కల్తీ దాణా తిని గేదెలు మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ చంద్రయాణగుట్ట పరిధిలోని బండ్లగూడలో దారుణం చోటు చేసుకుంది. కల్తీ దాణా తిని 11 గేదెలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే... బండ్లగూడకు చెందిన సోహైల్ అనే వ్యక్తి డైరీఫామ్ నిర్వహిస్తున్నాడు. అయితే సోహైల్ గురువారం నిఖిల్ శర్మ అనే వ్యాపారి వద్ద నుంచి దాణా కొనుగోలు చేశాడు. గురువారం రాత్రి గేదెలకు దాణా ఆహారంగా పెట్టాడు. కాగా మరుసటి రోజు ఉదయం చూసేసరికి గేదెలు జీవచ్ఛవాలై పడి ఉన్నాయి. అది చూసి నిర్ఘాంతపోయిన యజమాని చంద్రయాణగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.