్ట్రిక్తో విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చని కొందరి అభిప్రాయం. ఆర్నెళ్ల కిందే కళాశాల ఏర్పాటు.. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో ఆరు నెలల క్రితం కళాశాలను ఏర్పాటు చేశారు. వర్ని మండలం చందూర్‌లో ఉన్న కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఆశించినంత లేక పోవడంతో ఆర్మూర్‌కు తరలించారు. పెర్కిట్‌లోని ఒక ప్రైవేటు కళాశాలను అద్దెకు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు కళాశాలలోని అవసానదశకు చేరుకున్న వంట పాత్రలల్లో ఆహార పదార్థాలు వండడం ద్వారా అడుగంటి మాడిపోతున్నాయని వంట చేసేవారు పేర్కొంటున్నారు. తిన్న తర్వాతనే ఇలా జరిగింది.. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర పోయాం. అయితే కాసేపటికి కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. కేర్ టేకర్ దగ్గరకు వెళ్లగా ఉపశమనానికి మందు గోలీలను ఇచ్చారు. –దివ్య, సెకండియర్, చల్లగరిగ కూరలు మాడిపోయాయి.. రాత్రి అందజేసిన ఆహార పదార్థాలలో ఆలుగడ్డ కూర మాడిపోయింది. దీంతో పప్పుతో భోజనం చేశాం. ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా కళాశాలలోని 70 మంది విద్యార్థులకు అవస్థలు పడ్డాం. –హారిక, సెకండియర్, చౌట్పల్లి -
కల్తీపై కట్టడేది
దుకాణాల్లో లభించే సరుకులు, హోటళ్లలో విక్రయించే ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ సరుకులు.. అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాల తయారీ, విక్రయం.. వెరసి రోగాలను కొనితెచ్చుకోవాల్సి వస్తోంది. సాక్షి, భూపాలపల్లి: జిల్లాలో తినుబండారాలు తయారుచేసే షాపులు, హోటళ్లు, బిర్యానీ పాయిం ట్లు, ఆయిల్ షాపులు, మెస్‌లు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ పుడ్ ఇన్స్పెక్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ అయిన షాపులు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నా యి. దీనినిబట్టి అధికారుల పర్యవేక్షణ ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, కాటారం, ఏటూరునాగారం వంటి ప్రాంతాలతోపాటు ప్రతీ మండల కేంద్రంలో హోటళ్లు, బేకరీలు, మెస్‌లు మొదలైనవి వందల సంఖ్యలో నడుస్తున్నాయి. కొత్తగా జిల్లా ఏర్పడిన నాటి నుంచి జిల్లా కేంద్రంలో మినహా ఇతర ప్రాంతాల్లో నడిచే షాపులకు ఎటువంటి అనుమతులు లేవని తెలుస్తోంది. ప్రజల ఆరోగ్యంతో ఆటలు తినుబండారాల తయారీ విక్రయదారులు, హోటళ్ల యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మార్కెట్లో ప్రతీది కల్తీ అవుతోంది. లాభాపేక్షతో వ్యాపారులు తక్కువ ధరకు లభించే కల్తీ సరుకులతో తినుబండారాలను తయారు చేస్తున్నారు. చాలా వరకు అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేయడం వల్ల ప్రజలు డయేరియా, కామెర్లు తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాలో ఉపాధి కోసం చాలా మంది ఫుడ్ బిజినెస్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ వ్యాపారం చేసేవారిలో లైసెన్స్‌లు పొందినవారు వెతికినా దొరకరు. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. చాలా చోట్ల తయారీకి ఉపయోగించిన ఆయిల్‌ను మళ్లీ మళ్లీ వాడుతున్నారు. మరికొన్ని చోట్ల అపరిశుభ్ర వాతావరణంలో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను నడుపుతున్నారు. వర్షాకాలం కావడంతో ప్రతీ దుకాణం ఎదుట ఈగలు ముసురుకుంటున్నాయి. మరో వైపు రోడ్డు పక్కనే ఫాస్ట్‌ఫుడ్, అల్పాహార విక్రయశాలలను నిర్వహిస్తుండటంతో వీటిపైన దుమ్ము ధూళి పడుతోంది. సిబ్బంది లేమితో సతమతం.. జిల్లాలో హోటళ్లు, ఇతర దుకాణాలపై పర్యవేక్షణ కరువైంది. జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ ఫుడ్‌సెఫ్టీ డిజ్గినేటెడ్ కార్యాలయం సిబ్బంది లేమి తో కొట్టుమిట్టాడుతోంది. ఈ కార్యాలయంలో గెజిటెడ్ ఆఫీసర్, ఇద్దరు ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఇద్దరు అటెండర్లు ఉండాలి. కానీ జిల్లా వ్యాప్తంగా ఒక్క జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. ఈ ఒక్కరితో కార్యాలయంలో నడుస్తోంది. వరంగల్ రీజనల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు న్న గెజిటెడ్ ఆఫీసర్, మహబూబాబాద్ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు భూపాలపల్లికి అదనçపు బాధ్యతలు తీసుకున్నారు. సిబ్బంది లేమితో కార్యాలయం ఉండగా జిల్లాలోని హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లతో పాటు ఇతర అనుబంధ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వారి వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఒకే ఒక్క కేసు నమోదు.. జిల్లా ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు ఒకే ఒక్క కేసు మాత్రమే నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. యథేచ్ఛగా కల్తీ చేసిన వస్తువుల విక్రయాలు చేపడుతూ, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తినుబండరాలను తయా రు చేసి అమ్ముతున్నా పట్టించుకొనే నాథుడే లేడు. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది ఈ ఫొటోలోని వ్యక్తి పేరు నర్రెంగుల రాజు. ములుగు మండల కేంద్రానికి చెందిన ఇతను ఇటీవల రెండు రోజుల పాటు తీవ్ర విరేచనాలు, జ్వరంతో బాధపడ్డాడు. డాక్టర్లను సంప్రదిస్తే పుడ్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. అంతకు ముందు రాజు బయట ఆహారం తినట్లు తెలిపాడు. దాదాపుగా బయటి ఆహారాన్ని తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారని అతను పేర్కొన్నాడు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం.. సిబ్బంది కొరత ఉండడం వలన షాపులపై తనిఖీలు నిర్వహించడం లేదు. సంబంధిత వ్యాపారులందరూ లైసెన్స్‌లు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. నాలుగు వారాలకు ఒకసారి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మూడు జిల్లాలకు నేనే ఇన్చార్జి కావడంతో ఇబ్బందికరంగా మారింది. – కిరణ్, జిల్లా ఇన్చార్జి ఫుడ్ ఇన్స్పెక్టర్ -
మాంసాహారంలో కల్తీ
పాల్వంచరూరల్: పాల్వంచ పట్టణంలోని బీసీఎం రోడ్లో ఉన్న ఓ రెస్టారెంట్లో కల్తీ మాంసాహారం సరఫరా చేశారని బూర్గంపాడు మండలం రెడ్డిపాలేనికి చెందిన పి.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. బుధవారం రాత్రి తాను స్నేహితుడితో కలిసి బీసీఎం రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లామని తెలిపారు. మటన్ ఆర్డర్ ఇవ్వగా, మటన్‌లో ఇతర జంతువుల మాంసం కలిపి వడ్డించారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు వచ్చి ఆహార పదార్థాలను సీజ్ చేసి, పరీక్షకు పంపారని తెలిపారు. ఫలితాలను బట్టి తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నట్లు బాధితులు తెలిపారు -
నిత్యం విషం తింటున్నాం..
సాక్షి, హైదరాబాద్: ‘నిత్యం విషమే తింటున్నాం. మన పిల్లలూ ఈ విషాన్నే తినాల్సి వస్తోంది. రసాయనాలతో పండించిన, మగ్గబెట్టిన ఫలాలే కాదు.. పాలు, పెరుగు, పంచదార, ఉప్పు, బియ్యం.. ఇలా అన్నీ కల్తీనే. కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏం యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయి? తనిఖీలు ఏమైనా చేస్తున్నారా? కోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు మాత్రం అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం.. అని చెబుతారు. లేదంటే దాని గురించే పట్టించుకోరు. అయినా మీ బాధ్యతల గురించి మేం ఎందుకు చెప్పాలి? మీ అంతట మీరు మీ బాధ్యతలను నిర్వర్తించలేరా? మేం చెబితే పాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటారు. చెప్పకపోతే మీరంతట మీరు చేయరు. కాల్షియం కార్బైడ్ ఉపయోగించి పళ్లను మగ్గబెడుతున్న వారికి సంబంధించి ఇటీవలి కాలంలో ఎన్ని తనిఖీలు చేశారు? ఎన్ని కేసులు పెట్టారు? ఎంత మందిని ప్రాసిక్యూట్ చేశారు? ఈ వివరాలన్నీ తదుపరి విచారణ నాటికి కోర్టు ముందుంచండి. లేనిపక్షంలో కోర్టులంటే ఏమిటో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి’ అని హైకోర్టు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలకు తేల్చిచెప్పింది. కాల్షియం కార్బైడ్‌ను ఉపయో గించి పండ్ల వ్యాపారులు కాయల్ని మగ్గబెట్టి అమ్మకాలు చేస్తుండటంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు పిల్‌గా పరిగణించింది. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. అధికారులు నామమాత్రంగానే ఉన్నారు... ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీ) నియమితులైన సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదిస్తూ..ప్రతీ ఒక్కటి కల్తీ అవుతున్నాయని, కల్తీలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. తనిఖీలు నిర్వహించే అధికారుల సంఖ్య నామమాత్రంగా ఉందని తెలిపారు. ఎఫ్‌ఎస్‌వోలు ఏపీలో 28, తెలంగాణలో 20 మందే ఉన్నారని, అండమాన్‌లోనూ 28 మంది ఉన్నారని, తమిళనాడులో ఏకంగా 554 మంది ఉన్నారని వివరించారు. తనిఖీ అధికారుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టు ఆదేశించినప్పుడో, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పుడో అధికారులు తనిఖీలు చేసి ఊరుకుంటున్నారని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంటేనే ఫలితాలు ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక తనిఖీలు ఎన్ని చేశారు, ఎంతమందిపై కేసు నమోదు చేశారు, కోర్టుల్లో శిక్షలు పడ్డాయా, లేదా పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని 2 రాష్ట్రాలను ధర్మాసనం ఆదేశించింది. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. -
కల్తీ దాణా తిని గేదెలు మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ చంద్రయాణగుట్ట పరిధిలోని బండ్లగూడలో దారుణం చోటు చేసుకుంది. కల్తీ దాణా తిని 11 గేదెలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే... బండ్లగూడకు చెందిన సోహైల్ అనే వ్యక్తి డైరీఫామ్ నిర్వహిస్తున్నాడు. అయితే సోహైల్ గురువారం నిఖిల్ శర్మ అనే వ్యాపారి వద్ద నుంచి దాణా కొనుగోలు చేశాడు. గురువారం రాత్రి గేదెలకు దాణా ఆహారంగా పెట్టాడు. కాగా మరుసటి రోజు ఉదయం చూసేసరికి గేదెలు జీవచ్ఛవాలై పడి ఉన్నాయి. అది చూసి నిర్ఘాంతపోయిన యజమాని చంద్రయాణగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.