సాక్షి. పాల్వంచ: ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని గట్టాయిగూడేనికి చెందిన కడాలి శ్రీనాథ్ తాను పనిచేసే బేకరికి దగ్గర్లో ఆడుకోవడానికి వచ్చిన ఓ బాలికకు కేకు ఆశ జూపి దగ్గరకు తీసుకుని అత్యాచారానికి యత్నించాడు. దీంతో బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి శ్రీనాథ్‌కు దేహశుద్ధి చేశారు. అయితే బాలిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గురువారం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు శ్రీనాథ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జె.ప్రవీణ్ తెలిపారు. చదవండి: విషాదం: పోలీస్ దంపతుల ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment